Horror Thriller on OTT : హర్రర్ కథలు వినడానికి, చూడడానికి అద్భుతంగా ఉంటాయి. అయితే ఏదైనా మన ఇమాజినేషన్ బాగుంటే ఇంపాక్ట్ అద్భుతంగా ఉంటుంది. అలా జరగాలంటే కథనానికి కనెక్ట్ కావాలి. అంతకంటే ముందు ఆడియన్స్ స్టోరీకి కనెక్ట్ కావాలంటే, నటీనటులు తమకిచ్చిన పాత్రల్లో నటించడం కాదు జీవించాలి. అయితే అలా యాక్టింగ్ చేసినప్పుడు ఎన్నో మరిచిపోలేని అనుభవాలు పోగేసుకుంటారు యాక్టర్స్. కానీ హర్రర్ సినిమాల విషయంలో మాత్రం అలా జరిగిందంటే పైప్రాణాలు పైనే పోతాయి. ఇప్పటి వరకు కొంతమంది నటీనటులు దెయ్యాల సినిమాలు చేసినప్పుడు భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. తాజాగా మరో ప్రముఖ నటికి ఓ హర్రర్ బయోపిక్ చేస్తున్నప్పుడు అచ్చం ఇలాగే జరిగిందట. మరి ఆ హీరోయిన్ ఎవరు? అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి.
ప్రేక్షకులను భయపెట్టడానికి పారానార్మల్ కథలు క్రియేట్ చేస్తారు మేకర్స్. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ‘భయ్: ది గౌరవ్ తివారీ’ (Bhay: The Gaurav Tiwari Mystery) అనే మిస్టరీ థ్రిల్లర్ అలాంటిది కాదు. భారతదేశపు మొట్టమొదటి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్. MX Player ఎమ్ఎక్స్ ప్లేయర్ లో వచ్చిన ఈ సిరీస్ గురించి, ఇటీవల అందులో నటించిన ప్రధాన నటుడు కరణ్ ట్యాకర్ రికార్డ్ చేసిన ఆడియో క్లిప్ లీక్ అవ్వడం సంచలనంగా మారింది. ఆ ఆడియో ప్రకారం షో చిత్రీకరణ సమయంలో అనేక వివరించలేని సంఘటనలు జరిగాయని తెలుస్తోంది. మూవీ టీం షూటింగ్ టైమ్ లో వింత నీడలు, కెమెరాలో ఆకస్మిక కదలికలు, గాలిలో మిస్టీరియస్ అనుభూతి, ఒకేసారి అన్నీ ఫోన్ బ్యాటరీలు అయిపోవడం, ఖాళీ గదులలో ప్రతిధ్వనించే వింత శబ్దాలు వంటివి జరిగాయట.
Read Also : చచ్చిన మామ కడుపున పుడతాడంటూ భార్యను కష్టపెట్టే భర్త… ఈ మూవీ చిన్నపిల్లలకు మాత్రం కాదు
ఈ సిరీస్‌లో ఐరీన్ వెంకట్ పాత్ర పోషించిన కల్కి కోచ్లిన్ సిరీస్ షూటింగ్ టైమ్ లో దెయ్యాల గురించి వస్తున్న పుకార్లు నిజమేనని కన్ఫర్మ్ చేశారు. లీక్ అయిన ఆడియోలో ఉన్నదంతా నిజమేనని, అది కల్పితం కాదని, సెట్‌లో తాను కూడా తీవ్రంగా కలతపెట్టే సంఘటనలు జరిగాయని వెల్లడించారు. గౌరవ్ తివారీ దర్యాప్తు చేసిన నిజ జీవిత పారానార్మల్ యాక్టివిటీ కేసుల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. అతని జీవితం, పని, రహస్య మరణం చుట్టూ ఉన్న మిస్టీరియస్ ప్రశ్నలను, వాటికి సమాధానాలను ఇందులో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. కరణ్ ట్యాకర్, కల్కి కోచ్లిన్ కలిసి నటించిన ‘భయ్’ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ MX ప్లేయర్‌లో ఉచితంగా ప్రసారం అవుతోంది. ఈ సిరీస్‌ను ప్రైమ్ వీడియో, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లో కూడా చూడవచ్చు.