BigTV English

Vishwambhara: మెగా మాస్టర్ ప్లాన్.. పుణ్యం, ప్రమోషన్స్ రెండూ కవర్ చేశారు.

Vishwambhara: మెగా మాస్టర్ ప్లాన్.. పుణ్యం, ప్రమోషన్స్ రెండూ కవర్ చేశారు.

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రంగా విశ్వంభర రానుంది. వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. UV క్రియేషన్ బ్యానర్ పై విక్రమ్, వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోషియో ఫాంటసీ యాక్షన్ గా మన ముందుకు రానుంది. వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాల తరువాత మెగాస్టార్ చిరంజీవి నుంచి రానున్న చిత్రం కావడంతో అభిమానులలో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ రామ రామ పాటను హనుమజ్జయంతి సందర్భంగా విడుదల చేశారు. తాజాగా ఈ పాటను చిత్ర యూనిట్ ప్రమోట్  చేసే విధానం ఆసక్తిగా మారింది. ఆ వివరాలు ఇలా..


మెగా మాస్టర్ ప్లాన్.. పుణ్యం, ప్రమోషన్స్ రెండూ…

విశ్వంభర చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ భక్తుడి పాత్రలో నటిస్తున్నారు. త్రిష, చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ రామజోగయ్య శాస్త్రి రచించిన రామా రామా పాట, శ్రీరాముడి పట్ల హనుమంతుని భక్తిని తెలిపే పాటగా రూపొందించబడింది. శ్రీరామనవమి సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. ఈ పాట  యూట్యూబ్ లో విడుదలైన తరువాత 15 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. తాజాగా చిత్ర బృందం ఈ పాటని పెన్ డ్రైవ్ లో నిక్షిప్తం చేసి తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ మందిరం, హనుమాన్ ఆలయాలలో పూజారులకు కానుకగా ఇవ్వనున్నారు. ఇలా ఇప్పటివరకు ఏ సినిమాకి చేయకపోవడం గమనార్హం. ఇక ఒకవైపు దేవునిపై భక్తిని మరోవైపు సినిమాపై పబ్లిసిటీని పెంచడంలో మూవీ టీం సరికొత్త ఆలోచన చేసిందంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ పాట తెలుగు రాష్ట్రాల్లోని ఆలయలలో మారుమోగుతున్న అన్నది నిజం.


భారీ బడ్జెట్ ..

ఇక సినిమా సంగతికి వస్తే.. చిరంజీవి వాల్తేరు వీరయ్య, భోళా శంకర సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఎన్నో ఆశలతో వచ్చిన ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడడంతో చిరంజీవి ఆశలన్నీ రాబోయే విశ్వంభర పై ఉన్నాయి. బింబిసార తో సక్సెస్ ని అందుకున్న వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారని టాక్. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శుభలేఖ సుధాకర్, ఇషా చావ్లా నటిస్తున్నారు. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆగస్టు 22 న విడుదల అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. స్టాలిన్ తర్వాత త్రిషతో చిరంజీవి చేస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్రం రిలీజ్ అయ్యాక ఎటువంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

Nani :17 ఏళ్లు అయింది….ఇప్పటికీ అడుగుతున్నారు అని గుర్తు చేసుకున్న నాని వైఫ్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×