E-Paper
Advertisement

 సెలూన్ అంటేనే గుండె జారిపోయే హర్రర్ మూవీ… క్లైమాక్స్ కెవ్వు కేక

 సెలూన్ అంటేనే గుండె జారిపోయే హర్రర్ మూవీ… క్లైమాక్స్ కెవ్వు కేక
Advertisement

Indonesian Horror: మనలో ప్రతి ఒక్కరం సెలూన్ కి వెళ్తాము. హెయిర్ కట్ కోసం ప్రతీ ఊర్లోనూ షాప్స్ ఉంటాయి. కానీ ఈ ఊర్లో మాత్రం హెయిర్ కట్ కి వెళ్తే పీక కోస్తారు ఓ షాప్ వాళ్ళు. ఏదో గడ్డం గీస్తుంటే అలా తెగడం కామన్ కదా అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ మాత్రం అలా తెగదు, ఓ ఆడ పిశాచి పీక తెగ్గొట్టి రక్తం తాగుతుంది. సెలూన్ అంటేనే గుండె జారిపోయేలా చేసే ఓ హర్రర్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. 2025లో విడుదలై ఇండోనేషియా సినిమా ప్రేమికులను షాక్ కు గురి చేసిన సైకలాజికల్ హారర్ చిత్రం ‘ఎ ఉమెన్ కాల్డ్ మదర్’ (A Woman Called Mother). మరి ఈ మూవీ కథ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

యాంతి ఈ సినిమాలో ఆడ పిశాచి పేరు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూతురు వీరా, చిన్న కొడుకు డినో. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది. ఆ బాధ నుండి బయట పడాలని పిల్లలతో కలిసి కొత్త నగరానికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఒక చిన్న హెయిర్ సెలూన్ ప్రారంభించి, కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది. మొదట కొంతకాలం అంతా సాఫీగా సాగినట్లే అనిపిస్తుంది. కానీ క్రమంగా యాంతి ప్రవర్తనలో వణికించే మార్పులు వస్తాయి.

Advertisement

సెలూన్‌ కు వచ్చే కస్టమర్లను గాయపరచడం, వారితో వింతగా మాట్లాడడం, ఇంట్లో పిల్లలపై క్రూరంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటుంది. ఆమె కళ్లు విచిత్రంగా మారిపోతాయి. అలాగే మాటల్లో భయం కనిపిస్తుంది. ఒకప్పుడు ప్రేమతో తన పిల్లలను చూసిన ఆ తల్లి, ఇప్పుడు మాత్రం అపరిచితురాలిలా, ద్వేషంతో చూస్తుంది. కూతురు వీరా తన తల్లికి ఏదో జరిగిందని గ్రహిస్తుంది. అసలేం జరిగిందో తెలుసుకునే క్రమంలో ఒక భయంకరమైన నిజం బయట పడుతుంది.

యాంతి సమస్య మానసికంగా కుంగిపోవడం కాదు సమస్య, ఆమెపై ఎవరో చేతబడి చేస్తారు. దానికి సంబంధించిన దెయ్యం ఆమెను ఆవహిస్తుంది. ఆ దెయ్యం ఆమెలోని ‘తల్లి’ అనే భావనను, ‘స్త్రీ’ అనే గుర్తింపును కూడా నాశనం చేస్తుంది. దీంతో క్రూరమైన రాక్షసిగా మారిపోతుంది. ఇక్కడి నుండి కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. తన తల్లి నుండి తమ ప్రాణాలను ఆ పిల్లలు ఎలా కాపాడుకున్నారు ? ఒకప్పుడు తమను ప్రేమించిన తల్లి ఇప్పుడు వారిని చంపడానికి ప్రయత్నిస్తుంటే ఆ పిల్లలు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు ? చివరికి తల్లిని కాపాడుకోవడానికి ఆ పిల్లలు ఏం చేశారు ? అన్నది తెలియాలంటే మూవీపై ఒక లుక్కేయ్యాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

Advertisement

ఈ చిత్రం సైకలాజికల్ హారర్ జానర్‌లో ఒక మైలురాయి లాంటిది. ‘ఎ ఉమెన్ కాల్డ్ మదర్’ Netflix, JioHotstarలో హిందీలో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు కాబట్టి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. ఇండోనేషియా భాషలో ‘దియా బుకాన్ ఇబు’ (Dia Bukan Ibu) అనే పేరుతో వచ్చిన ఈ చిత్రం ‘X’లో జెరోపాయింట్ అనే యూజర్ రాసిన వైరల్ హారర్ థ్రెడ్ ఆధారంగా తెరకెక్కింది.

Read Also: చేతబడి తిప్పికొడితే ఎలా ఉంటుందో తెలుసా ? ఓటీటీని వణికిస్తున్న మలయాళం హర్రర్ సిరీస్

Tags

Related News

ప్రేమ పేరుతో మెంటలెక్కించే పనులు… ఎక్స్ రీఎంట్రీతో బుర్రపాడు ట్విస్ట్… ఈ లవ్ ట్రయాంగిల్ చూస్తే బుర్రపాడు

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే స్పెషల్ టీమ్… కంటెంట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా… డెడ్లీ క్రైమ్స్ తో సీజన్ 9 స్ట్రీమింగ్ షురూ

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

Big Stories

Advertisement
×