BigTV English

OTT Movie: వీడు లవ్ చేస్తాడు… వేరే వాళ్ళు లవ్ చేస్తే చంపుతాడు… వీడెక్కడి సైకోరా బాబూ

OTT Movie: వీడు లవ్ చేస్తాడు… వేరే వాళ్ళు లవ్ చేస్తే చంపుతాడు… వీడెక్కడి సైకోరా బాబూ

OTT Movie : హాలీవుడ్ సినిమాలలో సైకో కిల్లర్ సినిమాలు ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాలలో హింస ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో, వాలెంటైన్స్ డే రోజు ఒక సైకో హత్యలు చేస్తుంటాడు. ఆతరువాత ఒక జంట ఆ సైకోని ఎదుర్కుంటారు. ఈ స్టోరీ చివరివరకూ టెన్షన్ పెట్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ రొమాంటిక్ కామెడీ స్లాషర్ మూవీ పేరు ‘హార్ట్ ఐస్’ (Heart Eyes). ఈ ఏడాదిలో వచ్చిన ఈ మూవీకి జోష్ రూబెన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 7 న థియేటర్లలో విడుదలైంది. ఈ స్టోరీ వాలెంటైన్స్ డే సమయంలో జరుగుతుంది. ఆ సమయంలో ఒక సీరియల్ కిల్లర్ ప్రేమికులను చంపుతుంటాడు. ఈ మూవీ చివరి వరకూ ఆసక్తికరంగా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

గత కొన్ని సంవత్సరాలుగా ‘హార్ట్ ఐస్’ అనే ఒక సీరియల్ కిల్లర్ కిరాతకంగా హత్యలు చేస్తూ ఉంటాడు. ఈ హత్యలు ప్రతి వాలెంటైన్స్ డే రోజున, ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని చంపుతుంటాడు. అతను పసుపు రంగు మాస్క్ ధరించి, ఎర్రటి ‘హార్ట్ ఐస్’ తో కనిపిస్తాడు. ఇప్పుడు స్టోరీ సీటెల్ నగరంలో జరుగుతుంది. ఇక్కడ వాలెంటైన్స్ డే రోజున, ఈ కిల్లర్ మళ్లీ హత్యలను చేస్తాడు. మరోవైపు ఈ స్టోరీ అలీ మెక్‌కేబ్, జే సిమ్మన్స్ మధ్య నడుస్తుంది. అలీ ఒక జ్యువెలరీ కంపెనీలో డిజైనర్‌గా పనిచేస్తుంది. ఆమె తన ప్రియుడు కోలిన్‌తో విడిపోయినందున కృంగిపోయి ఉంటుంది. ఆమె రాసిన ఒక ప్రచార ప్రకటనలో ‘హార్ట్ ఐస్ కిల్లర్’ హత్యల ప్రస్తావన ఉంటుంది. దీంతో ఆమె ఈ సమస్య పరిష్కరించడానికి జేను తీసుకువస్తుంది. జే ఒక నైపుణ్యం కలిగిన మార్కెటింగ్ స్పెషలిస్ట్. వాలెంటైన్స్ డే రోజున అలీ, జే కలిసి పనిచేస్తూ ఉంటారు. అలీ అక్కడ తన మాజీ ప్రియుడిని చూస్తుంది. అప్పుడు జేను తన ప్రియుడిగా నటించమని కోరుతుంది. వాళ్ళు ప్రేమికులుగా నటించడం కంటే  జీవిస్తారు.

దీంతో వారు ‘హార్ట్ ఐస్ కిల్లర్’కి లక్ష్యంగా మారతారు. వాళ్ళను చంపడానికి ఆ కిల్లర్ ప్రయత్నిస్తాడు. ఆ కిల్లర్ నుండి తప్పించుకోవడానికి వీళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సమయంలోనే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అలీ ప్రేమపై నమ్మకం కోల్పోయిన వ్యక్తిగా ఉంటే, జే అందుకు వ్యతిరేకంగా ఉంటాడు. వీరి మధ్య మంచి స్టోరీ నడుస్తుంది. కిల్లర్ వారిని వెంబడిస్తూ, వివిధ చోట్ల దాడులు చేస్తాడు. వాటి నుంచి తప్పించుకుని, చివరికి అలీ, జే కలిసి కిల్లర్‌ను ఎదుర్కొంటారు. అతన్ని చంపి అతని మాస్క్ కూడా తీస్తారు. అలీ, జే ప్రేమలో పడతారు. ఆ తరువాత కిల్లర్ ఇంకా బతికే ఉన్నాడని, జేను బందీగా పట్టుకున్నాడని ఒక ఫోన్ కాల్ ద్వారా అలీకి తెలుస్తుంది.ఈ ట్విస్ట్ తో మూవీ ఎండ్ అవుతుంది.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×