E-Paper
Advertisement

Horror Movie OTT : ప్రాణ స్నేహితురాలి కోసం ప్రాణాల మీదికి… దెయ్యం రాకతో ఊహించని ఉత్కంఠ

Horror Movie OTT : ప్రాణ స్నేహితురాలి కోసం ప్రాణాల మీదికి… దెయ్యం రాకతో ఊహించని ఉత్కంఠ
Advertisement

Horror Movie OTT : చిన్న బడ్జెట్ తో పెద్ద హిట్లు కొడుతుంటాయి కొన్ని హారర్ సినిమాలు. ఇప్పుడు చెప్పుకోబోయే గుజరాతీ హారర్ మూవీ అలాంటి హిట్టే కొట్టింది. ఈ సినిమాకు ఐయండిబిలో 8.5/10 రేటింగ్ కూడా లభించింది. ఈ కథ అమెరికా నుండి తిరిగి వచ్చిన 21 ఏళ్ల స్వీటీ, తన చిన్ననాటి స్నేహితురాలి కోసం వెతుకుతూ సొంత గ్రామానికి వస్తుంది. ఆ తరువాత కథ భయంకరమైన మలుపు తిరుగుతుంది. హారర్ ఫ్యాన్స్ ఓ లుక్ వేయాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రైమ్ వీడియో (Prime Video) లో

ఈ గుజరాతీ హర్రర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘తల్లిక’ (Tallika). దీనికి మిటాలీ జానీ దర్శకత్వం వహించారు. ఇందులో ఆంచల్ షా (స్వీటీగా), ఓజస్ రావల్, సన్జీత్ ధురి, జయక యాగ్నిక్ లీడ్ రోల్స్ లో నటించారు. 1 గంట 42 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో (Prime Video) లో అందుబాటులో ఉంది. ఈ చిత్రం 2022, ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైంది. విమర్శకులు సినిమా మేకింగ్‌ని, ముఖ్యంగా దర్శకురాలి పనితీరును ప్రశంసించారు కూడా. అయితే ఈ సినిమా ఇది కేవలం గుజరాతీ భాషలో మాత్రమే ఉంది. దీనికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అమెరికాలో సెటిల్ అయిన స్వీటీ అనే అమ్మాయి, చిన్నప్పుడు తన ప్రాణ స్నేహితురాలిని చూడాలన్న ఆశతో ఒక్కతే ఇండియాలో ఉన్న తన సొంత ఊరికి వస్తుంది. ఊళ్లోకి రాగానే పాత స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ కలిపి పెద్ద గెట్ టుగెదర్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అంతా బాగానే ఉంది అనుకునే లోపు, అసలు తను ఎవరి కోసం అయితే వచ్చిందో ఆ స్నేహితురాలు ఎక్కడా కనిపించదు. ఆమె గురించి అడిగితే మిగతా ఫ్రెండ్స్ అంతా ఏదో దాస్తున్నట్టు వింతగా ప్రవర్తించడం మొదలుపెడతారు.

స్నేహితురాలి కోసం స్వీటీ గాలించడం మొదలుపెట్టాక, ఆ ఊరిలో ఏదో దుష్టశక్తి తిరుగుతోందని అర్థమవుతుంది. పార్టీ చేసుకుంటున్న ఆ పాత స్నేహితుల గుంపులోకి ఒక భయంకరమైన గతం ఉంటుంది. ఇప్పుడు ఆమె కూడా ప్రమాదంలో పడుతుంది. చివరికి ఆ స్నేహితురాలు ఏమైంది?  స్నేహితులు దాస్తున్న నిజం ఏమిటి ? అక్కడ ఉన్న దుష్ట శక్తి ఎలా వచ్చింది ? స్వీటీ తన ప్రాణాలను కాపాడుకుని మళ్లీ అమెరికా వెళ్లగలిగిందా ?అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : చలి జ్వరం తెప్పించే చేతబడి … వణికించే క్షుద్రపూజలతో ప్యాంట్లు తడిపించే ఈ సినిమాలు ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×