E-Paper
Advertisement

Horror Thriller OTT : కారు చీకటిలో కాకి రక్కసి… అర్థరాత్రి అరుపులు… భయం పుట్టించే దెయ్యం సినిమా

Horror Thriller OTT : కారు చీకటిలో కాకి రక్కసి… అర్థరాత్రి అరుపులు… భయం పుట్టించే దెయ్యం సినిమా
Advertisement

Horror Thriller OTT : పాత కాలపు నమ్మకాల ప్రకారం కాకిని అశుభానికి గుర్తుగా చూపిస్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఏదో కీడు జరగబోయేముందు  ఈ పక్షి ద్వారా హింట్ వస్తుందని నమ్ముతుంటారు. ఈ పాయింట్ తో ఒక హారర్ సినిమా రూపొందింది. ఇందులో ఆ కాకి వచ్చినప్పుడు ఎఫెక్ట్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇది మరీ కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా కాదు. కానీ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ పాత ఇంటి వాతావరణం, ఆ నల్లటి కాకి ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మనల్ని సీటు అంచున కూర్చోబెడతారు. సినిమా మధ్యలో ఏదో మామూలు దెయ్యం సినిమా అనుకుంటాం కానీ, క్లైమాక్స్‌లో వచ్చే ఒక పెద్ద ట్విస్ట్ మన మైండ్ బ్లాక్ చేస్తుంది. అది చూశాక సినిమా మొత్తాన్ని మళ్ళీ ఇంకో కోణంలో ఆలోచిస్తాం. హారర్ ఫ్యాన్స్ సుమారు 1 గంట 25 నిమిషాల ఈ సినిమాను చూస్తే మెంటలెక్కిపోద్ది.

 ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే 

 ఈ అమెరికన్ సైకలాజికల్ హారర్ మూవీ పేరు ‘ది బెల్ధమ్ (The Beldham). 2024లో వచ్చిన ఈ సినిమాను ఆంజెలా గుల్నర్ అనే మహిళ డైరెక్ట్ చేశారు. ఆమెకు ఇది మొదటి సినిమానే అయినా, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను చాలా బాగా చూపించింది. ఇందులో పాట్రిసియా హీటన్, కేటీ పార్కర్, ఎమ్మా ఫిట్జ్‌పాట్రిక్, కార్బిన్ బెర్న్‌సెన్ లీడ్ రోల్స్ లో నటించారు. మనకు పాత ఇంగ్లీష్ కామెడీ సీరియల్స్ ‘Everybody Loves Raymond’ ద్వారా తెలిసిన ప్యాట్రిసియా హీటన్, ఇందులో చాలా సీరియస్ రోల్ చేసింది. ఈమె పాత్ర చూస్తుంటే అసలు దెయ్యం కన్నా ఈమె భయంకరంగా అనిపిస్తుంది. ఈ చిత్రం 2025 నవంబర్ 7 నుంచి డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లలో విడుదలైంది. మీరు ఈ చిత్రాన్ని Amazon Prime Videoలో సబ్‌స్క్రిప్షన్ ద్వారా చూడవచ్చు. ప్రైమ్ వీడియోతో పాటు, Google Play Movies, Apple TV ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమా రెంటల్ ప్రాతిపదికన అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక మహిళ తన పసిబిడ్డను తీసుకుని, తన తల్లి ఉంటున్న పాత ఫామ్‌ హౌస్‌కి వస్తుంది. అయితే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి ఏదో తేడాగా అనిపిస్తుంది. ఆ గోడల వెనుక ఎవరో ఉన్నారని, తన బిడ్డను ఎవరో గమనిస్తున్నారని ఆమెకు అనుమానం మొదలవుతుంది. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ ఆమె మాట నమ్మరు, పైగా ఆమెకు పిచ్చి పట్టిందని అనుకుంటారు. దీనికి తోడు ఒక కాకి ఆమెను నిరంతరం గమనిస్తూ, భయపెడుతూ ఉంటుంది. కొన్ని సీన్లలో ఆ కాకి చేసే శబ్దాలు, అది అకస్మాత్తుగా ప్రత్యక్షమవ్వడం సినిమాలోని హారర్ డోస్‌ను పెంచుతాయి కూడా.

మెల్లమెల్లగా ఆ ఇంట్లో ఒక ముసలి దెయ్యం ఉందని ఆమెకు అర్థమవుతుంది. ఆ దెయ్యం కొన్ని తరాల నుండి ఆ కుటుంబంలోని పిల్లలను బలి తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ దెయ్యం కన్ను ఈమె పసిబిడ్డ మీద పడుతుంది. ఇప్పుడు తన బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి ఒంటరిగా పోరాటం మొదలుపెడుతుంది. కనిపించని దెయ్యంతో యుద్ధం చేస్తూ ఆమె నరకం చూస్తుంది. సినిమా క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ఆ దెయ్యం నిజంగానే ఉందా లేక ఈమె ఊహించుకుంటుందా? ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే వివరాలను ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  అమెరికన్ సినిమాలో ఇండియన్ దెయ్యం… దోస్తులందరికీ చుక్కలు… మస్తు పరేషాన్ చేసే సినిమా

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×