BigTV English

Anil Ravipudi: అనిల్ రావిపూడి టాప్ సీక్రెట్‌ను బయటపెట్టిన నటుడు.. వద్దంటూ రిక్వెస్ట్ చేసినా వినలేదుగా.!

Anil Ravipudi: అనిల్ రావిపూడి టాప్ సీక్రెట్‌ను బయటపెట్టిన నటుడు.. వద్దంటూ రిక్వెస్ట్ చేసినా వినలేదుగా.!

Anil Ravipudi: కామెడీ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). వెంకటేశ్‌తో అనిల్ తెరకెక్కించిన హ్యాట్రిక్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న విడుదల కానుంది. అందుకే ఈ ప్రమోషన్స్‌లో అనిల్ బిజీగా గడిపేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. అందులో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో తమిళ నటుడు వీటీవీ గణేష్ (VTV Ganesh) కూడా పాల్గొన్నారు. అందరి ముందు అనిల్ రావిపూడికి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్‌ను గణేశ్ రివీల్ చేసేశారు.


అనిల్‌కు ఆఫర్

టాలీవుడ్‌లో అనిల్ రావిపూడికి ఇప్పటికే హిట్ డైరెక్టర్ అనే పేరు వచ్చేసింది. అయితే దళపతి 69ను డైరెక్ట్ చేసే అవకాశం తనకు వచ్చిందంటూ రివీల్ చేశారు వీటీవీ గణేశ్. దాని గురించి మాట్లాడొద్దని, మేకర్సే ఇంకా అధికారికంగా ప్రకటించలేదని అనిల్ రావిపూడి ఎంత రిక్వెస్ట్ చేసినా గణేశ్ వినలేదు. ‘‘ఆరు నెలల క్రితం విజయ్‌తో షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను పిలిచి అనిల్ రావిపూడిని తన మూవీ డైరెక్ట్ చేయమని చెప్పమని అడిగారు. అనిల్ నాకు తెలుసని విజయ్‌కు తెలుసు. అందుకే దళపతి 69ను డైరెక్ట్ చేయమని చెప్పమన్నారు. కానీ అనిల్ మాత్రం ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు’’ అని వీటీవీ గణేశ్ చెప్తుండగానే అనిల్ మధ్యలో అడ్డుకున్నా ఆయన వినలేదు.


Also Read: ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ..

రీమేక్ చేయనన్నాడు

‘‘దళపతి 69ను డైరెక్టర్ చేయడానికి 4,5 పెద్ద డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. కానీ అదే అవకాశం అనిల్ రావిపూడికి వస్తే తను రిజెక్ట్ చేశాడు. భగవంత్ కేసరి సినిమాను తాను అయిదుసార్లు చూశానని, అందుకే దళపతి 69ను అనిల్ డైరెక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నట్టు విజయ్ (Vijay) నాకు స్వయంగా చెప్పాడు. కానీ అనిల్ మాత్రం తాను రీమేక్ డైరెక్ట్ చేయనని చెప్పి రిజెక్ట్ చేసేశాడు’’ అంటూ మొత్తం పూర్తిగా వివరించారు వీటీవీ గణేశ్. గణేశ్ అంతా రివీల్ చేయడంతో అనిల్ రావిపూడికి కూడా నిజం ఒప్పుకోక తప్పలేదు. ఒక రీమేక్‌ను డైరెక్ట్ చేయమన్నారు కాబట్టే దళపతి 69ను రిజెక్ట్ చేశానని దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

డిస్కషన్స్ జరిగాయి

‘‘దళపతి విజయ్ నాకు ఫోన్ చేశారు. మా మధ్య డిస్కషన్స్ జరిగాయి. దళపతి 69 (Thalapathy 69) గురించి విజయ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అందుకే నాకు కూడా దాని గురించి ఇంకా మాట్లాడాలని లేదు. నా మీద ప్రేమతో గణేశ్ అంతా బయటపెట్టేశారు. కానీ నాకు, విజయ్‌కు మధ్య జరిగిన డిస్కషన్ చాలా వేరే. నాకు ఆయనంటే గౌరవం. ఆయన స్క్రిప్ట్‌కు చాలా ప్రాముఖ్యత ఇస్తారు’’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. దీన్ని బట్టి చూస్తే అనిల్, గణేశ్ కలిసి దళపతి 69 అనేది ‘భగవంత్ కేసరి’ రీమేక్ అని కన్ఫర్మ్ చేసినట్టే అనిపిస్తోంది. కానీ తాజాగా ఈ మూవీ దర్శకుడు సైతం ఇది రీమేక్ కాదని ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ అసలు ఇది రీమేకా? కాదా? అని కన్ఫ్యూజన్‌లో పడ్డారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×