OTT Movie : ఆడవాళ్లు సమాజంలో ఎదుర్కునే సమస్యలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే గుజరాతి సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గర్బా నృత్యం ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఎన్నో అవార్డులను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. 50వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవంలో (IFFI) ఇండియన్ పనోరమా ఓపెనింగ్ ఫిల్మ్‌గా ఎంపికైంది. దర్శకుడి ఉత్తమ తొలి చిత్రంగా నామినేట్ అయింది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘హెల్లారో’ (2019) గుజరాతీ పీరియాడిక్ డ్రామా సినిమా. దీనికి అభిషేక్ షా దర్శకత్వం వహించారు. దీనిని హర్ఫన్‌మౌలా ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో జయేష్ మోర్, శ్రద్ధా డంగర్, బృందా త్రివేది నాయక్, శచి జోషి, నీలం పంచాల్, తేజల్ పంచసారా ప్రధాన పాత్రల్లో నటించారు. 1975లో గుజరాత్‌లోని కచ్ లో ఈ స్టోరీ గర్బా నృత్యం చుట్టూ తిరుగుతుంది. ఇది 2019 నవంబర్ 8న థియేటర్లలో విడుదలైంది, IMDbలో ఈ సినిమా 8.6/10 రేటింగ్ ను పొందింది. ఈ సినిమా ShemarooMe, Amazon Prime Videoలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
1975లో గుజరాత్‌లోని కచ్ లో ఒక చిన్నఎడారి గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఈ గ్రామంలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మహిళలకు స్వేచ్ఛ ఏమాత్రం ఉండదు. వీళ్ళ జీవితాలు పురుషుల నియంత్రణలో ఉంటాయి. మహిళలు ఇంటి పనులు చేయడం, నీళ్లు తెచ్చేందుకు దూరంగా ఉన్న చెరువుకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. ఇక నవరాత్రి సమయంలో గర్బా నృత్యం నుండి కూడా మహిళలను దూరం పెడతారు. ఎందుకంటే గ్రామ పెద్దలు ఆడవాళ్లు నృత్యం చేస్తే అశుభంగా భావిస్తారు. మరోవైపు ఈ గ్రామంలో వర్షం లేకపోవడం వల్ల కరువు సమస్యలు పెరుగుతాయి. మహిళలు ఈ బాధలను భరించాల్సి వస్తుంది. ఈ క్రమంలో మంజ్రీ అనే ఒక కొత్తగా పెళ్ళయిన మహిళ, తన భర్త అర్జన్ చేత హింసకు గురవుతుంటుంది. ఆమె జీవితం ఇతర గ్రామ మహిళల లాగే అణచివేతతో ఉంటుంది.
ఒక రోజు మహిళలు నీళ్లు తెచ్చేందుకు చెరువుకు వెళుతున్నప్పుడు, ముల్జీ అనే ఒక డోలీ ఎడారిలో అలసిపోయి దాహంతో కనిపిస్తాడు. మంజ్రీ, ఇతర మహిళలు అతనికి తాగడానికి నీళ్ళు ఇస్తారు. అతను కృతజ్ఞతగా తన ఢోల్‌ను వాయిస్తాడు. ఈ ఢోల్ శబ్దం మహిళలలో ఒక ఆవేశాన్ని రేకెత్తిస్తుంది. ఇక ఈ మహిళలు రహస్యంగా గర్బా నృత్యం చేయడం మొదలెడతారు. ఈ నృత్యం వారికి ఒక కొత్త శక్తిని ఇస్తుంది. ఈ రహస్య గర్బా సెషన్స్ మహిళల జీవితాలను మార్చేస్తాయి. వారు తమను తాము అందంగా చూసుకోవడం మొదలెడతారు. చిన్న చిన్న తిరుగుబాట్లు చేస్తారు. వారి ఇళ్లలో ధైర్యంగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా మంజ్రీ తన భర్తకు ఎదురు తిరగడం మొదలెడుతుంది.
Read Also : మరదలు అనుకుని దెయ్యాన్ని కిడ్నాప్… కట్ చేస్తే మరో దెయ్యం ఎంట్రీ… అడ్డంగా బుక్కయ్యే బకరాలు