E-Paper
Advertisement

పిల్లలను తిరుగులేని కిల్లర్స్‌గా మార్చే ప్రాజెక్ట్… ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు ఈ సిరీస్

పిల్లలను తిరుగులేని కిల్లర్స్‌గా మార్చే ప్రాజెక్ట్… ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు ఈ సిరీస్
Advertisement

Action Thriller OTT : మొక్కయి వంగనిదే మానై వంగునా… అంటారు. చిన్నప్పుడే పిల్లలను మంచీచెడ్డ, విద్యాబుద్ధులు నేర్పిస్తే మంచి దారిలో పడతాడు. లేదంటే గాడి తప్పి వారి జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఇదంతా తెలిసిందే గానీ, అదే చిన్న పిల్లల్ని కిల్లర్లుగా తీర్చిదిద్దితే ఎలా ఉంటుంది ? ఆ ఆలోచనకే గుండె గుభేల్మంటుంది కదా. కానీ ఓ డైరెక్టర్ కు మాత్రం ఇలాంటి ఆలోచనే వచ్చింది. దాన్ని ‘Hanna’ సిరీస్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సిరీస్ కథ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్ళే ముందు స్టోరీ ఏంటో చూద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

అసాధారణమైన శక్తులున్న ఓ అమ్మాయి, అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ (CIA) మధ్య సాగే హై-వోల్టేజ్ యాక్షన్ సస్పెన్స్ డ్రామా ఈ సిరీస్. సీఐఏ (CIA) కి చెందిన ‘ఉట్రాక్స్’ అనే ఒక సీక్రెట్ సంస్థ జనాలు కలలో కూడా ఊహించని ప్రయోగాలు చేస్తుంది. అవేంటంటే… పుట్టబోయే పిల్లల డీఎన్ఏను మారుస్తుంది. వారిని అత్యంత ప్రమాదకరమైన సూపర్ అసాసిన్స్ అంటే హంతకులుగా మార్చడానికి ల్యాబ్‌ లో జరుగుతున్న ప్రయోగాలు ఇవే.

Advertisement

మాజీ సీఐఏ ఏజెంట్ ఎరిక్ హెల్లర్ ఆ ల్యాబ్ నుండి ‘హానా’ అనే ఒక చిన్న పాపను కాపాడి ఎస్కేప్ అవుతాడు. ఆమెను ఎవరికీ దొరకకుండా పోలాండ్‌ లోని దట్టమైన అడవిలో దాచి, సీక్రెట్ గా పెంచి పెద్ద చేస్తాడు. హానా (Esme Creed-Miles) కు చిన్నప్పటి నుంచే విలు విద్య, ఫైటింగ్, వేట వంటి స్కిల్స్ లో కఠినమైన శిక్షణ ఇస్తాడు. ఎంతమంది కిల్లర్స్ వచ్చినా ఆమె ఒంటి చేత్తో ఎదుర్కోగల యోధురాలిగా మారుతుంది. ఇక్కడి నుంచి వేట మొదలవుతుంది.

15 ఏళ్ల తర్వాత హానాకు ఓ విచిత్రమైన కోరిక పుడుతుంది. తాను పెరిగి పెద్దయిన ఆ అడవి దాటి బయటి ప్రపంచాన్ని చూడాలని అనుకుంటుంది. కానీ ఆమె బయట అడుగు పెట్టగానే, సీఐఏ అధికారిణి మరిస్సా వీగ్లర్ కు హానా బతికే ఉందనే విషయం అర్థంఅవుతుంది. ఆమె హానాను, ఎరిక్‌ ను చంపడానికి తన సైన్యంతో వేటాడడంతో కథ పరుగులు పెడుతుంది. తనను చంపడానికి సీఐఏ ఎందుకు వెంటాడుతోంది ? అసలు తను ఎవరు ? తన పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏంటి ? అని తెలుసుకోవడానికి హానా చేసే పోరాటం, ఊచకోత క్లైమాక్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళతాయి.

Advertisement

ఈ అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌ను Amazon Prime Video లో చూడవచ్చు. ఈ సిరీస్‌కు తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు, కానీ తెలుగు సబ్‌టైటిల్స్ తో చూడవచ్చు. ఇది ఇంగ్లీష్ ఆడియోతో పాటు హిందీ, తమిళ్ డబ్బింగ్ వెర్షన్లలో స్ట్రీమింగ్ అవుతోంది. 2011 లో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా ‘హానా’ ఆధారంగా తెరకెక్కింది. ఈ సిరీస్ మొత్తం 3 సీజన్లతో, 22 ఎపిసోడ్‌లు ఉంటుంది.

Read Also : స్కూల్లో ఏడిపించేవారి తుక్కురేగ్గొడితే ? ఈ పిల్లాడి చితక్కొట్టుడుకు ఫిదా అయిపోతారు

Tags

Related News

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సందడి.. ఆ రెండు మస్ట్ వాచ్..!

10 ఏళ్లలో 55 బదిలీలు… చివరికి ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా వదలని కానిస్టేబుల్ కథ

పైలెట్ కావాల్సిన కుర్రాడు రెడ్ లైట్ ఏరియాలో ప్రేమంటూ… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే

పేదలకు నరకం… ధనవంతులకు స్వర్గం ఈ రైలు… లైఫ్ లో మరచిపోలేని థ్రిల్లిచ్చే సర్వైవల్ థ్రిల్లర్

కబడ్డీ నుంచి క్రైమ్ వరల్డ్‌లోకి… స్పోర్ట్స్ మూవీ కాదు పక్కా రా యాక్షన్ థ్రిల్లర్

కోరుకున్న వాడిని దక్కించుకోవడానికి ఇవేం మెంటల్ పనులు… ‘అబ్సెషన్’ చూసి ఆగమైనోళ్ల కోసమే ఈ థ్రిల్లర్ సిరీస్

పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుల జీవితం… కానీ ఈ అమ్మాయి చేసిన పని తెలిస్తే దిమాక్ కరాబ్

తల్లి కావాలనే కోరిక… చివరికి బిడ్డ కోసం ఆమె చేసిన పని తెలిస్తే షాక్

Big Stories

Advertisement
×