BigTV English
Advertisement

OTT Movie : వేస్టుగాడని విడాకులిచ్చే పెళ్ళాం… కట్ చేస్తే డస్ట్ బిన్ తో కోటీశ్వరుడిగా… ఇదేందయ్యా ఇదీ

OTT Movie : వేస్టుగాడని విడాకులిచ్చే పెళ్ళాం… కట్ చేస్తే డస్ట్ బిన్ తో కోటీశ్వరుడిగా… ఇదేందయ్యా ఇదీ

OTT Movie : 30 ఏళ్ల నిరోద్యోగి ఒక్కసారిగా 25 మిలియన్ యూరోల లాటరీ గెలుస్తాడు. అయితే ఆ డబ్బు తన భార్యతో పంచుకోకుండా దాచాలని ప్లాన్ చేస్తాడు. ఆతరువాత స్టోరీ సరదాగా సాగిపోతుంది. కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా చిన్నచిన్న ఎమోషన్స్ తో కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ స్పానిష్ కామెడీ మూవీ పేరు ‘ఇఫ్ ఐ వర్ రిచ్ మాన్’ (If I Were Rich Man). 2019లో వచ్చిన ఈ సినిమాకు ఆల్వారో ఫెర్నాండెజ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆలెక్స్ గార్సియా, అలెగ్జాండ్రా జిమెనెజ్, అడ్రియన్ లాస్ట్రా, పౌలా ఎచెవర్రియా, డియెగో మార్టిన్, ఫ్రాంకీ మార్టిన్ , ఆంటోనియో రెసినెస్ వంటి నటులు నటించారు. ఈ చిత్రం టెలిసింకో సినిమా, థింక్ స్టూడియో, మీడియాసెట్ ఎస్పానా నిర్మాణంలో, 2019 నవంబర్ 15న స్పెయిన్‌లో రిలీజ్ అయింది. 98 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDbలో 5.0/10, Rotten Tomatoesలో 57% రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో ఈ సినిమా అందుబాటులో ఉంది.


Read Also : సైనికులకు చేతబడి చేసి చంపే సైకో… నిద్రలోనూ కలవరించే హర్రర్ సీన్స్

స్టోరీలోకి వెళితే

సంతి అనే 30 ఏళ్ల వ్యక్తి స్పెయిన్ లో ఎప్పుడూ అన్‌లక్కీతో బాధపడుతుంటాడు. ఏడాది క్రితం అతనికి ఫ్యాక్టరీలో జాబ్ కూడా పోతుంది. ఇప్పుడు ఒక వాన్‌లో నివసిస్తూ జాబ్ కోసం వెయిట్ చేస్తుంటాడు. అతని భార్య మైతే అతనితో విసిగిపోయి డివోర్స్ ఫైల్ చేస్తుంది. ఇక సంతి తన ఫ్రెండ్స్ మార్కోస్, పెడ్రోతో టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. ఒక రోజు స్కూల్ రీయూనియన్‌లో సంతి తన పాత క్లాస్‌మేట్ మారియో, ఇప్పుడు సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్ బాస్‌ని కలుస్తాడు. మైతే, మారియోతో అఫైర్‌లో ఉందని తెలుసుకుని సంతి కోపంతో డివోర్స్ లాయర్‌ని కలుస్తాడు. ఆ రోజు చివరి ఆశతో ఒక లాటరీ టికెట్ కొంటాడు. మరుసటి రోజు రేడియోలో, తన టికెట్ 25 మిలియన్ యూరోలు గెలిచినట్టు విని సంతి షాక్ అవుతాడు. అయితే భార్యమీద కోపంతో, ముందు రోజు లాటరీ టికెట్ ని చెత్తబుట్టలో పడేస్తాడు. ఆ తరువాత టెన్షన్ గా దానిని వెతికి పట్టుకుని ఆనందపడతారు. బ్యాంక్‌కి వెళ్లి డబ్బు తీస్కోబోతే, బ్యాంక్ మేనేజర్ డామియన్ ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. సంతి-మైతే మ్యారేజ్ కండిషన్స్ ప్రకారం, డివోర్స్ కాకముందు గెలిచిన డబ్బులో సగం (12.5 మిలియన్) మైతేకి వెళ్తుంది. మైతేకి డబ్బు పంచకూడదని సంతి సీక్రెట్‌గా ఖర్చు చేయడం స్టార్ట్ చేస్తాడు.

లగ్జరీ కార్లు, హోటళ్లు, ఫ్యాన్సీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు. అయితే, అతను బయట ఇప్పటికీ పేదవాడిలా నటిస్తుంటాడు. ఇంతలో మైతే, సంతికి మారియో దగ్గర స్టాక్‌మ్యాన్ జాబ్ ఇంటర్వ్యూ ఫిక్స్ చేస్తుంది. సంతి తన డబ్బుతో ఫ్రెండ్స్ మార్కోస్, పెడ్రో లైవ్స్‌ని బెటర్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అవి డిజాస్టర్స్ అవుతాయి. మైతేతో రీకన్సైల్ చేయడానికి అతని ప్రయత్నాలు కూడా ఫెయిల్ అవుతాయి. ఈ క్రమంలో సంతి సీక్రెట్ బయటపడుతుంది. మైతేకి అతను లాటరీ గెలిచిన విషయం తెలుస్తుంది. మారియో బిజినెస్ ప్లాన్స్‌ని సంతికి ఎక్స్‌పోజ్ చేస్తాడు. ఇది మైతేకి అతని గుడ్ సైడ్‌ని చూపిస్తుంది. సంతి, మైతే మధ్య ఎమోషనల్ కన్‌ఫ్రంటేషన్ జరుగుతుంది. ఇక్కడ సంతి తన డబ్బు దాచిన రీజన్స్‌ని, మైతే అఫైర్‌తో హర్ట్ అయిన ఫీలింగ్స్‌ని ఆమెతో షేర్ చేస్తాడు. స్టోరీ ఒక లైట్-హార్టెడ్, ఎమోషనల్ నోట్‌తో ముగుస్తుంది.

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×