SRH VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో పూర్తి అయ్యాయి. ఇవాళ ఏడవ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జత మధ్య ఈ ఏడవ మ్యాచ్ నిర్వహించబోతున్నారు. హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో… సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది.
హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రసారాలు జియో హాట్ స్టార్ లో వస్తాయి. జియో కస్టమర్ లందరూ ఈ మ్యాచ్ను ఉచితంగానే చూడవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా… ఐపీఎల్ మ్యాచ్ లు వస్తున్నాయి. ఇక ఇవాళ ఉప్పల్ వేదికగా మ్యాచ్ ఉన్న నేపథ్యంలో… తెలుగు క్రికెట్ అభిమానులు చాలామంది స్టేడియానికి రాబోతున్నారు.
Also Read: Rishabh Pant: డకౌట్ తో కూడా పంత్ కోట్లు.. ఒక్క మ్యాచ్‌కు ఎంతంటే ?
300 కొట్టడం పక్కా
లక్నో పైన సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో… భారీ స్కోర్ నమోదు అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. కే ఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్నప్పుడు గతంలో లక్నో వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. అప్పుడు… ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ చుక్కలు చూపించారు. ఇక ఇవాల్టి మ్యాచ్లో కూడా హైదరాబాద్ బ్యాటర్లు రెచ్చిపోతారని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇవాల్టి మ్యాచ్లో మొదట హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తే 300 కొట్టడం పక్కా అంటున్నారు క్రికెట్ అభిమానులు.
ఉప్పల్లో తమన్ ఈవెంట్
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో… టాలీవుడ్ మ్యూజిక్ దర్శకుడు తమన్ ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించబోతున్నాడు. ఈ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు తమన్.. స్టేడియంలో తన మ్యూజిక్ ఈవెంట్ నిర్వహిస్తారని సమాచారం అందుతుంది. దీంతో ఇవాళ క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా అందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Most Ducks In IPL: డకౌట్ లో కూడా మ్యాక్సీ మామ రికార్డ్… టాప్ లో ఉన్న 5 గురు ప్లేయర్లు వీళ్లే !
సన్‌రైజర్స్ హైదరాబాద్ VS లక్నో సూపర్ జెయింట్స్ జట్ల అంచనా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ XII : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, SRH ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (wk), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్ ప్రాబబుల్ XII : ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (c & wk), డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్