E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం పోలీస్ స్టేషన్ కు మీనా.. శృతికి షాకిచ్చిన సురేంద్ర.. దొరికిపోయిన మీనా..

Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం పోలీస్ స్టేషన్ కు మీనా.. శృతికి షాకిచ్చిన సురేంద్ర.. దొరికిపోయిన మీనా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బాలుల నాటకం మొత్తానికి రక్తికట్టేస్తుంది.. కానీ ప్రిన్సిపల్ మాత్రం బాలు నిజంగానే తాగుబోతు అని నమ్మేసి పోలీసులకి పట్టిస్తాడు. ఆ తర్వాత అసలు స్టోరీ మొదలవుతుంది. బాలు పోలీసులకు ఎంత చెప్తున్నా సరే వినకుండా వాళ్లు తాగొచ్చి ఒక అమ్మాయిని ఏడిపిస్తావా అని కొడతారు. మీనా బాలు ఇద్దరు కూడా ఈ నాటకం ఎక్కడ బయట పడుతున్నానని భయపడిపోతూ ఉంటారు. మీనా తెలివిగా బాలుని విడిపించుకోవడానికి అక్కడికి వచ్చి పోలీసులు దగ్గర విన్నవించుకుంటుంది.. అలా మొత్తానికి మీనా బాలుని విడిపించుకుని ఇంటికి తీసుకొస్తుంది.

ఇక మనోజ్ మాత్రం వేరే బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. తన ఫ్రెండు చెప్పిన బిజినెస్ గురించి రోహిణి తో చెప్పాలని అనుకుంటాడు. కానీ రోహిణి మాత్రం బాలు ఫోన్ ని ఎలా కొట్టేయాలని ఆలోచిస్తూనే ఉంటుంది.. మొత్తానికి రోహిణి మాత్రం రెండోసారి కూడా ఫెయిల్అవుతుంది.. ఎలాగైనా సరే బాలు దగ్గరున్న వీడియోని కొట్టేసి ఆ గుణానికి పంపిస్తే దినేష్ పీడా విరగడయిపోతుంది బాలు పీడ కూడా పోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా శివ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఏంటండీ మీకు ఈ పరిస్థితి వచ్చింది. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని నేను ఆ కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు మీనా? ఏం జరగదు కానీ.. నన్ను ఈ రోజు ఉంచి రేపు వదిలేస్తారులే మేడం వచ్చిన తర్వాత ఆమె వదిలేస్తుందిలే అనేసి బాలు అంటాడు. బాలు మాత్రం నువ్వేం బాధపడకు నాకేం కాలేదు అని ఎంత చెప్పినా సరే మీనా మాత్రం బాధపడుతుంది.. అయితే బాలుని వదిలిపెట్టమని పోలీసుల్ని అడుగుతుంది అసలేం జరిగిందో చెప్పండి అని అక్కడ చెప్పినా కూడా వాళ్ళు మేడం వచ్చేంతవరకు మేము ఏమి చేయలేము అని అంటారు.

ఇక తర్వాత మీనా ఫోన్ తీసుకొని ఎవరో ఒకరికి ఫోన్ చేయాలని బయటకు వెళ్తుంది.. వర్క్ చేయాలి అని ఆలోచిస్తూ శృతికి ఫోన్ చేస్తుంది అయితే శృతి వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వాళ్ళ నాన్నని అడుగుతుంది.. రిలీజ్చేయాల్సిన వ్యక్తి ఎవరు అనగానే బాలు అని చెప్పడంతో వాళ్ళు నేను వాడినైతే అస్సలు విడిపించను అని అంటారు. అయితే శృతి ఇన్నాళ్ళైనా కూడా మీరు అదే మర్చిపోవడం లేదా మిమ్మల్ని అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ అని అంటుంది. శృతి అడిగింది కదండి ఆ బాలుని విడిపించండి అని శోభన ఎంత చెప్పినా సరే సురేంద్ర మాత్రం మాట వినడు.. ఈ విషయాన్ని మనం వాడుకోవాలి అని సురేంద్ర శోభ నాకు సలహా ఇచ్చి వాళ్ళతో చెప్పమని చెప్తాడు.. మృతి మీనాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్న ఇలా అన్నాడు అని చెప్పగానే బాలు పోయి వాళ్ళ నాన్నకే చెప్పారని అంటాడు..

