BigTV English

KL Rahul : రెడ్ బుల్ ఛాలెంజ్.. ట్రక్కు పై 110 మీటర్ల సిక్స్ కొట్టిన KL రాహుల్

KL Rahul : రెడ్ బుల్ ఛాలెంజ్.. ట్రక్కు పై 110 మీటర్ల సిక్స్ కొట్టిన KL రాహుల్

KL Rahul : టీమిండియా (team India) జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ (England) తో 5 టెస్టుల సిరీస్ లో  పాల్గొననుంది. దీనికోసం ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగడంతో పలువురు క్రికెట్ విశ్లేషకులు సీనియర్ ప్లేయర్స్ లేకుండా టీమిండియా విజయం సాధిస్తుందా..? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. యంగ్ ఇండియా ఆటగాళ్లు సీనియర్లకు ధీటుగా రాణిస్తే.. మున్ముందు టీమిండియాకి తిరుగు లేకుండా ఉంటుంది. ఇదిలా ఉంటే.. భారత స్టార్ క్రికెటర్ కే.ఎల్. రాహుల్ (K.L. Rahul) ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం కఠోరంగా శ్రమిస్తున్నాడు. అయితే టెస్ట్ క్రికెట్ కి ముందు రాహుల్ ఓ విభిన్నమైన క్రికెట్ అనుభవానని పంచుకుంటూ కనిపించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తో కలిసి అతను పాల్గొన్న ఈ అనుకోని ఛాలెంజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read :  virat Kohli : ఆ బాలీవుడ్ హీరోయిన్ ఇంటికి టీమిండియా ప్లేయర్లు.. రాత్రంతా చిందులు వేస్తూ రచ్చ ?

ట్రక్కు పై నిలబడి  110 మీటర్ల సిక్స్.. 


ఈ విభిన్నమైన ఛాలెంజ్ ని రెడ్ బుల్ సంస్థ నిర్వహించింది. క్రీడలను ప్రోత్సహించేందుకు తరుచూ వినూత్న సవాళ్లను రూపొందించే రెడ్ బుల్, ఈ సారి భారత్-ఇంగ్లాండ్ సిరీస్  ప్రచారంలో భాగంగా ఇద్దరూ స్టార్ క్రికెటర్లను ఛాలెంజ్ లో పాల్గొనేలా చేసింది. ఇందులో మొత్తం 4 ఛాలెంజ్ లు ఏర్పాటు చేసింది రెడ్ బుల్ సంస్థ. అందులో మొదటి ఛాలెంజ్ కోసం కే.ఎల్. రాహుల్ 18 వీలర్ల ట్రక్ పై అమర్చిన బౌలింగ్ మిషన్ నుంచి వస్తున్న బంతులను ఆడాల్సి వచ్చింది.  కే.ఎల్. రాహుల్ ట్రక్కు పై నిలబడి విరాట్ కోహ్లీ గ్లౌవ్స్ ధరించి 110 మీటర్ల సిక్స్ ని బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతోంది.  మొత్తం 8 బంతుల్లో కలిపి 500 మీటర్ల దూరానికి షాట్లు కొట్టాలనే ఈ ఛాలెంజ్ రాహుల్ కి ఎదురైంది. సమయ నిర్వహణ, పవర్ ఫుల్ హిట్టింగ్ సామర్థ్యాలను కూడా పరీక్షించింది రెడ్ బుల్. ఇక రెండో ఛాలెంజ్ లో బెన్ స్టోక్స్ ఓ సరస్సులో బోటు పై నిలబడి నీటిపై తేలియాడుతున్న ఆరు టార్గెట్లను బంతులతో హిట్టింగ్ చేయాల్సి వచ్చింది. ఇక ఇది కచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించడం సవాల్ గా మారింది.

Also Read : Stuart Broad: ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన బుమ్రా… ఒకే ఓవర్ లో 35 పరుగులు

ఇక దీని తరువాత రాహుల్, స్టోక్స్ ఇద్దరూ మూడో ఛాలెంజ్ లో ప్రత్యేకంగా రూపొందించిన గదుల్లోకి ప్రవేశించారు. ప్రతీ గదిలోనూ ఓ ప్రత్యేకమైన క్రికెట్ పరీక్ష ఎదురైంది. ఇందులో కొన్ని బంతులు వింత కోణాల్లో నుంచి వచ్చాయి. కొన్ని అనుకోని సమయాల్లో మరికొన్ని రబ్బరు, మార్బుల్ వంటి ఉపరితలాలపై నుంచి.. అలాగే కొన్ని బంతులు ప్రతీసారి భిన్నంగా వచ్చాయి. ఈ గదుల మధ్య ప్రయాణం ఆటగాళ్లసమనాన్ని పరీక్షించింది. చివరగా ఫైనల్ బాస్ పేరుతో ఓ అద్భుతమైన సవాల్ ఎదురైంది. మొదట కదులుతున్న ఆటోలలో అమర్చిన టార్గెట్ పై ఆ తరువాత కంటైనర్ ట్రక్కులపై అమర్చిన లక్ష్యాలపై.. ఆపై భూమి పై ఉన్న టార్గెట్ పై చివరగా డ్రోన్ ఆక్టోకాప్టర్ ద్వారా గాల్లో తేటిన గాజు టార్గెట్ పై హిట్ చేయాల్సి వచ్చింది. ఈ టార్గెట్ హిట్టింగ్ లో మొదటి రౌండ్ లో రాహుల్.. తరువాత రౌండ్ లో స్టోక్స్ మెరిశారు. చివరగా గాజు టార్గెట్ ను రాహుల్ హిట్టింగ్ చేసి విజేతగా నిలిచాడు. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Big Stories

×