E-Paper
Advertisement

ఆ ఇంట్లో ఉన్నది దెయ్యం కాదు అంతకు మించిన అడ్వెంచర్… సినిమా చూస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే

ఆ ఇంట్లో ఉన్నది దెయ్యం కాదు అంతకు మించిన అడ్వెంచర్…  సినిమా చూస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే
Advertisement

Horror Thriller OTT : హారర్ సినిమాలలో దెయ్యాలను రక రకాలుగా చూపించి భయపెడుతుంటారు దర్శకులు. అయితే ఒక హాలీవుడ్ సినిమాలో భయం కలిగించడానికి దెయ్యాలను చూపించలేదు. ఆ సినిమాలో కేవలం నీడలను ఉపయోగించి ప్రేక్షకులను భయపెట్టిన తీరు చాలా బాగుంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ వరకు ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంది కూడా. స్టోరీ అలా ఉంటుంది మరి. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సైకలాజికల్ హారర్ చిత్రం పేరు ‘ది నైట్ హౌస్’ (The Night House). 2020లో వచ్చిన ఈ సినిమాకు డేవిడ్ బ్రక్నర్ దర్శకత్వం వహించారు. ఇతను ఇదివరకు ‘ది రిచువల్’ (The Ritual) వంటి హారర్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమా అంతా దాదాపు నటి రెబెక్కా హాల్ చుట్టూనే తిరుగుతుంది. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న భార్యగా, ఆ ఇంట్లో జరిగే వింతలకు భయపడుతూనే ధైర్యంగా ఎదుర్కొనే మహిళగా ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఫాంగోరియా చైన్సా అవార్డ్స్ లో ‘ఉత్తమ స్క్రీన్‌ప్లే’ విభాగంలో అవార్డును గెలుచుకుంది. అలాగే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి (రెబెక్కా హాల్), ఉత్తమ దర్శకత్వం వంటి విభాగాల్లో నామినేషన్లు దక్కాయి. హారర్ సినిమాలకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ‘ఉత్తమ హారర్ ఫిల్మ్’ విభాగంలో ఈ చిత్రం నామినేట్ అయింది. ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బెత్ అనే మహిళకి ఓవెన్ అనే భర్త ఉంటాడు. ఒక రోజు అతను అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ బాధలో ఉన్న బెత్‌కు తను ఉంటున్న ఇంట్లో ఎవరో ఉన్నట్లు, వింత శబ్దాలు వస్తున్నట్లు అనిపిస్తుంది. తన భర్త తన కోసం ఒక సరస్సు ఒడ్డున కట్టిన ఆ ఇంట్లో ఏదో రహస్యం ఉందని గ్రహించి, అసలు అతను ఎందుకు చనిపోయాడో తెలుసుకోవాలని ఆమె వెతకడం మొదలుపెడుతుంది. ఆ క్రమంలో ఆమెకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. తన భర్త తనకు తెలియకుండా ఆమె పోలికలతో ఉన్న వేరే మహిళల ఫోటోలను సేకరించాడని, అడవిలో వాళ్ల కోసం ఒక వింతైన ఇంటిని కట్టాడని తెలుస్తుంది. ఆ ఇంట్లో తన భర్త కొన్ని అతీంద్రియ శక్తులతో పోరాడుతున్నాడని, తనని కాపాడటం కోసమే అతను ఇదంతా చేశాడని ఆమెకు అర్థమవుతుంది. ఇప్పుడు కథలో అసలు ట్విస్ట్ వస్తుంది.

నిజానికి బెత్ చిన్నప్పుడు ఒక ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంటుంది. అప్పుడు ఆమె కొంత సమయం కోమాలో ఉంటుంది. దాదాపు మృత్యువు ఆమెను తీసుకెళ్తుందనే సమయంలో ఆమె మెలుకువలోకి వస్తుంది. అప్పటి నుండి మృత్యువు ఆమెను తనతో తీసుకెళ్లాలని వెంటాడుతుంటుంది. ఆ శక్తి నుండి తన భార్యను కాపాడటం కోసమే ఓవెన్ ఇన్నాళ్లూ పోరాడి, చివరికి తనే బలైపోతాడు. ఇప్పుడు ఆ శక్తి బెత్‌ను కూడా లోబరుచుకోవాలని చూసినా, చివరికి ఆమె దాని నుండి ఎలా బయటపడిందనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : సినీ చరిత్రను తిరగ రాసిన గ్రేటెస్ట్ యాక్షన్ సినిమాలు ఇవే… వీటి ట్రైలర్ చూస్తేనే మీ మైండ్ బ్లాక్ అయిపొద్ది

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×