BigTV English

OTT Movie : అద్దెకు వచ్చి అరాచకం … ఇంటి ఓనర్ పైకే ఆత్మలను పంపే రిచువల్ .. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హర్రర్ థ్రిల్లర్

OTT Movie : అద్దెకు వచ్చి అరాచకం  … ఇంటి ఓనర్ పైకే ఆత్మలను పంపే రిచువల్ .. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హర్రర్ థ్రిల్లర్

OTT Movie : నింగ్, క్విన్ అనే జంట 7 ఏళ్ల కూతురు ఇంగ్ తో కలసి జీవిస్తుంటారు. వీళ్ళు అవుట్ హౌస్ ను ఇంటి ఖర్చుల కోసం అద్దెకు ఇస్తుంటారు. ఆ ఇళ్ళు డ్యామేజ్ అవ్వడంతో, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు తమ ఇంటిని అద్దెకిచ్చి, అవుట్ హౌస్ లోకి మారాలని అనుకుంటారు.  అద్దె కోసం రిటైర్డ్ డాక్టర్ రాత్రీ, ఆమె కూతురు నుచ్ కొత్తగా  వస్తారు. అయితే వీళ్ళు వచ్చాక అక్కడ వింత సంఘటనలు మొదలవుతాయి. నింగ్ భర్త క్విన్ విచిత్రంగా ప్రవర్తించడం, ఇంగ్‌ కు అపాయం ఉన్నట్లు గమనిస్తుంది నింగ్. ఈ అద్దెకు వచ్చిన వాళ్ళు నిజంగా ఎవరు? వారి డార్క్ సీక్రెట్ ఏమిటి? నింగ్ తన కూతురిని కాపాడగలదా ? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

నింగ్, క్విన్  అనే జంట 7 ఏళ్ల కూతురు ఇంగ్ తో కలసి సాధారణ జీవితం గడుపుతుంటారు.  నింగ్ తమ అవుట్ హౌస్ అద్దెకిచ్చి ఆదాయం పొందుతుంటుంది.  కానీ గత అద్దెదారులు దానిని ధ్వంసం చేయడంతో రిపేర్‌లకు డబ్బు అవసరం అవుతుంది. రియల్టర్ టామ్ సలహాతో, వారు తమ ఇంటిని అద్దెకిచ్చి, అవుట్ హౌస్ లోకి మారాలని నిర్ణయించుకుంటారు. క్విన్ అందుకు మొదట ఒప్పుకోడు, కానీ రాత్రీ, నుచ్‌ను  కలిసిన తర్వాత ఒప్పుకుంటాడు. వీళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత, వింత సంఘటనలు మొదలవుతాయి. నింగ్ పొరుగు ఆంటీ అయిన ఫోర్న్, రాత్రీ ఇంటి వెలుపల కాకి ఈకలు, చంటింగ్ సౌండ్స్ ను  గమనిస్తుంది. ఆమె కుక్క కూడా బ్రూటల్‌గా చంపబడుతుంది.


రాత్రీ డాక్టర్ కాదని, ఆమె నుచ్ తో కలసి  ఒక కల్ట్‌లో ఉన్నారని నింగ్ తెలుసుకుంటుంది. అయితే క్విన్ ప్రవర్తన కూడా ఉన్నట్టుండి మారుతుంది. తను సీక్రెటివ్‌గా ఒక  రెడ్ బుక్‌తో తిరుగుతాడు. ఛాతీపై వింత టాటూ వేయించుకుంటాడు. ఇంతలో ఇంగ్‌పై డేంజర్ ఉందని గ్రహిస్తుంది నింగ్.  మరో వైపు క్విన్ రాత్రీతో కలిసి ఏదో సీక్రెట్ ప్లాన్‌లో ఉన్నట్లు కనిపిస్తాడు. ఒకప్పుడు క్విన్‌కు జా అనే కూతురు ఉండేది.  ఆమె ట్రాజిక్‌గా చనిపోయింది. రాత్రీ నిజానికి ఒక కల్ట్ లీడర్. ఆమె క్విన్‌ను మానిపులేట్ చేస్తూ, జా స్పిరిట్‌ను ఇంగ్ బాడీలోకి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని చెప్పి అతన్ని కల్ట్‌లోకి లాగుతుంది. రాత్రీ గతంలో తన కూతురు ప్రే స్పిరిట్‌ను ఒక గురి డాల్‌లో ప్రిజర్వ్ చేసింది. ఇప్పుడు ఇంగ్‌ను సాక్రిఫైస్‌గా ఉపయోగించాలనుకుంటుంది.

రియల్టర్ టామ్ కూడా ఒక కల్ట్ మెంబర్.  నింగ్ అవుట్ హౌస్ డ్యామేజ్ చేయడం ద్వారా ఈ ప్లాన్‌ను సెట్ చేశాడు. నింగ్ తన కూతురిని కాపాడేందుకు కల్ట్‌తో ఫైట్ చేస్తుంది. రాత్రీ, నుచ్ కలసి ఇంగ్‌ను టార్గెట్ చేస్తూ రిచువల్ పెర్ఫార్మ్ చేస్తుంటారు. ఇక ఇంగ్‌ తండ్రి క్విన్ తన తప్పును గ్రహించి, జా స్పిరిట్‌ను రిలీజ్ చేయడానికి డాల్‌పై రక్తంతో సింబల్ డ్రా చేస్తాడు. ఈ ప్రాసెస్‌లో జా స్పిరిట్ ఇంగ్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆతరువాత ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. చివరికి రాత్రీ, నుచ్ నిజంగా ఎవరు? వారి కల్ట్ ప్లాన్ ఏమిటి? ఇంగ్ బాడీలో జా స్పిరిట్ ఎంటర్ అయ్యాక ఏం జరుగుతుంది? నింగ్ తన కుటుంబాన్ని కాపాడగలదా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : నాన్ వెజ్ కోసం భర్తనే వదిలేయడానికి సిద్ధమయ్యే భార్య… క్లైమాక్స్ ట్విస్ట్ మామూలుగా ఉండదు మావా

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ థాయ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హోమ్ ఫర్ రెంట్’ (Home for Rent). 2023 లో వచ్చిన ఈ సినిమాకి సక్దాఫిసిట్ దర్శకత్వం వహించారు.ఇది రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో నిత్థా జిరాయుంగ్యుర్న్ (నింగ్), సుకోల్లావత్ కనారోట్ (క్విన్), మరియు పెన్పాక్ సిరికుల్ (రాత్రీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి IMDb లో 6.6/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×