విద్యుత్ అధికారుల వ్యవహారం ఇద్దరు యువకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. సరిగా కరెంటు సరఫరా చేయకపోవడంతో పాటు ఎప్పుడు వస్తుందో చెప్పాలని అధికారులను అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో కోపం కట్టలు తెంచుకుంది. ఓ క్యాన్ లో పెట్రోల్ నింపుకుని నేరుగా సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్లారు. సబ్ స్టేషన్ మీద వెంటతెచ్చుకున్న పెట్రోల్ చల్లి నిప్పు అంటించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లా వాల్గావ్ లో జరిగింది. సబ్ స్టేషన్ తో పాటు బ్యూటీలో ఇంజినీర్ పైగా పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సదరు యువకులను అరెస్ట్ చేశారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఈ ఘటనకు సంబంధించి అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. గంటల తరబడి కరెంటు లేకపోవడం వల్ల ఆగ్రహంతో యువకులు రెచ్చిపోయినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి రేవాసా గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను సంప్రదించడానికి పదే పదే చేసిన ప్రయత్నం చేసినా సదరు యువకులకు సరైన సమాధానం రాలేదు. పైగా వారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడం, రోజుల తరబడి కరెంటు లేకపోవడంతో గ్రామస్తులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వాల్గావ్ విద్యుత్ సబ్ స్టేషన్ కు ర్యాలీ తీశారు.
సబ్‌స్టేషన్‌కు నిప్పంటించిన యువకులు
ఈ ర్యాలీ నేరుగా సబ్ స్టేషన్ దగ్గరికి రాగానే అక్కడ విధుల్లో ఉన్న ఇంజనీర్‌ను మొబైల్ ఫోన్ లో రికార్డు చేయడం మొదలుపెట్టాడు. అతడి తీరుపై కోపంతో ఊగిపోయిన యువకులు పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఇంజనీర్ వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గ్రామస్తులు ఆఫీసు ఫర్నిచర్‌పై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. అటు సబ్ స్టేషన్ యంత్రాల మీద కూడా పెట్రోల్ చల్లి తగలబెట్టారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా కార్యకలాపాలకు తాత్కాలికంగా అంతరాయం కలిగినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.
Angry over constant power cuts, two people set fire to the substation in Amravati, Maharashtra.🤦♀️ pic.twitter.com/9Xhycc7YDp
— Cow Momma (@Cow__Momma) June 17, 2025
Read Also: భయపెడుతోన్న జులై 5.. టికెట్లు క్యాన్సల్ చేసుకుంటోన్న జనం!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
అటు సబ్ స్టేషన్ తగలబెట్టడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో యువకులు సబ్‌స్టేషన్ టేబుల్‌కు నిప్పంటిస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించారు. సదరు యువకులతో పాటు పలువురు గ్రామస్తులపై కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వాల్గావ్ పోలీసులు వెల్లడించారు. ఇందులో పాల్గొన్న వారందరినీ గుర్తించడానికి, నష్టాన్ని రికవరీ చేసేందుకు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. గ్రామస్తులు హింసాయుత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. విద్యుత్తును పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
Read Also: ఇదేం చిత్రం.. మనిషి లేకుండా బైక్ దానంతట అదే పరుగు, వీడియో వైరల్!