E-Paper
Advertisement

కళ్ళముందే కొడుకు చావు… కట్ చేస్తే ప్రతీ సీన్ లో వణికించే హారర్

కళ్ళముందే కొడుకు చావు… కట్ చేస్తే ప్రతీ సీన్ లో వణికించే హారర్
Advertisement

Horror Thrilller OTT : హారర్ సినిమాలలో సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆడియన్స్ ను భయపెట్టడానికి ఇదే ఒక అస్త్రంగా మారుతుంది. ఇలాంటి ఎఫ్ఫెక్ట్స్ తో బాగా భయపెట్టింది ఒక హాలీవుడ్ సినిమా. ఈ సినిమాలో ప్రేక్షకులకు భయం కలిగించేలా సౌండ్ డిజైన్ చేశారు. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని చూస్తే ఆ ఎఫెక్ట్ ఇంకా బాగా తెలుస్తుంది. ‘ది కంజురింగ్’ (The Conjuring) వంటి హారర్ సినిమాతో దీనిని పోల్చారు చాలా మంది.  ధైర్యం లేని వాళ్ళు ఒంటరిగా మాత్రం సినిమాను చూడకపోవడమే మంచిది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ స్పానిష్ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు ‘డోంట్ లిజన్’ (Don’t Listen). 2020లో వచ్చిన ఈ సినిమాను ఏంజెల్ గోమెజ్ హెర్నాండెజ్ డైరెక్ట్ చేశారు. ఇది ఆయనకి మొదటి సినిమా అయినా, హారర్ ఎలిమెంట్స్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారని ప్రశంసలు దక్కాయి. ఇందులో రోడాల్ఫో సాంచో, బెలిన్ ఫాబ్రా, లూకాస్ బ్లాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇది థియేటర్లలో కంటే నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. చాలా మంది దీన్ని 2020లో వచ్చిన బెస్ట్ హారర్ సినిమాల్లో ఒకటిగా రేట్ చేశారు. దీనికి IMDbలో 6.1/10 రేటింగ్ ఉంది. ఒక హారర్ సినిమాకి ఇది మంచి రేటింగ్‌గానే చెప్పుకోవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

డానియల్, సారా అనే భార్యాభర్తలకు ఎరిక్ అని ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. వీళ్ళు ఒక పాత కాలపు బంగ్లాలోకి కొత్తగా వస్తారు. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి ఆ పిల్లోడికి వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ పిల్లాడు భయపడి చెప్తున్నా, వీళ్ళు ఏదో పిచ్చి మాటలు అనుకుని లైట్ తీసుకుంటారు. తీరా చూస్తే, ఒకరోజు ఆ పిల్లోడు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోతాడు. కొడుకు పోయిన బాధలో ఉన్న డానియల్ కి, ఒకరోజు వాకీటాకీలో మళ్ళీ ఆ పిల్లాడి గొంతు వినిపిస్తుంది. దాంతో షాక్ అయిన డానియల్.. ఆ ఇంట్లో ఏదో దయ్యం ఉందని ఫిక్స్ అయి, శబ్దాలని రికార్డ్ చేసే ఒక పారా సైకాలజిస్ట్ ను పిలిపిస్తాడు. అతను, తన కూతురు కలిసి ఆ ఇంట్లో రకరకాల మిషన్లు పెట్టి చెక్ చేస్తే.. ఆ గోడల వెనుక నుండి భయంకరమైన గొంతులు వినిపిస్తాయి.

అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. చివరికి తెలిసేది ఏంటంటే.. ఆ ఇంట్లో పాత కాలంలో ఒక మంత్రగత్తె ఉండేదట. ఆమెకి అప్పట్లో శిక్ష వేసి చంపేసినా, ఆమె ఆత్మ మాత్రం ఆ ఇంట్లోనే ఉండిపోయి మనుషులకి వింత వింత శబ్దాలు వినిపిస్తూ వాళ్ళని చంపేస్తుంటుంది. ఈ క్లైమాక్స్ అయితే మరింత భయంకరంగా ఉంటుంది. చివరికి ఆ దెయ్యం చేతిలో వీళ్ళు కూడా బలి అవుతారా ? ఆ పారా సైకాలజిస్ట్ లు వీళ్ళని కాపాడతారా ? అనే విషయాలను మాత్రం ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఇక్కడ చంపకపోతే, చావు తలుపు తడుతుంది… సస్పెన్స్ తో మెంటలెక్కించే థ్రిల్లర్

Tags

Related News

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×