BigTV English

Varun Tej: ఇప్పటికే మూడుసార్లు దెబ్బతిన్న వరుణ్ తేజ్.. ‘మట్కా’తో మరో భారీ రిస్క్

Varun Tej: ఇప్పటికే మూడుసార్లు దెబ్బతిన్న వరుణ్ తేజ్.. ‘మట్కా’తో మరో భారీ రిస్క్

Varun Tej: మెగా హీరోలకు హిట్స్ ఉన్నా లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి అవకాశాలు మాత్రం బాగానే వస్తుంటాయి. కానీ వారికి హిట్స్ లభిస్తేనే వారి మార్కెట్ పెరుగుతుంది. లేకపోతే కొన్నాళ్లకే దానికి తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో చిక్కుకున్న మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమాతోనే యాక్టింగ్ బాగుంది అంటూ మంచి రెస్పాన్స్‌ను అందుకున్న వరుణ్.. గత కొన్నాళ్లుగా ఒక్క హిట్ కూడా లేక బాధపడుతున్నాడు. త్వరలోనే ‘మట్కా’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయినా.. దీంతో తను పెద్ద రిస్కే తీసుకుంటున్నాడు. ఒకవేళ ఇది వర్కవుట్ అయితే మళ్లీ తను ఫార్మ్‌లోకి వస్తాడు. అవ్వకపోతే పరిస్థితి ఏంటి అని ఫ్యాన్స్‌లో సైతం ఆందోళన మొదలయ్యింది.


మార్కెట్ ఎంతంటే

మామూలుగా వరుణ్ తేజ్ (Varun Tej) సినిమాకు ఖర్చు పెట్టడానికి నిర్మాతలు పెద్దగా వెనకాడరు. రూ.30 నుండి 40 కోట్ల వరకు బడ్జెట్ పెడితే వరుణ్ తేజ్ ఎలాగైనా వాటిని రాబట్టగలడని ఇప్పటికీ చాలామందికి నమ్మకం ఉంది. కానీ తన మూడు సినిమాలు ఏ రేంజ్‌లో డిశాస్టర్ అయ్యాయంటే కనీసం బడ్జెట్‌లో 20 శాతాన్ని కూడా రాబట్టలేకపోయాయి. వరుణ్ తేజ్ స్టోరీ సెలక్షన్‌కు, యాక్టింగ్‌కు ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయి కానీ అవి తన మార్కెట్‌ను కాపాడలేకపోతున్నాయి.


Also Read: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. ప్లానింగ్ మాత్రం అదుర్స్

వాటి పరిస్థితి ఇది

వరుణ్ తేజ్ గత మూడు సినిమాల విషయానికొస్తే.. ముందుగా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘గని’ అనే సినిమా చేశాడు ఈ హీరో. ఆ మూవీ రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అందులో బాక్సర్‌గా కనిపించడం కోసం వరుణ్ సైతం చాలా కష్టపడ్డాడు. కానీ దానికి రూ.8 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘గాండీవధారి అర్జున’ అనే సినిమాలో నటించాడు. ఆ మూవీ దాదాపుగా రూ.46 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా కేవలం రూ.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించి డిశాస్టర్‌గా నిలిచింది. ఇక వరుణ్ తేజ్ చివరి సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగుతో పాటు హిందీలో ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అది కూడా రూ.9 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగింది.

భారీ బడ్జెట్

వరుణ్ తేజ్ గత సినిమాల బడ్జెట్, వాటి కలెక్షన్‌ను బట్టి చూస్తే తన మార్కెట్ అంతగా బాలేదు. అయినా కూడా తన అప్‌కమింగ్ మూవీ ‘మట్కా’ (Matka) కోసం రూ.50 కోట్ల బడ్జెట్ కేటాయించారు మేకర్స్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం రూ.50 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్‌తోనే ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ మార్కెట్ బాలేకపోయినా.. ఇంత బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించడానికి మేకర్స్ ముందుకొస్తే, ఇంత బడ్జెట్‌తో ఒక గ్యాంగ్‌స్టర్ పీరియాడిక్ డ్రామాలో నటించి ఈ మెగా హీరో కూడా రిస్క్ తీసుకుంటున్నాడు. మరి నవంబర్ 14న విడుదల కానున్న ‘మట్కా’ వరుణ్ తేజ్ కెరీర్‌లో వేగం పెంచనుందా లేదా చూడాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×