Actor Sumanth :అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు అక్కినేని సుమంత్ (Akkineni Sumanth). వాస్తవానికి అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) కూతురు కొడుకు అయినప్పటికీ.. నాగేశ్వరరావు దగ్గరే పెరగడంతో అక్కినేని వారసుడిగానే పెరిగాడు సుమంత్. ఆయన వారసత్వంతోనే ఇండస్ట్రీలోకి వచ్చి.. పలు చిత్రాలతో తనకంటూ ఒక మంచి ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా సుమంత్ తాజాగా నటించిన చిత్రం ‘అనగనగా’.. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయడానికి రెడీ అయిపోయారు మూవీ మేకర్స్. అయితే ఈ నేపథ్యంలోనే అనగనగా సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చేస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతున్నారు సుమంత్. ఇందులో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు (Maheshbabu)తో తన అనుబంధం గురించి షాకింగ్ కామెంట్లు చేశారు సుమంత్. అయితే గతంలో సుమంత్, మహేష్ బాబు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు అలా లేదంటూ సుమంత్ మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి ఇంతకీ మహేష్ బాబుతో స్నేహం గురించి సుమంత్ ఏమని స్పందించారో ఇప్పుడు చూద్దాం..
అందుకే నేను మహేష్ బాబుని డిస్టర్బ్ చేయలేదు – సుమంత్
మహేష్ బాబు నాకు చాలా మంచి ఫ్రెండ్.. అయితే అప్పట్లో మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మహేష్ రేంజ్ మారిపోయింది. ఆయన సినిమాలతో, ఫ్యామిలీతో చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన్ని డిస్టర్బ్ చేయడం నాకు నచ్చదు. కేవలం మహేష్ బాబు అనే కాదు నాతో ఉన్న స్నేహితులను ఎవర్ని కూడా నేను డిస్టర్బ్ చేయ్యను. ఎవరి పని వారికి ఉంటుంది. ఇక మిస్ అయ్యాము అనుకున్నప్పుడు మాత్రమే కలుస్తూ ఉంటాము. అంతేకానీ మా మధ్య గొడవలు ఏమీ లేవు. ఇక తాజాగా విడుదలైన నా అనగనగా మూవీకి సంబంధించి కూడా మహేష్ బాబుకి మెసేజ్ పెట్టాను.సినిమా బాగుంది టైం ఉంటే ఒకసారి చూడు అని.. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్సే కానీ ప్రతిసారి కలుసుకోము. సమయం సందర్భం వస్తేనే కలుసుకుంటాం.ఎవరిని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు అంటూ సుమంత్ చెప్పుకొచ్చారు.
ఫ్రెండ్ మాత్రమే కాదు వీరాభిమాని కూడా..
ఇక సుమంత్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో అయినప్పటికీ ఆయన తన ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఏఎన్ఆర్ లేదా నాగార్జున పేరు చెప్పకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెప్పడం గమనార్హం. మహేష్ బాబు తనకు ఫ్రెండ్ మాత్రమే కాదు తన ఫేవరెట్ హీరో అని ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో సుమంత్ చెప్పుకొచ్చారు. మహేష్ బాబు నటించిన సినిమాలన్నీ కచ్చితంగా చూస్తానని సుమంత్ చెప్పుకొచ్చారు. అలా మహేష్ బాబుకి సుమంత్ బెస్ట్ ఫ్రెండ్ గానే కాదు వీరాభిమానిగా కూడా ఉన్నారు.
ALSO READ:Deepika Padukone: దీపిక లీక్ చేసిన ‘స్పిరిట్’ స్టోరీ ఇదేనా? ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద షాకే!