E-Paper
Advertisement

Documentary film : అమ్మాయిపై ఒళ్లు గర్పొడిచే దారుణాలు… వివాదాలతో బ్యాన్ అయిన మూవీ

Documentary film : అమ్మాయిపై ఒళ్లు గర్పొడిచే దారుణాలు… వివాదాలతో బ్యాన్ అయిన మూవీ
Advertisement

Documentary film : 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఆధారంగా రూపొందించిన సినిమా ‘ఇండియాస్ డాటర్’ (India’s Daughter). ఈ వివాదాస్పద డాక్యుమెంటరీ చిత్రంలో నిర్భయ తల్లిదండ్రుల ఇంటర్వ్యూలతో పాటు, ఆ ఘటనలో దోషిగా తేలిన ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ కూడా ఉంది. ఆ ఇంటర్వ్యూలో దోషి తన తప్పును సమర్థించుకుంటూ మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయనే కారణంతో భారత ప్రభుత్వం 2015 మార్చిలో ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయకుండా నిషేధించడం కూడా జరిగింది.

ఎక్కడ చూడచ్చు

ఇండియాస్ డాటర్ లెస్లీ ఉడ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ డాక్యుమెంటరీ చిత్రం, బీబీసీలో ప్రసారమయింది. ఇది 2012లో ఢిల్లీలో జరిగిన జ్యోతి సింగ్ అనే 23 యేళ్ళ ఫిజియోథెరపీ విద్యార్థినిపై జరిగిన దారుణాల ఆధారంగా రూపొందింది. 2015 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఎండీటీవీ, యూకేలో బీబీసీ ద్వారా ఈ చిత్రాన్ని ప్రదర్శించాలనుకున్నారు. మార్చి 1న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న ముద్దాయి ఇంటర్వ్యూ ఉందన్న విషయం తెలిసింది. వెంటనే ఈ విషయం మీడియాకు తెలిసి, దీనిపై ధుమారం రేగింది.

Advertisement

భారత ప్రభుత్వం ఈ సినిమా ప్రసారాన్ని కోర్టు ఆదేశాలతో నిలిపివేసింది. బీబీసీ కూడా ప్రసారం చేయబోమని ప్రకటించింది. కానీ యూకేలో 4 మార్చి న ఈ సినిమాను ప్రసారం చేసారు. ఆ తరువాత యూట్యూబ్ లో కూడా ఈ సినిమాను అప్ లోడ్ చేశారు. ఇది యూట్యూబ్ లో సెన్సేషన్ కూడా సృష్టించింది. అయితే భారత ప్రభుత్వం యూట్యూబ్ ను ఈ వీడియోను భారతదేశంలో బ్లాక్ చేయాల్సిందిగా ఆదేశించింది. యూట్యూబ్ ఆ ఆదేశాన్ని పాటిస్తూ వీడియోను తీసివేయడం కూడా జరిగిపోయింది. అయితే ఈ సినిమా ఇండియా లో అందుబాటులో లేదు. ప్రైమ్ వీడియోలో బయట దేశాలలో దీనిని స్ట్రీమ్ చెయ్యచ్చు

నలుగురు దోషులకు ఉరిశిక్ష

ప్రధాన దోషులైన ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్లకు కోర్టు మరణశిక్ష విధించింది. అనేక న్యాయపరమైన పోరాటాల తర్వాత, 2020 మార్చి 20వ తేదీన తెల్లవారుజామున 5:30 గంటలకు ఢిల్లీలోని తిహార్ జైలులో వీళ్ళను ఉరితీశారు. అయితే ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు రామ్ సింగ్, విచారణ జరుగుతుండగానే 2013 మార్చిలో తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. నేరం జరిగిన సమయంలో మైనర్‌గా ఉన్న నిందితుడికి జువైనల్ జస్టిస్ బోర్డు మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించింది. అతను తన శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని 2015 డిసెంబర్‌లో విడుదలయ్యాడు కూడా.

Advertisement

Read Also :  అమ్మాయిలకు నరకం చూపించే జైలు… ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితమే

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×