OTT Movie : హారర్ జానర్లో రూపొందే సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే అందులోనూ రివేంజ్ డ్రామాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఇక ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఇలాంటి అదిరిపోయే మూవీనే. ఇందులో దెయ్యాలు లేకపోయినా హారర్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో ఆహా అన్పిస్తుంది. మరి ఈ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయంలోకి వెళ్తే…
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
జిమ్ గిల్లెస్పీ దర్శకత్వంలో రూపొందిన మూవీ “ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్” (I Know What You Did Last Summer). లోయిస్ డంకన్ నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. 90ల నాటి టీన్ హారర్ సినిమాల్లో ఒకటైన ఐకానిక్ చిత్రం “Scream” తర్వాత ఈ జానర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. మంచి హారర్ థ్రిల్లర్ ఫీలింగ్ కావాలి అనుకుంటే ఈ సినిమాను చూడాల్సిందే. Netflixతో పాటు Prime Videoలో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
“ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్” మూవీ ఒక అమెరికన్ హారర్ మిస్టరీ సినిమా. నలుగురు స్నేహితులు జూలీ, రే, హెలెన్, బ్యారీ… హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు. తరువాత ఓ రోజు రాత్రి సముద్రతీరంలో గ్రాడ్యుయేషన్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. బాగా ఎంజాయ్ చేసి కారులో తిరిగి వస్తుండగా, ప్రమాదవశాత్తూ ఒక వ్యక్తిని (డేవిడ్) ఢీ కొడతారు. భయంతో అతను చనిపోయాడని భావిస్తారు. దీంతో అతని శవాన్ని సముద్రంలో పడేసి, ఈ సంఘటనను రహస్యంగా ఉంచాలని ఒట్టు వేసుకుంటారు.
సంవత్సరం తర్వాత జూలీకి “ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్” అని రాసిన ఒక లేఖ వస్తుంది. ఆమె స్నేహితులతో కలిసి ఈ రహస్యాన్ని ఎవరు కనుగొన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వారిని ఒక మత్స్యకారుడి రూపంలో ఉన్న అజ్ఞాత వ్యక్త వెంబడిస్తాడు. అతను హుక్ తో దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తాడు. గతంలో జరిగిన ప్రమాదం గురించి తెలిసిన వ్యక్తి వారిని ఒక్కొక్కరినీ టార్గెట్ చేసి మరీ చంపుతాడు. మరి ఆ వ్యక్తి ఎవరు? అతనికి చనిపోయిన వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రమాదం నుంచి ఆ ఫ్రెండ్స్ ఎలా బయట పడ్డారు? చివరికి క్లైమాక్స్ ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. డోంట్ మిస్.