Horror Thriller OTT : హార్రర్ జోనర్ లో వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టిగేషన్ లాంటి సినిమాలు పెద్దగా ఓటీటీ ఆదరణ పొందలేదు.. ఇటీవక బ్యాక్ టు బ్యాక్ హారర్ థ్రిల్లర్ మూవీలు ప్రముఖ ఓటీటీ లో విడుదల అవుతాయి. నిన్న మొన్న రిలీజ్ అయిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించాయి. తాజాగా మరో సస్పెస్ స్టోరీ తో ఓ మూవీ రాబోతుంది. ఆ మూవీని ఒక్కసారి చూస్తే సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారు. ఆ సినిమానే పేచి. థియేటర్లలలో పర్వాలేదని పించిన ఈ సినిమాఇప్పుడు ఓటీటిలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఆ సినిమా మరేంటో కాదు.. పేచీ..
ఈ మూవీ తమిళ వెర్షన్ ముందుగా విడుదల కాబోతుందని సమాచారం.. ఈ తమిళ మూవీ ఆగస్టు 2వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ట్రైలర్‌తో ఈ హారర్ థ్రిల్లర్ చిత్రంపై మంచి హైప్ ఏర్పడింది.. సినిమా కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే థియేటర్లకు వచ్చిన తర్వాత పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయింది. థియేటర్లలో ఈ చిత్రానికి మిక్స్ట్ టాక్ వచ్చింది. మోస్తరు కలెక్షన్లను ఈ మూవీ దక్కించుకుంది. ఈ మూవీ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఓటీటీ డేట్ ఖరారైంది.. తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది దాని గురించి కాస్త వివరంగా చూద్దాం..
పేచి సినిమా ఈ శుక్రవారం సెప్టెంబర్ 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మూవీకి రామచంద్రన్ బీ దర్శకత్వం వహించారు. ట్రెక్కింగ్‍కు వెళ్లిన ఫ్రెండ్ గ్రూప్‍ను దెయ్యం వెంబడించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ మూవీని గ్రిప్పింగ్‍గా తెరకెక్కించారు.
కథ విషయానికొస్తే.. కొల్లి మలై హిల్స్ లో పేచి మూవీ సాగుతుంది. కొందరు ఫ్రెండ్స్ కొల్లిమలై హిల్స్ కు ట్రెక్కింగ్ కు వెళతారు. సరదగా సమయం గడుపుతుంటారు. ఈ క్రమంలో అరణ్మనై అడవుల్లో ఓ ప్రమాదకర ప్రదేశానికి వెళతారు. అక్కడ జరిగిన కొన్ని సన్నివేశాలను సినిమాలో చూపించారు. అక్కడ పెద్దగా హిట్ టాక్ ను అందుకొని ఈ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఈ సినిమాలో ఆకట్టుకొని హారర్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తుంది.. సస్పెన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఈ మధ్య ఓటీటీల్లో ఎక్కువగా ఇలాంటి సినిమాలు వచ్చి హిట్ అవుతున్నాయి. మరి ఈ మూవీ కూడా అలాంటి రెస్పాన్స్ నే అందుకుంటుందని మేకర్స్ అభిప్రాయ పడుతున్నారు.. ఎందుకంటే ఈ మూవీ రెండు ఓటీటీ ల్లో రాబోతుంది. కాబట్టి ఒక దాంట్లో సరిగ్గా అందుకోక పోయినా రెండో దాంట్లో మంచి స్పందన రావొచ్చు అని టాక్ నడుస్తుంది.