OTT Movie : రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలతో చాలా సినిమాలు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా రియల్ లైఫ్ సంఘటన ఆధారంగా తీశారు. ఈ మూవీలో ఒలంపిక్స్ పథకం కొట్టాల్సిన అమ్మాయి, ఒళ్ళు అమ్ముకోవడానికి సిద్ధపడుతుంది. చివరికి ఆమె జీవితం ఎలా సాగుతుంది అనే స్టోరీ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో
ఈ హాలీవుడ్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘హర్ బాడీ‘ (Her body). ఒలంపిక్స్ కి వెళ్లాలనుకుని ఎన్నో కలలు కన్న ఒక అమ్మాయి, ఒళ్ళు అమ్ముకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది అనే స్టోరీ చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ మూవీకి నటాలీ సిసారోవ్‌స్కా దర్శకత్వం వహించారు. చెక్ హై డైవింగ్ జాతీయ జట్టు సభ్యురాలు అయిన ఆండ్రియా, మోడల్ గా మారి 2004లో 27 సంవత్సరాల వయస్సులో మరణించింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఆండ్రియా చదువులో కాస్త వెనకబడినా, స్పోర్ట్స్ లో మాత్రం ముందు ఉండేది. ఆమె టాలెంటును గుర్తించిన తల్లిదండ్రులు, ఆండ్రియాను మంచి అథ్లెట్ ను చేస్తారు. ఆండ్రియా డైవింగ్ లో ఒలంపిక్స్ కి సెలెక్ట్ అవుతుంది. ఈ క్రమంలో ప్రాక్టీస్ మొదలుపెడుతుంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆమె తలకు గాయం అవుతుంది. హాస్పిటల్ లో జాయిన్ అయిన తర్వాత డాక్టర్లు ఆమెకు షాక్ ఇచ్చే న్యూస్ చెప్తారు. మెడ భాగం బాగా డామేజ్ అవ్వడంతో, ఇక ఎప్పుడూ స్పోర్ట్స్ జోలికి పోకూడదని చెప్తారు. ఈ విషయం విన్న ఆండ్రియా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఎన్నో కలలు కంటే, చివరికి కలలుగానే మిగిలిపోయాయని బాధపడుతుంది. చదువులో కూడా వెనకబడటంతో, ఏం చేయాలో తోచక కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటుంది. ఆమెను చూసి పేరెంట్స్ కూడా బాధపడుతూ ఉండటంతో, ఒక మార్ట్ లో పనిచేయడానికి వెళ్తుంది. కొంతకాలం అక్కడే పని చేసుకుంటూ ఉండగా, అక్కడికి తనకి ఇదివరకే పరిచయం ఉన్న డేవిడ్ వస్తాడు. ఆండ్రియా అంటే ఇష్టం ఉండటంతో డిన్నర్ కి వెళ్దామని అడుగుతాడు. ఆండ్రియా కూడా అందుకు ఒప్పుకొని అతనితో వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ ఏకాంతంగా కూడా గడుపుతారు.
ఆ తర్వాత డేవిడ్ పెద్దలు మాత్రమే చూడగలిగే సినిమాలు చేస్తున్నాడని తెలుసుకొని, వాటిలో నేను కూడా నటిస్తానని అడుగుతుంది. అందుకు డేవిడ్ బాగా ఆలోచించుకోమని చెప్తాడు. ఎందుకంటే సమాజంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తాడు. ఆండ్రియా అటువంటి సినిమాలలో నటించాలని ఫిక్స్ అయిపోతుంది. అయితే ఆండ్రియా అందంగా ఉండటంతో, కొంత కాలంలోనే ఫేమస్ అయిపోతుంది. నేషనల్ ప్రాజెక్ట్ తో పాటు, ఇంటర్నేషనల్ ప్రాజెక్టు కూడా ఆమె చేతిలోకి వస్తుంది. అయితే ఒకరోజు ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఎదుగుదామనుకున్న పరిస్థితి వచ్చినప్పుడల్లా ఏదో ఒక సమస్య ఆమెను వెంటాడింది. చివరికి ఆమెకు మరొక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆండ్రియాకి బ్రెయిన్ క్యాన్సర్ ఉందని డాక్టర్లు చెబుతారు. అయితే నిజ జీవితంలో చివరికి క్యాన్సర్ తో పోరాడి ఆమె చనిపోతుంది. మూవీలో మాత్రం క్యాన్సర్ తో పోరాడి గెలిచినట్టు చూపిస్తారు. సమయం అనుకూలించనప్పుడు, ఎంతటి వారైనా కాలానికి తలవంచక తప్పదు. ఈమె జీవితం కూడా అలాగే ముగిసిపోయింది.