OTT Movie : ఈ సినిమా బాలీవుడ్, వేశ్యాగృహాల చీకటి కోణాలను బ్లాక్ కామెడీ, వయోలెన్స్‌తో చూపిస్తుంది. ముంబైలో ఒక బాలీవుడ్ స్టార్, అతని డ్రైవర్, ఒక వేశ్య చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అయితే ఈ సినిమాని ఒంటరిగా చూడటమే మంచిది. కొన్ని సీన్స్ మాత్రం పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. ఈ సినిమా పేరు ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
ముంబైలో కరణ్ అనే బాలీవుడ్ స్టార్ ఒక రాత్రి కాంత అనే వేశ్యను హైర్ చేసుకుంటాడు. కాంత, ఖుషియా అనే రౌడీ ఆధీనంలో ఉంటుంది. ఆమె జీవితం నరకంలా ఉంటుంది. కరణ్ డ్రైవర్ రాజు, కాంతతో ప్రేమలో పడతాడు. ఆమెను ఖుషియా నుండి తప్పించాలని అనుకుంటాడు. ఇదే సమయంలో కరణ్‌ని గోర్ధన్ అనే వ్యక్తి అతని గతంలోని ఒక సీక్రెట్‌తో బ్లాక్‌మెయిల్ చేస్తాడు. కరణ్ తన స్టార్ ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు కాంత, రాజు ప్రేమ కథ ఒకవైపు, కరణ్ బ్లాక్‌మెయిల్ డ్రామా మరోవైపు ఆసక్తికరంగా నడుస్తాయి. ఖుషియా గర్ల్‌ఫ్రెండ్ లతిక, కాంతను వేధిస్తూ, కథలో ట్విస్ట్‌లు రివీల్ చేస్తుంది. ఇది కథను మరో లెవెల్ కి తీసుకెళ్తుంది.
Read Also : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
‘అశ్చర్యచకిత్!’ (Ascharyachakit) సమిత్ కక్కడ్ డైరెక్ట్ చేసిన హిందీ బ్లాక్ కామెడీ డ్రామా సినిమా. ఇందులో ప్రియాంక బోస్ (కాంత), వైభవ్ రాజ్ గుప్తా (రాజు), అంకిత్ రాజ్ (కరణ్), అనంగ్ష బిస్వాస్ (లతిక), సంతోష్ జువేకర్ (ఖుషియా) మెయిన్ రోల్స్‌లో ఉన్నారు. Netflixలో ఈ సినిమా అందుబాటులో ఉంది. 1 గంట 30 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 4.9/10 రేటింగ్ ఉంది.