BigTV English

Horoscope  Today January 16th: ఆ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు 

Horoscope  Today January 16th: ఆ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు 

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 16న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.


మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యే అవకాశం ఉంది.  ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు  నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోక నష్టాలు ఎదుర్కొంటారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక సమయంలో సన్నిహితులు సాయం అందిస్తారు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట చికాకులు అధికమవుతాయి. స్వంత ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వ్యాపారాలలో భాగస్వాములతో బేధాభిప్రాయాలు కలుగుతాయి.

ధనస్సు  రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలు.. ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో మరింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. ఉద్యోగస్తుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

కుంభ రాశి : ఈ రాశి వారు ఈరోజు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు తప్పవు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×