BigTV English

3 Years For Acharya : గుణపాఠం నేర్పిస్తాడు అని థియేటర్ కి వెళ్తే గుణపం దించాడు

3 Years For Acharya : గుణపాఠం నేర్పిస్తాడు అని థియేటర్ కి వెళ్తే గుణపం దించాడు

3 Years For Acharya : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. మిర్చి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు కొరటాల శివ. అప్పటికే చాలా సూపర్ హిట్ సినిమాలుకు రచయితగా పనిచేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద మిర్చి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాను ప్రేక్షకులకు అందించాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. అక్కడితో కొరటాల శివ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. కొరటాల శివ అంటేనే ఒక బ్రాండ్ అయిపోయింది.


అంచనాలు పెరిగిపోయాయి

మిర్చి సినిమాతో దర్శకుడుగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన కొరటాల శివ. భరత్ అనే నేను సినిమా వరకు కూడా వరుస నాలుగు సక్సెస్ఫుల్ సినిమాలో అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ వంటి సీనియర్ దర్శకులకు దొరకని అదృష్టం కొరటాల శివకు దక్కింది. అదే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమాను తెరకెక్కించాడు కొరటాల శివ. ఈ సినిమా మొదలైనప్పుడు చాలామందికి అంచనాల విపరీతంగా ఉండేవి. కొన్ని రోజుల తర్వాత ఆ కథ తనది అనే రాజేష్ అనే ఒక రైటర్ ఆరోపణలు చేశాడు. అప్పుడు కొరటాల శివ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.


ఊహించని డిజాస్టర్

ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు చిరుత తో పాటు పెద్దపులిని.. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ను చూపించడం విపరీతమైన హై మూమెంట్ ఇచ్చింది. ఇక్కడితో సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అలానే గుణపాఠలు చెబుతాను కాబట్టి అందరూ ఆశ్చర్య అంటారు అనే డైలాగ్ కూడా విపరీతమైన అంచనాలను పెంచింది. తీరా సినిమా చూసేసరికి ఎక్కడి నుంచి ఎటు పోతుందో ఎవరికి అర్థం కాలేదు. నాలుగు సక్సెస్ఫుల్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇచ్చారు అంటేనే అంచనాలు ఆకాశాన్ని వండుతాయి. ఆ తరుణంలో వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా నాశనం చేశాడు కొరటాల శివ. ఈ సినిమా వలన కొరటాల శివ కూడా చాలా నష్టపోయారు. రెమ్యునరేషన్ తీసుకోకుండా కొన్నిచోట్ల లాభాలు వస్తే తీసుకుందాం అనుకున్నారు. కానీ ఈ సినిమాకి లాభాలు కూడా రాలేదు. ఏదేమైనా మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ గుణపం దించుకొని నేటికీ మూడు సంవత్సరాలయింది.

Also Read : Samantha: ప్రేమించుకోండి కానీ అవి మాత్రం వద్దు – సమంత రూత్ ప్రభు

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×