E-Paper
Advertisement

పెళ్లయినా తీరని కోరికలు… ఓటీటీలోకి బోల్డ్ ఇంటెన్స్ విమెన్ సెంట్రిక్ ఆంథాలజీ సిరీస్

పెళ్లయినా తీరని కోరికలు… ఓటీటీలోకి బోల్డ్ ఇంటెన్స్ విమెన్ సెంట్రిక్ ఆంథాలజీ సిరీస్
Advertisement

Hasratein Season 4 OTT : పెళ్లి, కుటుంబం, సమాజం… ఇవన్నీ ఉన్నా కొంతమంది మహిళల జీవితాల్లో మాత్రం చెప్పుకోలేని కోరికలు, ఒంటరితనం, అసంతృప్తి అలాగే ఉండిపోతాయి. బయటికి చూస్తే అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా… లోలోపల మాత్రం మరో ప్రపంచం గురించే ఆలోచనలు తిరుగుతాయి. ఆ కోరికలను అణచుకోవాలా ? లేక తమకు నచ్చిన జీవితాన్ని ఎంచుకోవాలా ? ఇలాంటి భావోద్వేగాలు, రిలేషన్‌షిప్స్, డిజైర్స్ చుట్టూ ఆరు వేర్వేరు మహిళల కథలను చెప్పే బోల్డ్ ఆంథాలజీ సిరీసే ‘Hasratein Season 4’. మరి ఈ సిరీస్‌లో ఎలాంటి కథలు ఉన్నాయి? ఏ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ ఒకే కథ కాదు. ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త మహిళ కథ , ఆమె జీవితం, ఆమె ఎదుర్కొనే భావోద్వేగ సంఘర్షణ, ఆమె మనసులో దాచుకున్న కోరిక చుట్టూ సాగుతుంది. ప్రేమ, పెళ్లి, రిలేషన్‌షిప్స్, వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజం పెట్టే హద్దులు వంటి అంశాలు ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. సీజన్ 4లో ఆరుగురు మహిళల ఆరు వేర్వేరు కథలు ఉంటాయి. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. ఎవరో పెళ్లి తర్వాత ఏర్పడిన ఒంటరితనంతో పోరాడుతుంటే… మరొకరు తనకు నచ్చిన ప్రేమను ఎంచుకోవడానికి కుటుంబం, సమాజంతో ఎదురెళ్లాల్సి వస్తుంది.

Advertisement

మరికొందరు తమకు నచ్చని బంధాల్లో చిక్కుకుపోయి, సంవత్సరాలుగా మనసులో దాచుకున్న భావాలతో జీవిస్తుంటారు. కానీ ఒక సంఘటన వాళ్లను తమ జీవితంపై తామే నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. అక్కడి నుంచే కథలు కొత్త మలుపు తీసుకుంటాయి. మరో కథలో ప్రేమకు, నమ్మకానికి మధ్య ఉన్న గీత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒకరిని ప్రేమిస్తున్నామంటే వాళ్ల జీవితంపై మనకు హక్కు వచ్చేస్తుందా ? లేక ప్రతి వ్యక్తికీ తన కోరికలు, నిర్ణయాలు తీసుకునే హక్కులు ఉంటాయా ? అనే కోణంలో కథ సాగుతుంది.

ఇక కొన్ని ఎపిసోడ్లలో మహిళలపై సమాజం విధించే రూల్స్ ను కూడా సిరీస్ ప్రశ్నిస్తుంది. మగవాళ్లకు సాధారణంగా కనిపించే కొన్ని విషయాలనే మహిళలు చేస్తే తప్పుగా చూడటం ఎందుకు ? అనే ప్రశ్నను పాత్రల జీవితాల ద్వారా లేవనెత్తారు. అయితే కేవలం బోల్డ్ ఎలిమెంట్స్‌పైనే ఆధారపడకుండా, వాటి వెనుక ఉన్న మానసిక సంఘర్షణను కూడా కథలు చూపిస్తాయి. తమను తాము అర్థం చేసుకోవాలనే ప్రయత్నం, ప్రేమించబడాలనే కోరిక, స్వేచ్ఛగా జీవించాలనే ఆలోచన ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో రూపంలో కనిపిస్తాయి.

Advertisement

చివరికి తమ కోరికలను ఎంచుకున్న తర్వాత ఆ మహిళల జీవితాలు ఎలా మారాయి ? వాళ్ల నిర్ణయాలు నిజంగా ఆనందాన్ని ఇచ్చాయా ? లేక కొత్త సమస్యలను తీసుకొచ్చాయా ? అనేదే ఈ ఆరు కథల్లో చూడాల్సిన ఆసక్తికర విషయం.

Also Read : గుండెను చీల్చీ చూస్తే… టీవీ ప్రత్యక్షం, ఇదెక్కడి థ్రిల్లర్ మామా… మైండ్ బెండింగ్ అనుకో!

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

2026లో వచ్చిన హిందీ ఆంథాలజీ సిరీస్ ఇది. వైభవ్ వంశ్‌రాజ్ సింగ్, అమీత్ గుప్తా దర్శకత్వం వహించగా, రాణి ఛటర్జీ, నిషా రావల్, చాహత్ ఖన్నా, మీరా దేవస్థలే, ఆకాంక్ష పురి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సీజన్ ఆగస్టు 20న విడుదలై ప్రస్తుతం Hungama OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. Airtel Xstream Playలో కూడా హంగామా కంటెంట్ ద్వారా చూడొచ్చు. ఇక ఇది హిందీ భాషలోనే అందుబాటులో ఉంది. A రేటింగ్ ఉండటంతో పెద్దలకు మాత్రమే సరిపోయే కంటెంట్ ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. బోల్డ్ రిలేషన్‌షిప్ డ్రామాలు, మహిళల కోరికలు, ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత స్వేచ్ఛ చుట్టూ సాగే ఈ ఆంథాలజీ సిరీస్ ను సింగిల్ గా చూడడమే బెటర్.

Tags

Related News

టీనేజ్ గర్ల్స్ సీక్రెట్ మిషన్లు… కొత్త విలన్‌తో హై-వోల్టేజ్ యాక్షన్… పాపులర్ స్పై యానిమేషన్ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్

దొంగను పట్టుకోబోయిన ఏజెంట్‌కి చుక్కలు… అడుగడుగునా ట్విస్టులు… ఇదేం కామెడీ భయ్యా

ఇదేం పిచ్చిరా అయ్యా… ప్రియురాలి కోసం పాతాళంలోకి… క్రేజీ మైథలాజికల్ లవ్ స్టోరీ

ఓటీటీలోకి షాకింగ్ మర్డర్ మిస్టరీ… భర్తను చంపిందని భార్య అరెస్ట్… క్లైమాక్స్ లో పిచ్చెక్కించే ట్విస్ట్

ఓటీటీలోకి ట్రెండీ యూత్ కామెడీ… ఒకే ఇంట్లో 5 మంది ఫ్రెండ్స్… రూమ్‌మేట్స్ సీక్రెట్స్ బయటపడితే ఇంత రచ్చా?

డ్యాన్సర్‌ నుంచి కోట్ల సామ్రాజ్యానికి బాస్‌గా… ఓటీటీలోకి తెలుగులో హై-వోల్టేజ్ డ్రామా

ఎయిర్‌పోర్ట్‌లో రోజుకో సమస్య… వాటి వెనుక దిమ్మతిరిగే కథలు… ఈ సిరీస్ మిస్ కావొద్దు

Big Stories

Advertisement
×