OTT Movie : మలయాళ సినిమా ప్రపంచంలో హారర్ జానర్ ఒక కొత్త రూపు తీసుకుంటోంది. ఒక హారర్ సిరీస్ కామెడీతో కీతకితలు పెట్టనుంది. ‘ఇన్స్పెక్షన్ బంగ్లా’ (Inspection Bungalow) అనే వెబ్ సిరీస్, మలయాళంలో మొట్టమొదటి హారర్ కామెడీగా గుర్తింపు పొందుతోంది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ సిరీస్ సరికొత్త స్టోరీతో సిద్ధమవుతోంది. డైరెక్టర్ సైజు ఎస్‌ఎస్ రూపొందించిన ఈ సిరీస్, త్వరలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ కామెడీ హర్రర్ సిరీస్ ఎప్పుడు వస్తుంది ? ఏ ఓటీటీలోకి వస్తుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
సైజు ఎస్‌ఎస్ దర్శకత్వం వహిస్తున్న ‘ఇన్స్పెక్షన్ బంగ్లా’ (Inspection Bungalow) హారర్ కామెడీ సిరీస్ లో ముఖ్యమైన పాత్రలలో షాజు శ్రీధర్, జయన్ చేర్‌తల, వీణా నాయర్, బాలాజీ శర్మ, సెంథిల్ కృష్ణ రాజమణి, శ్రీజిత్ రవి ప్రధాన పాత్రాల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ నవంబర్ 14 నుంచి ZEE5, OTTplay Premium లో రాబోతోందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇది మలయాళం, తమిళం, తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది.
Read Also : పీడకలగా మారే సైకో ఫ్యామిలీ మర్యాద… అతిథులను ఆహ్వానించి అన్నీ విప్పించి… మస్ట్ వాచ్ సైకలాజికల్ థ్రిల్లర్
‘ఇన్స్పెక్షన్ బంగ్లా’ సిరీస్ ఒక పాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ జరిగే సంఘటనలను, పోలీసులు ఎలా డీల్ చెపిస్తారో చూపిస్తుంది. హారర్ ఎలిమెంట్స్‌తో వచ్చే ఈ సిరీస్ ప్రేక్షకుల కళ్ళలో భయం, నోటిలో చిరునవ్వు తెప్పించడానికి రూపొందింది. మలయాళంలో ఇలాంటి మిక్స్ జానర్ మొదటిసారిగా వస్తోంది. కాబట్టి ఇది ఫ్యాన్స్‌లో ఎక్సైట్‌మెంట్ సృష్టిస్తోంది. పోస్టర్ చూస్తేనే భూతాలు, పోలీస్ హ్యూమర్ మిక్స్ కనిపిస్తుంది. ట్రైలర్ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మలయాళ కామెడీ మూవీ లవర్స్ కి ఈ నెల విందు భోజనం దొరికినట్టే. మరో రెండు వారాలలో (నవంబర్ 14) ఇది స్ట్రీమింగ్ కి వస్తుండటంతో ఆడియన్స్ కూడా ఎక్సయిటింగ్ గా ఉన్నారు.