E-Paper
Advertisement

Horror movie OTT: బాస్ బంపర్ ఆఫర్ కి ఫిదా అయ్యే లాయర్…. కట్ చేస్తే నరకం చూపించే సైతాన్

Horror movie OTT: బాస్ బంపర్ ఆఫర్ కి ఫిదా అయ్యే లాయర్…. కట్ చేస్తే నరకం చూపించే సైతాన్
Advertisement

Horror movie OTT : హారర్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా ఆడియన్స్ ను భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఇక ఈ సినిమాలను కూడా ప్రేక్షకులు ఇంట్రస్టింగ్ గా చూస్తుంటారు. మధ్య మధ్యలో వచ్చే సౌండ్స్, భయంకరమైన దయ్యాల ఆకారాలతో ఈ సినిమాలు గుండెల్లో గుబులు పుట్టిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఒక డిఫరెంట్ హారర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఓటమి ఎరుగని ఒక క్రిమినల్ లాయర్ చుట్టూ తిరుగుతుంది. అయితే కథలో ఒక పెద్దాయన ఎంట్రీ ఇవ్వడంతో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మరి ఆ ట్విస్ట్ ఏమిటి ? ఈ సినిమాలో ఏ రకం దెయ్యాలు ఉన్నాయి ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే..

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ సూపర్ నేచురల్ లీగల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది డెవిల్స్ అడ్వకేట్’. ఆండ్రూ నీడర్మాన్ రాసిన నవల ఆధారంగా టేలర్ హాక్‌ఫోర్డ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో అల్ పాచినో, కీను రీవ్స్, చార్లిజ్ థెరాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో అల్ పాచినో నటన, ముఖ్యంగా క్లైమాక్స్ డైలాగులు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఇది ఉత్తమ హర్రర్ చిత్రంగా ‘సాటర్న్ అవార్డు’ ను గెలుచుకుంది. ఇది ప్రస్తుతం 7.4 ఐయండిబి రేటింగ్ తో Amazon Prime Video ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కెవిన్ ఫ్లోరిడాలో ఒక పేరు పొందిన లాయర్. కోర్టులో అడుగుపెట్టాడంటే చాలు, వాడు చేసిన తప్పు ఏదైనా సరే.. ఎదుటివాడికి చుక్కలు చూపించి తన క్లయింట్ ను గెలిపిస్తాడు. ఒక్క కేసు కూడా ఓడిపోని వీడి టాలెంట్ చూసి, న్యూయార్క్‌లో జాన్ మిల్టన్ (అల్ పాచినో) అనే ఒక పెద్దాయన భారీ ఆఫర్ ఇస్తాడు. జీతం చూస్తే కోట్లు, ఉండేది ఫైవ్ స్టార్ రేంజ్ బంగ్లా.. ఇంకేముంది అనుకుంటూ మనోడు భార్యను తీసుకుని న్యూయార్క్‌లో అడుగు పెడతాడు. అక్కడికి వెళ్ళాక కెవిన్ డబ్బు పిచ్చితో కేసుల మీద కేసులు గెలుస్తూ బిజీ అయిపోతాడు.

కానీ ఇక్కడే సీన్ రివర్స్ అవుతుంది. అతని భార్య మేరీ ఆన్‌కు చుట్టూ ఉన్న వాళ్లంతా దెయ్యాల్లా కనిపిస్తూ పిచ్చి పట్టినట్లు అయిపోతుంది. అప్పుడే కెవిన్ కి అర్థమవుతుంది.. తన బాస్ జాన్ మిల్టన్ మామూలు మనిషి కాదని, సాక్షాత్తూ నరకానికి అధిపతి అయిన ‘సాతాను’ అని. చివరికి సాతాను అసలు ప్లాన్ బయటపెడతాడు. కెవిన్ కూడా మరెవరో కాదు, సాతాను కొడుకే అని.. ప్రపంచాన్ని నాశనం చేసే ఒక దుర్మార్గుడిని పుట్టించడానికి ఈ డ్రామా అంతా ఆడానని చెబుతాడు. చివరికి సాతాను అనుకున్నది సాధిస్తాడా ? కెవిన్ దంపతులు దీని నుంచి ఎలా బయట పడతారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : మొగుళ్ళకి తెలీకుండా తప్పుడు పని… మర్డర్ తో మైండ్ బ్లాక్ ట్విస్ట్… క్లైమాక్స్ కెవ్వు కేక

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×