E-Paper
Advertisement

భూమి బద్దలై భారీ సింక్‌హోల్… కట్ చేస్తే క్రీస్తు పూర్వం 10000 నాటి పాత కాలంలోకి

భూమి బద్దలై భారీ సింక్‌హోల్… కట్ చేస్తే క్రీస్తు పూర్వం 10000 నాటి పాత కాలంలోకి
Advertisement

Sci-fi Adventure Thriller on OTT : ఓ రోజు ఉన్నట్టుండి మన కళ్లముందే భూమి రెండుగా చీలిపోతే… ఆ చీలిన గుంతలోకి మనుషులు పడి చచ్చారు అనుకుంటే… అంతలోనే వాళ్ళంతా మన తాతల ముత్తాతల కాలంలోకి వెళ్ళి పడ్డారని తెలిస్తే… క్రేజీగా ఉంది కదా ఈ ఆలోచన. దాన్నే ‘లా బ్రెయా’ (La Brea 2021-2024) అనే సైన్స్ ఫిక్షన్ మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా మన ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ లాస్ ఏంజిల్స్ నగర నడిబొడ్డున ఉన్న ప్రసిద్ధ ‘లా బ్రెయా టార్ పిట్స్’ దగ్గర మొదలవుతుంది. ఓ రోజున సడన్ గా భూమి బద్దలై ఒక భారీ సింక్‌హోల్ ఏర్పడుతుంది. ఆ ప్రమాదంలో వందలాది మంది ప్రజలు, కార్లు, భవనాలు ఆ లోతైన గుంతలోకి పడిపోతాయి. ఈ విపత్తు హారిస్ కుటుంబాన్ని రెండుగా విడదీస్తుంది. తల్లి ఈవ్, కుమారుడు జోష్ ఆ గుంతలోకి పడిపోగా… కూతురు ఇజ్జీ ఆధునిక ప్రపంచంలోనే మిగిలిపోతుంది. ఇక్కడ వచ్చే షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే… గుంతలోకి పడిపోయిన ఈవ్, జోష్ ఇతరులు చనిపోలేదు.

Advertisement

వాళ్ళంతా క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నాటి ప్రాచీన, ప్రమాదకరమైన చరిత్ర పూర్వ భూమిలోకి చేరుకున్నారని గ్రహిస్తారు. అక్కడ భయంకరమైన సబెర్-టూత్డ్ టైగర్లు, భారీ జంతువులు, రాక్షస తెగల మధ్య వారు ప్రాణాలతో బతికి బయట పడడానికి పోరాడాల్సి వస్తుంది. ఆ ప్రపంచంలో ఒకరినొకరు కాపాడుకుంటూ, ఆహారం, ఆశ్రయం కోసం సర్వైవల్ ఫైట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ప్రపంచం అంతా తలకిందులుగా ఉంటుంది. ముందు గందరగోళంగా అన్పించినా, నెమ్మదిగా అక్కడి పరిస్థితులను అవగతం చేసుకుని, అలవాటు పడుతుంటారు.

ఇక ఆధునిక ప్రపంచంలో మిగిలిపోయిన తండ్రి గావిన్ హారిస్ మన హీరో. అతనికి చాలా కాలంగా వింత విజన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే జరగబోయేది అతనికి ముందుగానే కనిపిస్తుంది. కానీ అది చెప్పినప్పుడు అందరూ అతన్ని పిచ్చివాడిలాగా చూస్తారు. కానీ ఇదంతా జరిగాక తన భార్యాపిల్లలు బతికి ఉన్నారని, తనకు వచ్చే విజన్స్ ఆ ప్రాచీన ప్రపంచానికి దారి చూపే తాళాల వంటివని అతను గ్రహిస్తాడు. ఆ తర్వాత గావిన్ విమానాలు, హైటెక్ ప్రయోగాల ద్వారా కాలంలో వెనక్కి వెళ్లి తన కుటుంబాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొనే సవాళ్లు ఏంటి ? చివరికి అతను తన కొడుకు, భార్యను వెనక్కి తీసుకురాగలిగాడా ? క్లైమాక్స్ లో వచ్చే షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

Advertisement

Also Read : ఈ హర్రర్ సినిమాలో నటించిన వారిని వేటాడి చంపిన శాపం… మోస్ట్ కర్స్డ్ మూవీ

తెలుగులోనూ స్ట్రీమింగ్

‘లా బ్రెయా’ అదిరిపోయే సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్. JioHotstarలో తెలుగు డబ్బింగ్ ఆడియోతో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్, ఫ్యామిలీ డ్రామా ఇష్టపడేవారికి బెస్ట్ ఆప్షన్. 2021లో ప్రారంభమై 3 సీజన్లతో విజయవంతంగా ముగిసిన ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ అడ్వెంచర్ సిరీస్ ను డేవిడ్ అప్పల్‌బామ్ క్రియేట్ చేశారు. లాస్ ఏంజిల్స్ నగరంలో జరిగే ఒక భారీ విపత్తు నుంచి మొదలయ్యే ఈ కథ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Tags

Related News

కొడుకును కోసం కాళీమాతలా మారే తల్లి… మదర్ సెంటిమెంట్ తో మెంటలెక్కించే థ్రిల్లర్

ఈ హర్రర్ సినిమాలో నటించిన వారిని వేటాడి చంపిన శాపం… మోస్ట్ కర్స్డ్ మూవీ

సొంత కూతురినే చంపాలనుకునే తండ్రి… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్ట్

ఫీల్డ్ ట్రిప్పుకెళ్తే పిశాచి దాడి… చిన్న పొరపాటుతో ప్రాణాల మీదకు

పగటిపూట సైలెంట్ రాత్రైతే వయోలెంట్ ఈ పిల్ల… నలుగురు సార్ల ఎంట్రీతో ట్విస్ట్

ఫర్నిచర్ షోరూమ్‌లో తీయకూడని తలుపు… లోపలికెళ్తే అంతులేని వింత మిస్టరీ

అనుకోకుండా హత్య కేసులో చిక్కుకునే ఫ్యామిలీ… మతిపోగొట్టే మలయాళం మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×