E-Paper
Advertisement

OTT Movie : మ్యూజిక్ లవర్స్ పండుగ చేసుకునే సినిమా… కోమాలో ఉన్నా కలవరించే ప్రేమ కథ

OTT Movie : మ్యూజిక్ లవర్స్ పండుగ చేసుకునే సినిమా… కోమాలో ఉన్నా కలవరించే ప్రేమ కథ

OTT Movie : ప్రేమ కథలు ఎన్నవున్నా కొన్ని సినిమాలు మాత్రం, కంట తడి పెట్టిస్తూ మనసుని హత్తుకుంటాయి. ఒక్క క్షణంలో జీవితం మొత్తం మారిపోతే, ప్రేమ, ఫ్యామిలీ, కలలు అన్నీ ఒక్కసారిగా ఎంచుకోవాల్సి వస్తే ఏం చేస్తావు? అలాంటి కథతో ఈ మూవీ గుండెను పిండేస్తుంది. ఒక యాక్సిడెంట్ లో ఫ్యామిలీని కోల్పోయి, కోమాలో ఉన్న ఒక యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె ఆత్మ ప్రియుడి కోసం బతకాలా ? చనిపోయిన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలా అనే సందిగ్ధంలో పడుతుంది. ఈ మూవీని చూసేటప్పుడు టిష్యూ బాక్స్ పక్కన పెట్టుకుని చూడాల్సిందే. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

R. J. కట్లర్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ మూవీ పేరు ‘ఇఫ్ ఐ స్టే’. 2014 లో గేల్ ఫోర్‌మాన్ రాసిన 2009 నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో క్లో గ్రేస్ మోరెట్జ్, మిరెయిల్ ఎనోస్, జాషువా లియోనార్డ్ స్టేసీ కీచ్ నటించారు. ఇది 2014 ఆగస్ట్ 22న విడుదలైంది. $11 మిలియన్ల బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా $78.9 మిలియన్లు వసూలు చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

మియా అనే 17 ఏళ్ల అమ్మాయి పోర్ట్‌ల్యాండ్‌లో ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు మాజీ రాక్ బ్యాండ్ మెంబర్స్. చిన్న తమ్ముడు కూడా డ్రమ్స్ నేర్చుకుంటున్నాడు. కానీ మియా మాత్రం రాక్ కాదు… క్లాసికల్ సెల్లో ప్లేయర్! స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో సీటు కూడా కన్ఫర్మ్ అయింది. న్యూయార్క్ వెళ్లి పెద్ద సెల్లిస్ట్ అవ్వాలని కల. అక్కడే ఆమెకి ఆడమ్ అనే రాక్ బ్యాండ్ అనే అబ్బాయితో ప్రేమ మొదలవుతుంది. ఇద్దరి మధ్య ఫుల్ రొమాన్స్ జరుగుతుంది. ఒక రోజు బాగా మంచు కురుస్తుంటుంది. ఫ్యామిలీ అంతా కారులో వెళ్తుంటే ఒక లారీ ఢీ కొడుతుంది. యాక్సిడెంట్ లో తల్లిదండ్రులు, తమ్ముడు ఆన్ ది స్పాట్ చనిపోతారు. మియా మాత్రం కోమాలోకి వెళ్తుంది. ఆత్మ శరీరం బయటకు వచ్చి హాస్పిటల్‌లో తిరుగుతూ ఉంటుంది.

Read Also : అమ్మాయిల వరుస హత్యలు… ఆఫీసర్లకు దొరకని క్లూ… ఓటీటీలోకి మలయాళ హారర్ థ్రిల్లర్‌

ఇక మియా ఆత్మకి ఒక్క ఛాయిస్ ఉంటుంది. బతకాలా? లేక వెళ్లిపోవాలా? ఆమె గతం ఫ్లాష్‌బ్యాక్‌లలో కనిపిస్తుంది. తల్లిదండ్రులతో హ్యాపీ రోజులు, ఆడమ్‌తో మొదటి కిస్సు, సెల్లో ఆడిషన్ టెన్షన్… అన్నీ. హాస్పిటల్‌లో ఆడమ్ వచ్చి మియా… నన్ను వదలేసి వెళ్లొద్దు, నీకోసం నేను ఏం చేయడానికైనా రెడీ అని ఏడుస్తాడు. మియా బెస్ట్ ఫ్రెండ్ కూడా నువ్వు లేకుండా నేను బతకలేను అని అరుస్తుంది. ఆమె ఆత్మ కూడా ఇవన్నీ చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చివరికి మియా బతుకుటుందా ? మరేదైనా జరుగుతుందా అనే విషయాలను, ఈ ఫీల్ గుడ్ మూవీని చూసి తెలుసుకోండి.

 

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×