E-Paper
Advertisement

తప్పిపోయిన ఆవు కోసం అమాయకపు చిన్నారి అడ్వెంచర్… కన్నీళ్ళు పెట్టించే కన్నడ కథ

తప్పిపోయిన ఆవు కోసం అమాయకపు చిన్నారి అడ్వెంచర్… కన్నీళ్ళు పెట్టించే కన్నడ కథ
Advertisement

Kannada Family Drama : మనసుకు హత్తుకునే ఓ మంచి సినిమా కోసం ఓటీటీలో వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ మీ కోసమే. పైగా దీన్ని కుటుంబం అంతా కలిసి చూడవచ్చు. ఆ మూవీనే ‘వలవర’ (Valavaara). 2026 జనవరిలో విడుదలైన హార్ట్ టచింగ్ కన్నడ రూరల్ కమింగ్-ఆఫ్-ఏజ్ ఫ్యామిలీ డ్రామా. సుతాన్ గౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో పిల్లల మనస్తత్వాలు, పక్షపాతాలు, కుటుంబ బాధ్యతల చుట్టూ తిరుగుతుంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

ఒక పేద కుటుంబానికి చెందిన పెద్ద కొడుకు, అమాయకపు కుర్రాడు కుందేశి (మాస్టర్ వేద కౌశల్). వ్యవసాయ చేసుకుంటూ బతుకుతుంది ఈ ఫ్యామిలీ. కుందేశి తమ్ముడు కోసుడి (మాస్టర్ శయన్). తండ్రి మూర్తికి పెద్ద కొడుకు కంటే చిన్న కొడుకే ఇష్టం. చిన్న కొడుకుపైనే ఇష్టంతో ఎప్పుడూ పెద్ద కొడుకుపై కోప్పడుతూ పక్షపాతం చూపే కఠినమైన వ్యక్తి. కుందేశిని ఎంతగానో ప్రేమిస్తుంది తల్లి (హర్షిత గౌడ). కర్ణాటకలోని సకలేష్‌పూర్ అనే అందమైన పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

Advertisement

ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పటికీ, తండ్రి ఎప్పుడూ చిన్న కొడుకు కోసుడిపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తూ, పెద్ద కొడుకు కుందేశిని నిర్లక్ష్యం చేస్తుంటాడు. తండ్రి ప్రవర్తన వల్ల కుందేశి మనసులో తీవ్రమైన అభద్రతాభావం, భయం ఏర్పడతాయి. అతనికి అమ్మే సర్వస్వం. ఒకరోజు తండ్రి ఇంట్లో లేని సమయంలో, ఈ అన్నదమ్ములు ఇద్దరూ తమ కుటుంబానికి ఎంతో ముఖ్యమైన, గర్భంతో ఉన్న ఒక ఆవును మేత కోసం బయటకు తీసుకెళ్తారు. అయితే ఆ ఆవు అకస్మాత్తుగా పక్కనే ఉన్న ఒక రైతు పొలంలోకి వెళ్లి పంటను పాడు చేసి, ఎక్కడికో తప్పిపోతుంది.

ఆవు కనిపించకుండా పోవడంతో కుందేశి తీవ్రమైన ఆందోళనకు గురవుతాడు. తండ్రి తిరిగి వచ్చేలోపు ఎలాగైనా ఆవును వెతికి పట్టుకోవాలని, లేదంటే తండ్రి చేతిలో తీవ్రమైన దెబ్బలు తప్పవని భయపడతాడు. అలా ఆ తప్పిపోయిన ఆవు కోసం ఆ ఇద్దరు చిన్న పిల్లలు అడవులు, కొండలు దాటుకుంటూ చేసే ఒకే ఒక్క రోజు ప్రయాణమే ఈ సినిమా. మరి ఆ ఆవును తిరిగి తీసుకురావడానికి ఆ పిల్లాడు ఏం చేశాడు ? ఎక్కడెక్కడ తిరిగాడు ? ఈ క్రమంలో వాడికి ఎదురైన సమస్యలు ఏంటి ? అన్నది సినిమా. క్లైమాక్స్ ఎమోషనల్ ఉంటుంది.

సినిమాను ఎక్కడ చూడవచ్చు?

Advertisement

ఈ హార్ట్ టచింగ్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. దీన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5లో వీక్షించవచ్చు.

Read Also : 816 కోట్ల క్లాసిక్ సూపర్ హిట్ వార్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా… ఏ ఓటీటీలో ఉందంటే ?

Tags

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×