E-Paper
Advertisement

Horror Thriller OTT: ప్రియుడిని మంత్రాలతో వశపరుచుకునే అమ్మాయి… వణికించే వైలెంట్ థ్రిల్లర్

Horror Thriller OTT: ప్రియుడిని మంత్రాలతో వశపరుచుకునే అమ్మాయి… వణికించే వైలెంట్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller OTT : తక్కువ టైమ్ లోనే గట్టిగా భయపెట్టిన సినిమా ‘కుల్యాస్’. 2019 లో వచ్చిన ఈ సినిమా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. అయితే ఈ సినిమా సీక్వెల్ ‘కుల్యాస్ 2’ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా సుమారు 92 నిమిషాలు ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకుంటున్నారు. దర్శకుడు ఈ సినిమాని ఫస్ట్ పార్ట్ కంటే ఇంకాస్త భయంకరంగానే ప్లాన్ చేశాడు. ఇందులో నటించిన సెడా బాసయ్వాజ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ఆ క్షుద్ర పూజలు చేసే సీన్లలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే నిజంగానే వణుకు పుడుతుంది. ఈ సినిమా షూటింగ్ మామూలు చోట్ల చేయలేదు. టర్కీలోని ఇస్తాంబుల్ లోని గడ్డకట్టే చలి ఉండే ప్రాంతాలతో పాటు, అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో కూడా తీశారు. అంటే కథ లోకల్ నుంచి గ్లోబల్ దాకా వెళ్ళేలా ప్లాన్ చేశారు.

యూట్యూబ్ లో

2025లో వచ్చిన ఈ టర్కిష్ హారర్ సినిమా పేరు ‘కుల్యాస్ 2’ (Kulyas 2) సెవిక్ యూనస్ దర్శకత్వంలో రూపొందింది. ఇది 2019లో వచ్చిన ‘కుల్యాస్’ సినిమాకు సీక్వెల్. ఈ సినిమాలో సెడా బాసయ్వాజ్ (హెలెన్ పాత్రలో), కాన్ యావుజ్, ముహర్రమ్ ఫిండికాక్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ఫస్ట్ టర్కీలో 2025 ఆగస్టు 8న రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత నవంబర్‌లో ఈజిప్టులో, రీసెంట్‌గా 2026 జనవరి 9న పాకిస్థాన్‌లో ఉర్దూ డబ్బింగ్‌తో రిలీజ్ చేశారు. హారర్ సినిమాలకి అక్కడ భలే క్రేజ్ ఉంటుంది కదా, అందుకే అక్కడ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా ఇంకా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాలేదు. మొదటి పార్ట్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇక పార్ట్ 2 కూడా త్వరలో యూట్యూబ్ లో వచ్చే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హెలెన్ అనే ఒక పిల్లకు తన లవర్‌తో బ్రేకప్ అవుతుంది. అతను తనని వదిలేసి వెళ్ళిపోతే తట్టుకోలేక పోతుంది. వాడిని ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని తెగ ఆరాటపడుతుంది. పిచ్చి ముదిరిపోయి, ఎవరో చెప్పారని మంత్రగాళ్ల దగ్గరికి వెళ్లి.. చేయకూడని పనులు, క్షుద్ర పూజలు చేస్తుంది. అతను వస్తాడో లేదో కానీ, ఆమె చేసిన పనుల వల్ల లేనిపోని తలనొప్పులు మొదలవుతాయి. హెలెన్ చేసిన ఆ పిచ్చి పూజల వల్ల, ఏళ్ల తరబడి ఒక చోట బందీగా ఉన్న ‘కుల్యాస్’ అనే ఒక డేంజర్ దెయ్యం బయటపడుతుంది. అది మామూలు దెయ్యం కాదు, రక్తం రుచి మరిగిన ఘోరమైన ఆత్మ. అది బయటకు రావడమే కాకుండా, హెలెన్ కుటుంబానికి ఉన్న ఒక పాత శాపాన్ని కూడా తవ్వి తీస్తుంది.

ఇక అప్పటి నుంచి హెలెన్ చుట్టూ ఉన్నవాళ్లకి చుక్కలు కనిపిస్తాయి. ఇక ఆ దెయ్యం బయటకు వచ్చాక, హెలెన్ వెంట పడటమే కాకుండా, ఆమె ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తుంది. ఇస్తాంబుల్ నుంచి న్యూయార్క్ దాకా ఎక్కడికి వెళ్లినా అది వదలదు. అసలు ఆ శాపం ఏంటి? హెలెన్ చేసిన తప్పుకి ఎంతమంది బలైపోయారు? ఆ దెయ్యం చేతిలో నుంచి ఆమె ప్రాణాలతో బయటపడిందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : 30 సంవత్సరాల తరువాత ఓటీటీలోకి హాలీవుడ్ హిట్ మూవీ సీక్వెల్‌… ఫ్యామిలీ ఎమోషన్స్ తో

Tags

Related News

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×