BigTV English

OTT Movie : కూతుర్ని వెంటాడే తల్లి ఆత్మ … సచ్చినా సాధించడం అంటే ఇదే … చూసినోళ్ళకి చుక్కలే

OTT Movie : కూతుర్ని వెంటాడే తల్లి ఆత్మ … సచ్చినా సాధించడం అంటే ఇదే … చూసినోళ్ళకి చుక్కలే

OTT Movie : ఓటీటీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి వేదికగా మారిపోయింది. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి రావడానికి ఎంతో సమయం పట్టడంలేదు. అందుకే వీటిని సినిమాలలో చూడటం కంటే, ఓటీటీలోనే ఎక్కువగా వీక్షిస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా హారర్ జానర్లో వచ్చింది. ఈ సినిమా వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ తో హడలెత్తిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ?అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

అమండా అనే కొరియన్ మహిళ తన కూతురు క్రిస్సీతో కలసి అమెరికాకు వలస వస్తుంది. వీళ్ళు అమెరికాలోని ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే పొలంలో పని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు తేనెటీగల పెంపకం చేస్తూ, తేనె అమ్ముతూ, కోళ్లను పెంచుతూ ఉంటారు. ఆధునిక జీవితానికి దూరంగానే ఉంటారు. ఎందుకంటే అమండాకు కరెంట్ వల్ల అలెర్జీ వస్తుందని నమ్ముతుంది. ఈ అలెర్జీ ఆమె బాల్యంలో తన తల్లి (ఉమ్మా) ఇచ్చిన కరెంట్ షాక్‌ల ద్వారా వచ్చాయని అనుకుంటుంది. అమండా తన తల్లితో సంబంధాలను తెంచుకుని, కొరియన్ సంస్కృతిని కూడా వదులుకుంటుంది. ఒక రోజు ఆమె మామయ్య కొరియా నుండి వచ్చి, అమండా తల్లి మరణించిందని, ఆమె బూడిదెను తీసుకొస్తాడు. అమండా తన తల్లికి సాంప్రదాయ కొరియన్ ఆచారమైన జెసా (Jesa) నిర్వహించాలని, లేకపోతే ఆమె ఆత్మ శాంతి పొందదని అతను హెచ్చరిస్తాడు.


అయితే అమండా జెసా నిర్వహించకుండా, ఈ బూడిదెను బేస్‌మెంట్‌లో దాచిపెడుతుంది. ఇక అప్పటినుంచి అక్కడ వింత సంఘటనలు జరుగుతాయి. అమండాను తన తల్లి ఆత్మ (ఉమ్మా) వెంటాడుతుంది. అమండా శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆత్మ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అమండాకి అనుకోని సమస్యలు ఎదురౌతాయి. చివరికి అమండా తన తల్లి ఆత్మను ఎలా ఎదుర్కుంటుంది ? అమండా తన తల్లికి ఎందుకు దూరంగా ఉంటోంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే , ఈ సూపర్‌ నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఫోన్ లో అసభ్యంగా వేధించే సైకో గ్యాంగ్ … ఈ అమ్మాయి చేసిన పని తెలిస్తే ఫ్యూజులు అవుట్ 

 

జీ 5 (Zee 5) లో

ఈ అమెరికన్ సూపర్‌ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఉమ్మా’ (Umma). 2022 లో వచ్చిన ఈ సినిమాకి ఐరిస్ K. షిమ్ దర్శకత్వం వహించారు. ఇందులో సాండ్రా ఓహ్, ఫివెల్ స్టీవర్ట్, డెర్మాట్ ముల్రోనీ, ఒడేయా రష్, మీవా అలానా లీ నటించారు. ఈ మూవీని యునైటెడ్ స్టేట్స్‌లో 2022 మార్చి 18న సోనీ పిక్చర్స్ విడుదల చేసింది. ‘ఉమ్మా’ అనే పదం కొరియన్‌లో ‘తల్లి’ అనే అర్థం వస్తుంది. ఈ మూవీ జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×