BigTV English

OTT Movie : ఎక్కడా చూడని దరిద్రం… వీడేం ముట్టుకున్నా మటాష్… చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్

OTT Movie : ఎక్కడా చూడని దరిద్రం… వీడేం ముట్టుకున్నా మటాష్… చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్

OTT Movie : వెబ్ సిరీస్ ల ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. ఏ భాషలో అయినా సరే, కంటెంట్ నచ్చితే వదలకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలోనే ఒక మరాఠీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. IMDbలో దీనికి 8.0/10 రేటింగ్ కూడా ఉంది. ఇందులో ఒక మధ్య తరగతి వ్యక్తి, తన జీవితం దారుణంగా ఉందని ఫీలవుతూ, ఒక జ్యోతిష్యుడి వద్దకు వెళ్తాడు. కానీ అక్కడ తన చేతిరేఖలు, మరో వ్యక్తితో సరిగ్గా సరిపోతాయని తెలుస్తుంది. కుమార్ జీవితం చక్రపాణి గతంతో లింక్ అయిందా? తన భవిష్యత్తుని మార్చగలడా? అనేదే ఈ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


MX Playerలో స్ట్రీమింగ్

ఈ మరాఠీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘Samantar’. 2020లో వచ్చిన ఈ సిరీస్ కి సతీష్ రాజవాడే దర్శకత్వం వహించారు. సుహాస్ షిర్వల్కర్ నవల ఆధారంగా దీనిని రూపొందించారు. ఇందులో స్వప్నిల్ జోషి (కుమార్ మహాజన్), తేజస్విని పండిత్ (నీమా), నితీష్ భరద్వాజ్ (సుదర్శన్ చక్రపాణి), జయంత్ సావర్కర్ (స్వామి), గణేష్ రేవ్దేకర్ (షరద్) ప్రధాన పాత్రల్లో నటించారు. సీజన్ 1లో 9 ఎపిసోడ్‌లు (18-20 నిమిషాలు) ఉంటాయి. 2020 మార్చి 13న MX Playerలో ఈ సిరీస్ రిలీజ్ అయింది. మరాఠీతో పాటు హిందీ, తెలుగు, తమిళ డబ్బింగ్‌లో అందుబాటులో ఉంది.


Read Also : ఇక్కడ కోపం వస్తే నరబలి… సైలెంట్ గా నరమేధం సృష్టించే సీక్రెట్ డెలివరీ సర్వీస్

స్టోరీలోకి వెళితే

కుమార్ మహాజన్ (స్వప్నిల్ జోషి), ముంబై స్లమ్‌లో నివసించే 33 ఏళ్ల లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి. జాబ్ స్ట్రెస్, భార్య నీమా (తేజస్విని పండిత్)తో ఫైనాన్షియల్ టెన్షన్స్, కొడుకును కూడా సరిగ్గా చూసుకోలేక ఇబ్బందులు పడుతుంటాడు. అతను దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు. అతను దేవుడిని, జ్యోతిష్యాన్ని పెద్దగా నమ్మడు. కానీ ఈ అన్‌లక్కీ ఈవెంట్స్ తో ఫస్ట్రేట్ అయి, తన ఫ్రెండ్ షరద్ సలహాతో స్వామి మహారాజ్ అనే జ్యోతిష్యుడిని కలుస్తాడు. స్వామిజీ కుమార్ హస్తరేఖలు చూసి షాక్ అవుతాడు. ఇవి 33 ఏళ్ల క్రితం చూసిన సుదర్శన్ చక్రపాణి అనే వ్యక్తి రేఖలతో సరిగ్గా సరిపోతాయి. అతనిది, ఇతనిది ఒకలాగే జీవితం నడుస్తుంటుంది. కానీ స్వామిజీ చక్రపాణి భవిష్యత్తును చెప్పలేదని, కుమార్‌కి కూడా చెప్పనని, అయితే మీరిద్దరి జీవితాలు ప్రమాదకరంగా ఉంటాయని చెప్తాడు.

కుమార్, స్వామితో గొడవపడి చక్రపాణిని కనిపెట్టి తన భవిష్యత్తు తెలుసుకోవాలని అనుకుంటాడు. చక్రపాణి గతం తన జీవితంతో ఎలా లింక్ అయిందో తెలుసుకోవడానికి ముంబై నుంచి పన్హాలా, కొల్హాపూర్, కొంకణ్ వరకు జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఈ ట్రాకింగ్‌లో అతను కొల్హాపూర్‌లో బ్లూ మూన్ కాటేజ్, ఇంపీరియల్ వుడ్స్ కంపెనీలో అతడు ఉన్నట్లు తెలుసుకుంటాడు. అక్కడికి వెళ్ళాక చక్రపాణి కర్జత్ బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాడని తెలుస్తుంది. చివరకు కుమార్ అతికష్టం మీద చక్రపాణిని కలుస్తాడు.

అతని గతంలో ఏమి జరిగిందో, అలాగే కుమార్ గతం కూడా జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చక్రపాణి వృధాప్యంలో ఉంటాడు. తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటాడు. చక్రపాణితో అతని గతం మొత్తం చెప్పమని అడుగుతాడు. చక్రపాణి తన లైఫ్ డీటెయిల్స్ రాసిన ఒక డైరీని కుమార్‌కి ఇస్తాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. రోజుకి ఒక పేజీ మాత్రమే చదవాలని మాట తీసుకుంటాడు. ఇప్పుడు అతని లైఫ్ బెటర్ అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వస్తుంది. ఇలాఉంటే, ఒక రోజు డైరీలో “ఒక కొత్త స్త్రీ అతని జీవితంలోకి వస్తుంది” అని చదువుతాడు. ఈ ట్విస్ట్‌తో అతని భార్య నీమాతో రిలేషన్, డైరీల రహస్యాలు కాంప్లికేట్ అవుతాయి. సీజన్ 1 క్లిఫ్‌హ్యాంగర్‌తో ముగుస్తుంది. ఇక కుమార్ తన డెస్టినీని కంట్రోల్ చేయగలడా, లేక డైరీ అతన్ని మరింత గందరగోళానికి గురిచేస్తుందా ? అనేది ఈ మరాఠీ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

Big Stories

×