Advertisement

నాకోసం ఇంత చేసావు బావ నన్ను క్షమించు బావ అని శివ అడుగుతాడు. నువ్వు ఇక మీదనైనా బుద్ధిగా ఉండి చదువుకో ఆ గుణ జోలికి వెళ్లదు అని అంటాడు.. రాత్రి లేటుగా వచ్చిన మీనాని ప్రభావతి ఎక్కడికి వెళ్లావే అని అడుగుతుంది. పూలు ఇవ్వడానికి వెళ్ళాను అని అబద్ధం చెప్తుంది. కానీ శృతి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది అని చెప్పగానే మీనా షాక్ అవుతుంది. వాడు చేసింది మంచి పనే అయితే వాడిలా జైలుకు వెళ్లే బదులు నన్ను అడిగితే నేను ఏదో ఒకటి సమాధానం చెప్పే వాడిని కదా అనేసి సత్యం కూడా ఫీల్ అవుతాడు.. అందరూ కూడా బాలుని నానా మాటలు అనేస్తారు.. శృతి మాత్రం బాలు చేసిన తప్పేంటి అని వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతుంది..

తర్వాత రోజు ఉదయం పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన మేన బాలుని ఎలాగైనా సరే విడిపించుకుని రావాలని అనుకుంటుంది. ఆ ఎస్సై మేడం దగ్గరికి వెళ్లి మాట్లాడాలని అనుకుంటుంది.. అయితే అక్కడికి వెళ్లిన మీనా జరిగిన విషయాన్ని చెప్పిన సరే ఆ మేడం మాత్రం ఇదంతా చీటింగ్ కదా అనేసి అంటుంది.. మొత్తానికి శివ మీనా ఇద్దరు కలిసి బాలుని బయటకు తీసుకొని వస్తారు.. అయితే ఇంకొకసారి ఇలాంటివి చేస్తే నీకు మర్యాదగా ఉండదు అని ఆ పోలీస్ బాలుని ఇంటికి పంపిస్తుంది. బయటకు రాగానే బావ నీ కోసం చాలా కష్టపడ్డాడు ఇకమీదట ఇలాంటివి చెయ్యొద్దు అని సుమతి మీనా ఇద్దరు కూడా శివాకి చెప్తారు..

Also Read :మరోసారి అడ్డంగా బుక్కయిన చక్రీ.. మహాకు షాకిచ్చిన నారాయణ.. తాయారు కాపురంలో కుంపటి..

గుణ ఎక్కడున్నాడో అన్న విషయాన్ని రాజేష్ ఫోన్ చేసి చెప్తాడు.. ఆ గుణ కోసం నేను వెళ్తాను అని బాలు వెళ్తాడు రాజేష్ డబ్బుల కోసం అని ఫోన్ చేసి గుణాన్ని రమ్మని చెప్తాడు. అది నిజమే నీ నమ్మిన గుణ అక్కడికి రాగానే బాలు గుణాన్ని దారుణంగా కొట్టేస్తాడు.. అంతే కాదు ఇంకొకసారి శివ జోలికి వస్తే మామూలుగా ఉండదు నీకు అని వార్నింగ్ కూడా ఇస్తాడు.. ఆ తర్వాత బాలు మీనా ఇంటికి వస్తారు.. ప్రభావతి బాలుని దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది.. ఈయన మాత్రం దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Pallavi : అబ్బా.. లంగావోణీలో పల్లవి ఎంత క్యూట్ గా ఉందో.. ఫ్యాన్స్ ఫిదా..

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×