BigTV English

OTT Movie : సైనికులకు చేతబడి చేసి చంపే సైకో… నిద్రలోనూ కలవరించే హర్రర్ సీన్స్

OTT Movie : సైనికులకు చేతబడి చేసి చంపే సైకో… నిద్రలోనూ కలవరించే హర్రర్ సీన్స్

OTT Movie : 2022 రష్యన్ దాడి బ్యాక్‌డ్రాప్‌తో అదిరిపోయే ఓక రివెంజ్ థ్రిల్లర్, ఉక్రెయిన్ ప్రజల ఎమోషన్స్ ని హైలైట్ చేస్తోంది. ఇందులో ఉక్రెయిన్ మంత్రగత్తె, రష్యన్ సైనికులపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘The Witch: Revenge’ 2024లో వచ్చిన ఒక ఉక్రెయిన్ ఫోక్ హారర్ సినిమా. దీనికి ఆండ్రీ కోలెస్నిక్ దర్శకత్వం వహించారు. ఇందులో టెటియానా మాల్కోవా, తారస్ సింబల్యూక్, ఒలెనా ఖోఖ్లాట్కినా, పావెల్ విష్న్యాకోవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) , జియో హాట్ స్టార్ (JioHotstar) లలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. కొనోటోప్ అనే మంత్రగత్తెల పురాణాల కథ ఈ సినిమా నడుస్తుంది. 1 గంట 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.3/10, Rotten Tomatoesలో 80% రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

కొనోటోప్ అనే ఉక్రెయిన్ ఊళ్లో ఓలెనా అనే మంత్రగత్తె ఉంటుంది. ఈ ఊరు మంత్రగత్తెలకు ఫేమస్. ఓలెనా తన మాయా శక్తులను వదిలేసి, తన లవర్ ఆండ్రీతో సింపుల్ లైఫ్ గడుపుతూ సంతోషంగా ఉంటుంది. ఇద్దరూ ప్రేమలో మునిగి, హాయిగా ఉంటారు. కానీ 2022లో రష్యన్ సైనికులు ఉక్రెయిన్‌పై దాడి చేసి, కొనోటోప్‌ని ఆక్రమిస్తారు. యుద్ధంలో ఓలెనా, ఆండ్రీ ఊరు వదిలి పారిపోతుంటే, రష్యన్ సైనికులు ఓలెనా కళ్ల ముందే ఆండ్రీని క్రూరంగా చంపేస్తారు. ఓలెనాపై కూడా అఘాయిత్యం చేయడానికి ట్రై చేస్తారు. ఆండ్రీ చావుతో ఓలెనా గుండె బద్దలైపోతుంది. ఆమెలోని మంత్రగత్తె శక్తులు మళ్లీ బయటకొస్తాయి. తన లవర్‌ని చంపిన రష్యన్ సైనికులపై పగ తీర్చుకోవాలని ఓలెనా ఫిక్స్ అవుతుంది. ఒక పవర్‌ఫుల్ తాయెత్తుని ఉపయోగించి, ఆమె తన మాయా శక్తులను తిరిగి పొందుతుంది. ఈ తాయెత్తు శత్రువుల్లో భయం పుట్టిస్తాయి.

ఓలెనా ఒక్కొక్క సైనికుడిని టార్గెట్ చేసి, భయంకర చంపేస్తుంది. సైనికులు బాంబులతో పేలిపోతారు, వాళ్ల వాహనాలు నలిగిపోతాయి. సైనికులు చెట్ల మీద ముక్కలై వేలాడతారు. సినిమాలో ఒక సైడ్ స్టోరీలో, రష్యన్ సైనికులు అఘాయిత్యం చేసిన ఒక స్థానిక అమ్మాయికి ఓలెనా రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ ఇస్తుంది. ఓలెనా పగ తీర్చుకుంటూ, డార్క్ మ్యాజిక్‌లో చిక్కుకుపోయే రిస్క్‌లో పడుతుంది. క్లైమాక్స్‌లో ఓలెనా రష్యన్ కమాండర్‌ని ఫేస్ చేస్తుంది. అతన్ని చంపిందా ? లేక ఇంకో ట్విస్ట్ ఉందా ? అనే సస్పెన్స్ ను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మనిషి నెత్తిపై మిస్టీరియస్ రెడ్ లైన్స్… ఈ ట్రెండింగ్ కొరియన్ సిరీస్ ఏ ఓటీటీలో ఉందంటే?

Related News

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

Big Stories

×