BigTV English

OTT Movie : ఫస్ట్ నైట్ రోజే పైకి పోయే నూతన వధువులు… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా…

OTT Movie : ఫస్ట్ నైట్ రోజే పైకి పోయే నూతన వధువులు… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా…

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా వీటిని చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు ప్రేక్షకులు. వీటిలో బెంగాల్ ఇండస్ట్రీ నుంచి కూడా సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ సిరీస్ లో, ఒక సీరియల్ కిల్లర్ మళ్ళీ పెళ్లి చేసుకునే మహిళలను చంపుతుంటాడు. ఈ స్టోరీ చివరివరకూ ఉత్కంఠంగా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

‘Birangana’ ఒక బెంగాలీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నిర్ఝర్ మిత్రా దర్శకత్వంలో హోయిచోయ్ (Hoichoi) ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో 2025 జూలై 25న ప్రీమియర్ అయింది. ఈ సిరీస్‌లో సందీప్తా సేన్, సబ్-ఇన్‌స్పెక్టర్ చిత్రా బసు పాత్రలో నటించగా, నిరంజన్ మొండల్, చిరాయు తాలూక్దార్ అనే ఫ్లోరిస్ట్ పాత్రలో తొలిసారి నటించాడు. ప్రతీక్ దత్తా, శ్రేయా భట్టాచార్య, ఆదిత్య సేన్‌గుప్తా సహాయక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ కొత్తగా పెళ్లైన మహిళలను లక్ష్యంగా చేసుకునే సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ 7 ఎపిసోడ్‌లతో, బెంగాలీ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. IMDbలో 6.5/10 రేటింగ్ ను పొందింది.


స్టోరీలోకి వెళితే

కోల్‌కతాలో ఒక వివాహ వేదికపై కొత్త వధువు వర్షంలో శవంగా కనిపించడంతో ఈ కథ ఆరంభమవుతుంది. సబ్-ఇన్‌స్పెక్టర్ చిత్రా బసు (సందీప్తా సేన్), ఒక ధైర్యవంతమైన పోలీసు అధికారి. ఈ హత్యను ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తుంది. ఈ హత్యలు కొత్తగా పెళ్లైన వధువులను లక్ష్యంగా, ఒక సీరియల్ కిల్లర్ చేతిలో జరుగుతున్నాయని ఆమె గుర్తిస్తుంది. చిత్రా ఈ కేసును విచారణ చేయడానికి ఒక ప్రత్యేక బృందంలో చేరుతుంది. విచారణ సమయంలో చిత్రా, చిరాయు తాలూక్దార్ (నిరంజన్ మొండల్) అనే ఫ్లోరిస్ట్‌ను ఒక పెళ్ళిలో కలుస్తుంది. హత్యల సమయంలో అతని అతని ప్రవర్తన చిత్రాకు అనుమానం కలిగిస్తాయి. చిరాయు గతం విషాదకరంగా ఉంటుంది. అతని తల్లిదండ్రుల విడాకుల కారణంగా, బాల్యం నుంచి అతను క్రూరంగా మారుతాడు. ఈ గాయాలు అతన్ని ఒక సీరియల్ కిల్లర్‌గా మారేలా చేస్తుంది.

Read Also : సెక్యూరిటీతో డాక్టర్ యవ్వారం… దెయ్యం ఎంట్రీతో ట్విస్ట్… ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ థ్రిల్లర్

చిత్రా ఈ హత్యలలో ఒక సీక్రెట్ ను కనిపెడుతుంది. ఈ హత్యలు మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళలతో సంబంధం కలిగి ఉంటాయి. కిల్లర్ వారిని పెళ్ళి జరిగే సమయంలో లక్ష్యంగా చేసుకుంటూ ఉంటాడు. ఈ కేసు విచారణలో చిత్రా ఆమె భర్త కిల్లర్ చేతిలో దాడికి గురవుతారు. కిల్లర్ వాళ్ళనుంచి తప్పించుకుంటాడు. ఆ తరువాత చిరాయు హత్యలు చేసినట్టు ఆధారాలు లేకపోవడంతో, విచారణ ఒక వృద్ధ మహిళ వైపు మళ్లుతుంది. ఇక చిత్రా తన సోదరి జీవితాన్ని పణంగా పెట్టి, నిజమైన కిల్లర్‌ను పట్టుకోవడానికి ఒక ఉచ్చు వేస్తుంది. కథలోని క్లైమాక్స్ ఒక ఉత్కంఠభరితమైన షోడౌన్‌తో ముగుస్తుంది. నిజమైన కిల్లర్ ఎవరు ? మళ్ళీ పెళ్లి చేసుకునే మహిళలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×