OTT Movie : స్టెఫెన్ కింగ్ ఐకానిక్ హారర్ యూనివర్స్ ‘IT’ సిరీస్ ప్రీక్వెల్ ‘IT: Welcome to Derry’ హాట్ టాపిక్ అవుతోంది. మొదటి ఎపిసోడ్ ఆక్టోబర్ 27న విడుదలై, ప్రేక్షకులకు చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తోంది. హాలోవీన్ సీజన్‌కు పర్ఫెక్ట్ టైమింగ్‌తో వచ్చిన ఈ సిరీస్, ఫ్యాన్స్‌లో ఎక్సైట్‌మెంట్ పెంచుతోంది. ఈ సిరీస్ ను ఫ్యామిలీలతో కలసి చూసేస్తున్నారు. ఇక 2వ ఎపిసోడ్ అనుకున్న తేదీ కంటే ముందే విడుదల అయింది. దీంతో మేకర్స్ మాట తప్పారా? అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. వీటి వివారాలపై ఓ లుక్ వేద్దాం పదండి.
2వ ఎపిసోడ్ ముందుగా ‘The Thing in the Dark’ నవంబర్ 3న విడుదల అని ప్రకటించారు. కానీ HBO Max (ఇండియాలో JioHotstar) మేకర్స్ సడన్ గా డేట్ మార్చారు. 2025 ఆక్టోబర్ 31 హాలోవీన్ రోజు నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ చేశారు. ఇది మూడు రోజుల ముందుగానే ఓటీటీలో విడుదల అయింది. మేకర్స్ మాట తప్పడానికి కారణం: హాలోవీన్ స్పెషల్ సర్‌ప్రైజ్! మేకర్స్ ఆక్టోబర్ 27నే హాలోవీన్‌కు స్పెషల్‌గా 2వ ఎపిసోడ్ ను ముందుగా విడుదల చేస్తామని ప్రకటించారు దీనికి కారణం? హారర్ ఫ్యాన్స్‌కు హాలోవీన్ రోజున ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్. హాలోవీన్ ప్రమోషన్‌లో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. వ్యూవర్‌షిప్ పెంచడానికి కూడా ఒక స్ట్రాటజీ తీసుకున్నారు.
Read Also : ఏం సినిమా మావా… ఒక్కొక్క సీన్ కు రోమాలు నిక్కబొడుచుకోవడం పక్కా… హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు
వెల్‌కమ్ టు డెర్రీ మూడవ ఎపిసోడ్ 2025 నవంబర్ 10న విడుదల అవుతుంది. ఇది డెర్రీ అనే చిన్న పట్టణంలోని పిల్లల మిస్సింగ్ ని మరింత లోతుగా చూపిస్తుంది. మొదటి, రెండు ఎపిసోడ్ లలో పెన్నీవైజ్ ఎలా వచ్చాడు, డెర్రీ టౌన్‌లో ఎలాంటి కర్స్ ఉందో చూపిస్తుంది. ఒక ఫ్యామిలీ డెర్రీకి మూవ్ అయిన తరువాత అక్కడ భయంకరమైన సంఘటనలు స్టార్ట్ అవుతాయి. స్టెఫెన్ కింగ్ 1986 నవల ‘IT’ ఆధారంగా ఈ సిరీస్, 2017 & 2019 మూవీలకి ప్రీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ హాలోవీన్‌కు ఈ సిరీస్ అదిరిపోయే గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. గత సినిమాలు ఎలాంటి సెన్సేషన్ సృష్టించాయో, ఈ సిరీస్ అంతకు మించి ఉండబోతోంది.