OTT Movie : ఓటిటిలో రకరకాల స్టోరీలతో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. కొన్ని సినిమాలు ఊహాకి అందని స్టోరీలతో ప్రేక్షకుల్ని పిచ్చెక్కిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది. ప్రపంచం మనుషుల వల్ల భారీగా పొల్యూషన్ ఏర్పడుతుంది. అందుకుగాను 20% జనాభాన్ని తగ్గించాలని ఒక దేశ అధ్యక్షుడు ప్లాన్ చేస్తాడు. చివరికి ఒక్కో కుటుంబం నుంచి ఒక వ్యక్తి దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలని ఆదేశాలు ఇస్తాడు. ఆ తరువాత స్టోరీ ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి
స్టోరీలోకి వెళితే
చార్లెస్ యార్క్ అనే వ్యక్తి ప్రముఖ న్యూస్ యాంకర్ గా యూతనేసియాలో పనిచేస్తుంటాడు. అతనికి మొదటి భార్య చనిపోవడంతో, డాన్ కిమ్ ని రెండవ భార్యగా చేసుకుంటాడు. తన నలుగురు టీనేజ్ పిల్లలను ఒకరోజు డిన్నర్‌కు ఆహ్వానిస్తాడు. అతని పిల్లలు ఆంత్రోపాలజిస్ట్ గా జే బరుచెల్, ఫార్మాస్యూటికల్ సీఈఓగా రాచెల్, నటిగా యాష్లీ, డ్రగ్స్ నుండి కోలుకుంటున్న నోహ్ ఉంటారు. ఇక్కడే ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. చార్లెస్ తన పిల్లలతో సహా చార్లెస్ యూతనేసియా పార్టీలో చేరాలని నిర్ణయించినట్లు ప్రకటిస్తాడు. అయితే ఈ ప్రకటన తర్వాత పరిస్థితులు అనుకోని విధంగా మారతాయి. డాన్ యూతనేసియా నుండి తప్పించుకుని పారిపోతుంది. ఎందుకంటే జనాభాని తగ్గించడానికి, కొంత మందిని ప్రభుత్వం కాల్చి చంపుతుంటుంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సిటిజన్ స్ట్రాటజీ (D.O.C.S.) నుండి వచ్చిన బాబ్ అనే వ్యక్తి చార్లెస్ కుటుంబంలో ఒకరు తప్పనిసరిగా చనిపోవడానికి ముందుకు రావాలని డిమాండ్ చేస్తాడు. లేకపోతే ఒకరిని మేమే ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్తారు. ఇది కుటుంబంలో ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అక్కడ చార్లెస్ కొడుకులు ఒకరినొకరు నిందించుకుంటారు. ప్రాణాలు ఎవరివి పోవాలి అనే ఆలోచనలో పడతారు. చివరికి చార్లెస్ తన కుటుంబాన్ని కాపాడుకుంటాడా ? అక్కడి అధికారులను ఎలా ఎదుర్కుంటాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘హ్యూమన్’ (Humane). 2024 లో వచ్చిన ఈ మూవీకి కైట్లిన్ క్రోనెన్‌బర్గ్ దర్శకత్వం వహించారు. ఇందులో జే బరుచెల్, ఎమిలీ హాంప్‌షైర్, సెబాస్టియన్ చాకోన్, అలన్నా బేల్, సిరెనా గులామ్‌గౌస్, యుని పార్క్, ఎన్రికో కొలాంటోని వంటి నటులు నటించారు. ఇది కైట్లిన్ క్రోనెన్‌బర్గ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) ఓటీటీ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.