OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న మలయాళం సినిమాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాలు చివరి వరకు ట్విస్టులతో ప్రేక్షకుల్ని టెన్షన్ పెట్టిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఇటువంటి సినిమాలు, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కూడా సాధించాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. అతడు మనుషుల్ని అంతక్షరి ఆటను అడ్డం పెట్టుకుని చంపుతుంటాడు. ఈ సినిమా స్టోరీ ట్విస్టులు, టర్న్ లతో ఉత్కంఠంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దాస్ కేదారం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తూ ఉంటాడు. అంతక్షరి ఆటపై ఇతనికి అమితమైన ఇష్టం ఉంటుంది. అతను తన భార్య, కుమార్తెతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. దాస్ తన పోలీస్ స్టేషన్‌లో వచ్చే వారితో కూడా అంతక్షరి ఆడటం అలవాటుగా చేసుకుంటాడు. ఒక రోజు, దాస్‌కు ఒక ఫోన్ కాల్ వస్తుంది, అందులో ఒక వ్యక్తి అతన్ని అంతక్షరి ఆడమని సవాలు చేస్తాడు. దాస్ ఈ సవాలును తిరస్కరించడంతో, అతని కుమార్తెపై దాడి చేస్తాడు. ఆమె ఈ దాడిలో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తుంది. ఈ ఘటన దాస్‌ను తీవ్రంగా కలవరపెడుతుంది. అతను ఈ దాడి చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు విచారణ ప్రారంభిస్తాడు. ఈ విచారణలో భాగంగా, దాస్ గతంలో జరిగిన ఇలాంటి దాడుల గురించి తెలుసుకుంటాడు. ఈ దాడుల వెనుక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ కిల్లర్ మనుషుల్ని చంపడానికి, అంతక్షరి ఆటను ఒక సాధనంగా ఉపయోగిస్తాడు. అతని వల్ల ఇబ్బంది పడ్డావాళ్ళంతా, ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు సంబంధించిన వారని కూడా తెలుస్తుంది. స్టోరీ ముందుకు సాగే కొద్దీ, ఈ సీరియల్ కిల్లర్ గతంలో అనుభవించిన మానసిక గాయాల కారణంగా, ఈ మార్గంలోకి వచ్చాడని దాస్ తెలుసుకుంటాడు. దాస్, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఈ కిల్లర్‌ను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. చివరికి దాస్ ఆ సైకో కిల్లర్ ని పట్టుకుంటాడా ? అంతక్షరి ఆట వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? సైకో గతంలో అనుభవించిన సంఘటన ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : మనుషుల మీద పెత్తనం చేసే ఏలియన్స్ … గుండెల్లో గుబులు పుట్టించే హారర్ థ్రిల్లర్
సోనీ లివ్ (SonyLIV) లో
ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అంతక్షరి’ (Antakshari). 2022 లో విడుదలైన ఈ మూవీకి విపిన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇందులో సైజు కురుప్, సుధీ కొప్ప, ప్రియాంక నాయర్, విజయ్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్టోరీ కేదారం అనే పట్టణంలో జరుగుతుంది. 2022 ఏప్రిల్ 22 నుంచి ఈ మూవీ సోనీ లివ్ (SonyLIV) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.