Horror Thriller OTT : ఓటీటీలోకి ప్రతి వారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. అయితే వీటిలో దెయ్యాల సినిమాలను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు ఆడియన్స్. అటువంటి హారర్ అభిమానుల కోసమే ఇప్పుడు చెప్పుకోబవే సినిమా. ఇది 81 నిమిషాల నిడివి ఉంటుంది. అయితే భయపెట్టే సన్నివేశాలను మాత్రం కొన్ని వారాల పాటు మారిచిపోలేరు. ఇది యూట్యూబ్ లో వైరల్ అయిన, ఒక షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తెరకెక్కింది. థియేటర్లలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వాడకం చాలా తక్కువ, అందుకే ఆ భయం మనకు అంత రియలిస్టిక్ గా అనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జరిగిన ఇల్లు చాలా పాతది కావడం వల్ల, వణుకు పుట్టించే సీన్లు కూడా బాగా పండాయి.
డేవిడ్ ఎఫ్. శాండ్‌బర్గ్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నాచురల్ హారర్ మూవీ పేరు ‘లైట్స్ అవుట్’ (Lights Out). ఈ సినిమా అసలు కథ 2013లో దర్శకుడు డేవిడ్ ఎఫ్. శాండ్‌బర్గ్ తన ఇంట్లో కేవలం తన భార్యతో కలిసి తీసిన మూడు నిమిషాల షార్ట్ ఫిలిం నుండి పుట్టింది. ఆ చిన్న వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవ్వడంతో, హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ వాన్ కంటపడింది. ఆయన పిలిచి మరి అవకాశం ఇవ్వడంతో, కేవలం 33 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంటే పెట్టిన పెట్టుబడికి 30 రెట్లు లాభం తెచ్చిపెట్టి ఒక రికార్డు సృష్టించింది. 2016లో వచ్చిన ఈ సినిమాలో తెరెసా పాల్మెర్, గాబ్రియేల్ బాటెమాన్, మరియా బెల్లో, బిల్లీ బుర్కే లీడ్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఇది అందుబాటులో ఉంది.
ఒక ఫ్యాక్టరీలో లైట్లు ఆర్పేస్తుంటే, చీకటిలో ఒక వింత ఆకారం కనిపిస్తుంది. లైట్ వేస్తే మాయం, ఆర్పేస్తే మళ్ళీ ప్రత్యక్షం! అలా ఆ దెయ్యం అక్కడ పనిచేసే ఒకాయన్ని చంపేస్తుంది. కట్ చేస్తే, ఇంట్లో సోఫీ అనే మహిళ పిచ్చి పట్టినట్టు ఉంటుంది. ఆమె చీకట్లో ఎవరితోనో మాట్లాడుతుంటే, అది చూసి ఆమె చిన్న కొడుకు మార్టిన్ భయంతో వణికిపోతుంటాడు. వాళ్ల అక్క రెబెక్కా వచ్చి దీని వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసుకోవడం మొదలెడుతుంది. దీని వెనుక డయానా ఆత్మ ఉన్నట్లు కనిపెడుతుంది.
అసలు ఈ డయానా ఎవరా అని రెబెక్కా ఆరా తీస్తే ఒక షాకింగ్ విషయం బయటపడుతుంది. చిన్నప్పుడు వాళ్ల అమ్మ సోఫీ, డయానా అనే అమ్మాయి ఒకే మెంటల్ హాస్పిటల్‌లో ఉండేవారు. డయానాకి ఒక వింత జబ్బు ఉండేది.. అదేంటంటే ఆమె శరీరం వెలుగును అస్సలు తట్టుకోలేదు. ఒకసారి డాక్టర్లు ఆమె మీద ప్రయోగాలు చేస్తుంటే, ఆ వెలుగు ధాటికి ఆమె కాలిపోయి బూడదైపోతుంది. కానీ ఆమె ఆత్మ మాత్రం చావకుండా, తన స్నేహితురాలు సోఫీని అంటిపెట్టుకుని ఉంటుంది. సోఫీ ఎప్పుడైతే బాధలో ఉంటుందో, అప్పుడు ఈ డయానా చీకట్లో పవర్ ఫుల్ అవుతుంది.
తమ అమ్మని ఆ దెయ్యం వదలదని అర్థం చేసుకున్న అక్కాతమ్ముళ్లు, ఇంట్లో బోలెడు కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు పెట్టుకుని యుద్ధానికి దిగుతారు. డయానా ఒక్కొక్కరిని చీకట్లోకి లాగి చీల్చి చెండాడాలని చూస్తుంది. ఎంత లైట్లు వేసినా అది ఏదో ఒక రకంగా ఫ్యూజులు పీకేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. చివరకి ఆ దెయ్యం బతికున్నంత కాలం తన పిల్లలకి ప్రమాదమని అర్థం చేసుకున్న సోఫీ.. తనే గన్ తీసుకుని కాల్చుకుని చనిపోతుంది. సోఫీ ప్రాణం పోగానే, ఆమెని అంటిపెట్టుకున్న డయానా ఆత్మ కూడా గాలిలో కలిసిపోతుంది. ఈ కథకు ఇలాంటి భయంకరమైన ముగింపు ఉంటుంది.
Read Also : నిద్రలేని రాత్రులు మిగిల్చే అత్యంత భయంకరమైన హారర్… చూస్తే చలి జ్వరం గ్యారంటీ