Ashish Nehra – Mohammed Siraj: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలను బ్రేక్ పడింది. తాజాగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పటికే రెండు విజయాలను నమోదు చేసుకున్న ఢిల్లీ, తాజాగా గుజరాత్ టైటాన్స్ చేతిలో మాత్రం తొలి ఓటమి చవి చూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన గుజరాత్ టైటాన్స్, ఒకే ఒక్క పరుగు తేడాతో విక్టరీ అందుకుంది.
Also Read: Inzamam-ul-Haq: కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ రద్దు వెనుక కుట్రలు…క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేశారంటూ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Delhi Capitals vs Gujarat Titans, 14th Match) మధ్య అరుణ్ జైట్లీ ( Arun Jaitley Stadium, Delhi) వేదికగా 14వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన గుజరాత్ టైటాన్స్ తొలి విజయం నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో 19వ ఓవర్ వేసిన హైదరాబాద్ స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్ ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే రెండు బౌండరీలు ఉన్నాయి. అయితే, మహమ్మద్ సిరాజ్ చెత్తగా బౌలింగ్ చేసిన నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా సీరియస్ అయ్యారు. తన కాలుతో బౌండరీ గేట్ తన్ని మరి అసంతృప్తి వ్యక్తం చేశారు. చెత్త బౌలింగ్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ఆశిష్ నెహ్రాపై సిరాజ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు నేపథ్యంలో ఒకే ఒక్క పరుగుతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును మట్టికరిపించింది గుజరాత్ టైటాన్స్. ఈ రెండు జట్ల మధ్య అరుణ్ జైట్లీ వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో నిర్ణీత 20 ఓవర్లు వాడిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు సాధించింది. ఇక చేజింగ్ చేసే క్రమంలో చివరి వరకు పోరాడిన డేవిడ్ మిల్లర్, ఢిల్లీ జట్టును విజయతీరాలకు చేర్చడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేసింది. చివరి రెండు బంతులకు రెండు పరుగులు చేయాల్సి ఉండగా, ఒక పరుగు కూడా చేయలేకపోయాడు డేవిడ్ మిల్లర్. దీంతో ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్.
Also Read: Farhan – Smith: సింగిల్ తీయకుండా స్మిత్ ను అవమానించిన ఫర్హాన్..బాబర్ పగను తీర్చుకున్నాడుగా