E-Paper
Advertisement

ఈసారి శాంసంగ్ కొనేవారికి పండగే పండగ.. Galaxy S25 సిరీస్‌పై భారీ ఆఫర్లు!

ఈసారి శాంసంగ్ కొనేవారికి పండగే పండగ.. Galaxy S25 సిరీస్‌పై భారీ ఆఫర్లు!
Advertisement

Flipkart Big Billion Days 2026: ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అదిరిపోయే డీల్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌పై భారీ డిస్కౌంట్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటున్న గెలాక్సీ S25, S25 FE ఫోన్లు సేల్‌లో భారీ ధర తగ్గింపుతో అందుబాటులోకి వస్తే.. శాంసంగ్ అభిమానులకు ఇది మంచి అవకాశంగా మారనుంది. గెలాక్సీ S25 ధర రూ.60 వేల లోపునకు, S25 FE ధర రూ.50 వేల లోపునకు చేరే అవకాశం ఉందని టెక్ నిపుణుల అంచనా.

అక్టోబర్ 8 నుంచి సేల్..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు ముందుగానే డీల్స్ అందుబాటులోకి రానుండగా.. సాధారణ వినియోగదారులకు అక్టోబర్ 9 నుంచి సేల్ ఓపెన్ అవుతుంది. ఈ సందర్భంగా శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి.

Advertisement

Also Read: టాబ్లెట్ కాదు, ల్యాప్‌టాప్ కాదు.. రెండింటి ఫీచర్లతో Ai Plus కొత్త డివైజ్.. ఫీచర్లు అదుర్స్!

Galaxy S25 ప్రత్యేకతలు..

కాంపాక్ట్ ఫోన్‌ను కోరుకునేవారికి గెలాక్సీ S25 మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. ఇందులో 6.2 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 50MP మెయిన్ కెమెరా, ఇతర కెమెరాలు, 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 4000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ చిన్న సైజులో ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది.

S25 FE ఎలా ఉంది?

Advertisement

పెద్ద స్క్రీన్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునేవారికి గెలాక్సీ S25 FE ఆకట్టుకునే ఆప్షన్. ఇందులో 6.7 అంగుళాల డిస్‌ప్లే, 4900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 50MP ప్రైమరీ కెమెరా కూడా లభిస్తుంది.

కొనేముందు ఇవి చూడాల్సిందే..

ఫోన్ కొనుగోలు చేసే ముందు కేవలం సేల్ ధరను మాత్రమే కాకుండా.. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, ఇతర డిస్కౌంట్లను కూడా చెక్ చేయడం మంచిది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే ధర మరింత తగ్గే అవకాశం ఉంటుంది. మీ అవసరం, బడ్జెట్‌కు అనుగుణంగా S25 లేదా S25 FEలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

Also Read: రియల్‌మీ నుంచి హ్యారీ పాటర్ లవర్స్‌కు స్పెషల్ గిఫ్ట్.. ఈ క్రేజీ లుక్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Tags

Related News

హోటల్ బాత్రూమ్ అద్దంతో పాటలు వినొచ్చా? ఈ హైటెక్ ఫీచర్‌ను ఎప్పుడైనా గమనించారా?

కీబోర్డ్ F, J కీలపై ఉండే చిన్న గీతల కథేంటి? టైపింగ్ వేగానికి, ఆరోగ్యానికి ఉన్న లింకేంటి?

టాబ్లెట్ కాదు, ల్యాప్‌టాప్ కాదు.. రెండింటి ఫీచర్లతో Ai Plus కొత్త డివైజ్.. ఫీచర్లు అదుర్స్!

రియల్‌మీ నుంచి హ్యారీ పాటర్ లవర్స్‌కు స్పెషల్ గిఫ్ట్.. ఈ క్రేజీ లుక్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

సంచలనం సృష్టిస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ డీల్స్.. ఐఫోన్ 17తో పాటు ఆ ఐటమ్స్‌పై భారీ ఆఫర్లు!

ప్రయాణాల్లో ఫోన్ బ్యాటరీ డౌన్ అవుతోందా? తక్కువ ధరలో టాప్-5 పవర్ బ్యాంక్స్ ఇవే!

ఐఫోన్ 18 ప్రో అంత చౌక? భారత్ నుంచి దుబాయ్‌కి యువత పరుగులు

Big Stories

Advertisement
×