BigTV English

OTT Movie : డిటెక్టివ్ భార్యనే బురిడీ కొట్టించే భర్త… పేరు కాని పేరుతో చిక్కుల్లో… ట్విస్టులతో మతిపోగోట్టే క్రేజీ కొరియన్ థ్రిల్లర్

OTT Movie : డిటెక్టివ్ భార్యనే బురిడీ కొట్టించే భర్త… పేరు కాని పేరుతో చిక్కుల్లో… ట్విస్టులతో మతిపోగోట్టే క్రేజీ కొరియన్ థ్రిల్లర్

OTT Movie : క్రేజీ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్స్ కు అడిక్ట్ అయిన మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ సజెషన్. మీరు గనుక ఇలాంటి మూవీ కోసమే వెతుకుంటే ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. ఊహించని మలుపులు, థ్రిల్లింగ్ ట్విస్టులతో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది ఈ సినిమా. అంతేకాదు ఎంగేజింగ్ స్టోరీతో సీట్ ఎడ్జ్ థ్రిల్ ఫీల్ ఇస్తుంది. మరి ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో

ఇది మూవీ కాదు సిరీస్. ఈ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ సిరీస్ పేరు ‘Flower of Evil’ (2020). నేరం, సీక్రెట్స్, ప్రేమ, కుటుంబం గురించి సింపుల్‌గా, కానీ ఆసక్తికరంగా చెప్పే కథ. ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుండే టెన్షన్, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇది కేవలం క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, మనిషి లోపలి మంచి-చెడు, ప్రేమకున్న శక్తి గురించి ఆలోచింపజేస్తుంది. ఈ సిరీస్ క్రైమ్ అండ్ లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్.ను ఇస్తుంది:


16 ఎపిసోడ్‌లతో సాగే ఈ సిరీస్ కి, కిమ్ చియోల్-క్యూ దర్శకత్వం వహించగా, స్టూడియో డ్రాగన్ నిర్మించింది. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. లీ జూన్-గి (బేక్ హీ-సంగ్/డో హ్యున్-సూ), మూన్ చే-వోన్ (చా జి-వోన్), జాంగ్ హీ-జిన్ (డో హే-సూ), సియో హ్యున్-వూ (కిమ్ మూ-జిన్), కిమ్ జి-హూన్ (నిజమైన బేక్ హీ-సంగ్), చోయ్ బ్యుంగ్-మో (డో మిన్-సియోక్) ఇందులో నటించారు. ఈ సిరీస్ 57వ బేక్సాంగ్ ఆర్ట్స్ అవార్డ్స్‌లో బెస్ట్ డ్రామా నామినేషన్ పొందింది. లీ జూన్-గి, మూన్ చే-వోన్ నటనకు విమర్శకుల ప్రశంసలు కురిశాయి. ఈ సిరీస్ ఆకట్టుకునే ఎమోషనల్ సీన్స్, సస్పెన్స్, నటీనటుల కెమిస్ట్రీతో 2020లో టాప్ కొరియన్ డ్రామాలలో ఒకటిగా నిలిచింది.

కథలోకి వెళ్తే…

బేక్ హీ-సంగ్ (లీ జూన్-గి) ఒక పర్ఫెక్ట్ భర్త, తండ్రిగా కనిపిస్తాడు. కానీ అతని నిజమైన పేరు డో హ్యున్-సూ. అతను తన గతం గురించి ఎవ్వరికీ తెలియని ఒక సీక్రెట్ ను రహస్యంగా ఉంచుతాడు. అతని భార్య చా జి-వోన్ (మూన్ చే-వోన్) ఒక పోలీస్ డిటెక్టివ్. ఆమె 15 సంవత్సరాల క్రితం జరిగిన యోంజు సిటీ సీరియల్ కిల్లింగ్స్ కేసును దర్యాప్తు చేస్తుంది. ఈ కేసు హ్యున్-సూ గతంతో ముడిపడి ఉందని తెలియడంతో, ఆమె తన భర్తను అనుమానించడం మొదలు పెడుతుంది. హీ-సంగ్ తండ్రి డో మిన్-సియోక్ ఒక సీరియల్ కిల్లర్. అందుకే హ్యున్-సూను గతంలో గ్రామస్తులు దారుణంగా చూస్తారు. విచారణలో హీ-సంగ్ సోదరి డో హే-సూ (జాంగ్ హీ-జిన్), రిపోర్టర్ కిమ్ మూ-జిన్ (సియో హ్యున్-వూ), బేక్ కుటుంబానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. జి-వోన్ తన భర్తను ప్రేమిస్తూనే, అతనికి సంబంధించిన నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి చివరికి ఆ నిజం ఎలా బయటపడింది? చివరికి హీరో హీరోయిన్ కథ ఎలాంటి టర్న్ తీసుకుంది? అనేది తెరపై చూడాల్సిందే.

Read Also : ఫస్ట్ నైట్ రోజే పైకి పోయే నూతన వధువులు… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా…

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×