E-Paper
Advertisement

30 దాటినా పిల్లను ఇవ్వట్లేదు… ఈ బ్యాచిలర్ హంగామా చూస్తే నవ్వాగదు

30 దాటినా పిల్లను ఇవ్వట్లేదు… ఈ బ్యాచిలర్ హంగామా చూస్తే నవ్వాగదు
Advertisement

Romantic Comedy Series: 30 దాటినా పెళ్లి మాట ఎత్తితే తప్పించుకునే బ్యాచిలర్ అతను. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తుంటే ఒక్కోసారి ఒక్కో కారణం చెప్పి ఎస్కేప్ అవుతుంటాడు. కానీ ఓ దశలో మాత్రం కుటుంబమే అతనికి చెప్పకుండా పెళ్లి కోసం ప్లాన్ చేస్తే ? ఆ ప్లాన్ నుంచి తప్పించుకోవడానికి అతను చేసే హంగామా ఎలా ఉంటుంది ? సమాధానం తెలియాలంటే ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Least Eligible Bachelor) సిరీస్ ను చూడాల్సిందే. మరి ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

హీరోకు వయసు పెరుగుతున్నా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన పెద్దగా ఉండదు. తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా గడపాలని అనుకుంటాడు. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం అతని పెళ్లి ఎప్పుడవుతుందన్నదే పెద్ద టెన్షన్‌ గా మారుతుంది. చుట్టుపక్కల వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తుంటారు. ఇంట్లో ఎవరైనా సంబంధం గురించి మాట్లాడితే… అతను వెంటనే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటాడు. ఒక స్టేజ్ వచ్చాక అతని కుటుంబ సభ్యులు ఇక ఇలా వదిలేస్తే పని కాదని ఫిక్స్ అవుతారు. సంబంధాలు చూడటం మొదలు పెడతారు. ఒక్కో సంబంధం వచ్చినప్పుడు హీరో చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి.

Advertisement

తనకు పెళ్లి వద్దని చెప్పకుండా, సంబంధం కుదరకుండా ఉండేందుకు అతను వేసే ప్లాన్లు ఒక్కోసారి అతనికే రివర్స్ అవుతుంటాయి. స్నేహితులు కూడా అతని పరిస్థితిని చూసి సరదాగా ఆటపట్టిస్తుంటారు. ఇంట్లో వాళ్లు మాత్రం ఎలాగైనా అతన్ని పెళ్లి పీటలెక్కించాలని చూస్తుంటారు. ఇలా కుటుంబ సభ్యులు, స్నేహితులు, పెళ్లి సంబంధాల మధ్య హీరో జీవితం గందరగోళంగా మారుతుంది. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ… పెళ్లి అంటే తనకు ఎందుకు ఇష్టం లేదనే విషయంపై డౌట్స్ స్టార్ట్ అవుతాయి. తన స్వేచ్ఛను కోల్పోతాననే భయం నిజంగానే కారణమా ? లేక గతంలో ఎదురైన ఏదైనా అనుభవమా ? అనే ఆలోచన హీరోలోనే మొదలవుతుంది. కూడా కథలో ఆసక్తిని పెంచుతాయి.

పెళ్లి కోసం కుటుంబం చేసే ప్రయత్నాలు, వాటి నుంచి తప్పించుకునే హీరో ఎత్తులు, మధ్యలో ఎదురయ్యే సంబంధాలు… ఇవన్నీ కలిపి సిరీస్‌ ను లైట్‌హార్టెడ్ ఎంటర్‌టైనర్‌ గా నడిపిస్తాయి. అదే సమయంలో కుటుంబంలో పెళ్లి విషయంలో ఉండే ఆలోచనలు, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య ఉండే తేడాను కూడా సరదాగా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. మరి చివరికి హీరోకి పెళ్లి జరిగిందా లేదా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే వాచ్ దిస్ సిరీస్.

తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Advertisement

వైవా హర్ష (Viva Harsha) ప్రధాన పాత్రలో నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Least Eligible Bachelor). సెప్టెంబర్ 18 నుంచి ఈటీవీ విన్ (ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోంది. పెళ్లి కోసం కుటుంబం పెట్టే ఒత్తిడిని కామెడీగా చూపించే సిరీస్‌ ఇది. తెలుగులోనే ఉంది కాబట్టి సిరీస్ ను ఫ్యామిలీతో కలిసి చూడడం అస్సలు మిస్ అవ్వొద్దు.

Read Also: కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

Tags

Related News

పార్క్‌లో మొదలైన ప్రేమ… పెళ్లి తర్వాత ఊహించని మలుపులు.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

అటకలో పాటలు పాడే మొసలి… ఓటీటీలో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

పగతో రగిలిపోయే గ్యాంగ్‌స్టర్… రాత్రికి రాత్రే ఊరంతా ఊచకోత… మెంటల్ మాస్ రివేంజ్

భారీ ధరకు ‘జనవరి 12 విడుదల’ ఓటీటీ రైట్స్..వెంకీ కెరీర్ లోనే హైయెస్ట్!

This Week OTT Releases : ఓటీటీ లవర్స్ కు పునకాలే.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

Big Stories

Advertisement
×