E-Paper
Advertisement

Horror movie OTT: దెయ్యాలతో దద్దరిల్లే చర్చ్… వణుకు పుట్టించేలా ఒక్కో సీన్

Horror movie OTT: దెయ్యాలతో దద్దరిల్లే చర్చ్… వణుకు పుట్టించేలా ఒక్కో సీన్
Advertisement

Horror movie OTT : హాలీవుడ్ హారర్ సినిమాలు ఎక్కువగా చర్చి నేపథ్యంలో సాగుతుంటాయి. దయ్యాలను కూడా రకరకాలుగా చూపిస్తూ భయపెడుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మొత్తం చర్చి చుట్టూ తిరుగుతుంది. పవిత్రంగా ఉండే చర్చిలో ఈ దెయ్యాల గోల ఏంటి అనుకుంటున్నారా ? అయితే ఈ సినిమాను ఓ సారి చూడండి. ఇది మిస్టరీతో పాటు, హారర్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. వణుకు పుట్టించే స్టోరీ ఇది. ఈ హారర్ సినిమా పేరు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ (jio hotstar)లో స్ట్రీమింగ్

ఈ సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘కాన్సెక్రేషన్’ (Consecration). క్రిస్టోఫర్ స్మిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023 ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదలైంది. ఇందులో జెన్నా మలోన్, డానీ హ్యూస్టన్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్కాట్లాండ్‌లో ఐల్ ఆఫ్ స్కైలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ (jio hotstar) లో ఈ సినిమా స్ట్రీమింగ్ లో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

గ్రేస్ అనే అమ్మాయి తమ్ముడు ఒక మారుమూల చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తుంటాడు. అతను చనిపోయాడని తెలియడంతో, అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఆమె స్కాట్లాండ్‌లో ఉన్న ఆ చర్చికి వెళ్తుంది. అయితే అక్కడ ఉన్న సిస్టర్స్ తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతారు. కానీ గ్రేస్‌కు అది నమ్మేటట్టు అనిపించదు. అక్కడి వాతావరణం, వాళ్ల ప్రవర్తన చూస్తుంటే ఏదో పెద్ద దాస్తున్నారని ఆమెకు అనుమానం వస్తుంది. గ్రేస్ విచారణ చేసే కొద్దీ ఆ చర్చిలో దెయ్యాల రిచ్యువల్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన భయంకరమైన నిజాలు బయటపడతాయి.

చివరకు తన తమ్ముడి మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఆ చర్చిలో ఉన్న భయంకరమైన శక్తులు వల్ల ఆమె కూడా ప్రమాదంలో పడుతుందా ? చివరికి చర్చిలో అసలేం జరుగుతోంది ? నిజంగానే దెయ్యాలు ఉన్నాయా ? ఉంటే అవి ఆమెను ఏం చేశాయి? గ్రేస్ అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడిందా ? అనే విషయాలను, ఈ సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : బయట శత్రువులే కానీ లోపల మాత్రం మ్యాటర్ వేరే… ఓటిటిలో దుమ్ము దులుపుతున్న రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×