E-Paper
Advertisement

చీకట్లో విరుచుకుపడ్డ వింత రాక్షసులు… 500 ఏళ్ల నాటి నిజం బట్టబయలు… అర్ధరాత్రి ఆ అడవిలో ఏం జరిగింది ?

చీకట్లో విరుచుకుపడ్డ వింత రాక్షసులు… 500 ఏళ్ల నాటి నిజం బట్టబయలు… అర్ధరాత్రి ఆ అడవిలో ఏం జరిగింది ?
Advertisement

Horror Thriller: హర్రర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ప్రతీ ఒక్కరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులోనూ కథ అడవిలో సాగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దట్టమైన అడవి… శత్రువును వేటాడేందుకు లోపలికి వెళ్లిన ఎలైట్ మిలిటరీ టీమ్… కానీ అక్కడ ఎదురయ్యేది మనుషులు కాదు, వందల ఏళ్లుగా నిద్రిస్తున్న ఓ భయంకరమైన అతీంద్రియ శక్తి. అసలు ఆ అడవిలో దాగి ఉన్న రహస్యం ఏంటి ? 500 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటనకు ఇప్పటి పరిణామాలకు సంబంధం ఏంటి ? ఆ భయంకరమైన శక్తుల నుంచి సైనికులు ప్రాణాలతో బయట పడగలిగారా ? ఇలాంటి ఆసక్తికర అంశాలతో సాగే హారర్ థ్రిల్లరే ‘ది అవేకింగ్’ (The Awakening). మరి ఈ హారర్ యాక్షన్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?

కథలోకి వెళ్తే…

ఓ ఎలైట్ మిలిటరీ యూనిట్‌ కు చెందిన సైనిక బృందం ఓ ప్రమాదకరమైన మిషన్ కోసం దట్టమైన అడవిలోకి వెళ్తుంది. తమ శత్రువును వేటాడి మిషన్ పూర్తి చేయడమే వాళ్ల లక్ష్యం. అడవి మొత్తం భయానకంగా ఉంటుంది. అయినా తమకు ఎదురయ్యే ప్రమాదాల గురించి పెద్దగా ఆలోచించకుండా సైనికులు ముందుకు సాగుతారు. కానీ అడవిలోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు చేయిదాటి పోతాయి. మొదట వాళ్లు ఊహించింది శత్రు సైనికులతో జరిగే పోరాటం మాత్రమే.

Advertisement

కానీ అక్కడ వాళ్లకు అర్థంకాని వింత పరిణామాలు ఎదురవుతాయి. అడవిలో ఏదో అసాధారణమైన శక్తి ఉందనే అనుమానం మొదలవుతుంది. తమ కళ్ల ముందే జరుగుతున్న కొన్ని సంఘటనలకు కారణమేంటో తెలుసుకోలేక సైనికులు అయోమయానికి గురవుతారు. ఇదే సమయంలో ఆ అడవిలో ఏళ్ల తరబడి దాగి ఉన్న ఓ పురాతన అతీంద్రియ శక్తి మేల్కొంటుంది. దాని ప్రభావం మొదలైన తర్వాత మిలిటరీ బృందం పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుంది. శత్రువుతో పోరాడేందుకు వచ్చిన వాళ్లే… ఇప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఎవరిని నమ్మాలో, ఏ దిశగా వెళ్లాలో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్లు అడవిలో చిక్కుకుపోతారు. వాళ్లు ఎదుర్కొంటున్న ఈ భయంకరమైన పరిణామాలకు దాదాపు 500 ఏళ్ల క్రితం మొదలైన ఓ రహస్యానికి సంబంధం ఉందని క్రమంగా తెలుస్తుంది. ఆ అడవితో ముడిపడిన పాత శాపం, అక్కడ నిద్రిస్తున్న అతీంద్రియ శక్తి గురించి తెలుసుకునే కొద్దీ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. గతంలో జరిగిన ఓ ఘటన ప్రభావం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతోందని అర్థమవుతుంది.

Advertisement

ఒకవైపు తమ మిషన్‌ను పూర్తి చేయాలి, మరోవైపు ఆ అడవిలో దాగి ఉన్న శక్తి నుంచి ప్రాణాలను కాపాడుకోవాలి. అడవి నుంచి బయటపడే మార్గం కోసం సైనికులు చేసే ప్రయత్నాలు ఒక్కోసారి మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి. చివరికి ఆ 500 ఏళ్ల నాటి రహస్యాన్ని ఛేదించి, ఆ భయంకరమైన శక్తుల నుంచి తప్పించుకుని వాళ్లు అడవి నుంచి బయట పడగలిగారా ? అనేదే సినిమాలో చూడాల్సిన ఆసక్తికరమైన అంశం.

ఏ ఓటీటీలో ఉందంటే ?

‘ది ది అవేకింగ్’ యాక్షన్, హారర్, ఫాంటసీ, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన సినిమా. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

Related News

200 ఏళ్ల వెనక్కి వెళ్లే ప్రేమికులు… అడుగడుగునా డేంజరస్ ట్విస్టులు… టైమ్-ట్రావెల్ విజువల్ వండర్

మందు బాటిల్ వల్ల మొదలైన గొడవ… చివరికి క్రైమ్‌లో చిక్కుకున్న స్నేహితులు… ఫుల్ నవ్వులు

వైరస్ తో దేశాన్నే తుడిచిపెట్టే డేంజరస్ ప్లాన్… హై వోల్టేజ్ మైండ్ బ్లోయింగ్ మిషన్

అండర్‌వరల్డ్ దందాలతో ఆగమయ్యే సిటీ… గ్యాంగ్‌స్టర్ వార్ తో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గ్లామర్ లైఫ్ వెనకున్న సీక్రెట్… సోషల్ మీడియా ఫాలోవర్స్ డోంట్ మిస్

పార్క్‌లో మొదలైన ప్రేమ… పెళ్లి తర్వాత ఊహించని మలుపులు.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

30 దాటినా పిల్లను ఇవ్వట్లేదు… ఈ బ్యాచిలర్ హంగామా చూస్తే నవ్వాగదు

Big Stories

Advertisement
×