E-Paper
Advertisement

అన్న కూతురిపైనే అఘాయిత్యం… గుండెను బరువెక్కించే క్లైమాక్స్

అన్న కూతురిపైనే అఘాయిత్యం… గుండెను బరువెక్కించే క్లైమాక్స్
Advertisement

Suspense Thriller Movie : మలయాళ సినిమాలు సైకలాజికల్ థ్రిల్లర్లకు ఎంత పాపులర్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు కూడా అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ సినిమా కోసమే వెతుకుతున్నారా ? అయితే ఈ ‘ఇరట్ట’ మూవీ మీ కోసమే. జోజు జార్జ్ ద్విపాత్రాభినయంతో వచ్చిన ఈ సినిమా కవలల మధ్య గాఢమైన సంబంధాలు, అవినీతి, పశ్చాత్తాపాన్ని ఉత్కంఠభరితంగా చూపించిన సస్పెన్స్ థ్రిల్లర్. Netflixలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులను చివరి ట్విస్ట్ వరకు కట్టిపడేస్తుంది.

కథలోకి వెళ్తే…

కథ ఒక పోలీస్ స్టేషన్‌లో మొదలవుతుంది. డివైఎస్పీ ప్రమోద్, ఏఎస్ఐ వినోద్ ఇద్దరూ కవల సోదరులు. ఒకరి ఆలోచనలు, ప్రవర్తన మరొకరికి పూర్తి వ్యతిరేకం. ప్రమోద్ సాదాసీదా, బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి కాగా… వినోద్ అవినీతిపరుడు, క్రూరుడు, అందరితో గొడవలు పడే స్వభావం కలిగిన వ్యక్తి. వారిద్దరి మధ్య ఉన్న ద్వేషం చిన్నప్పటి నుంచి మొదలైంది. ఒకరోజు వినోద్ తనే పని చేసే పోలీస్ స్టేషన్ లోపలే తుపాకీతో కాల్చుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. స్టేషన్ లోపలే ఒక పోలీస్ అధికారి హత్యకు గురవడంతో ముగ్గురు పోలీసులు అనుమానితులుగా విచారణ మొదలవుతుంది.

Advertisement

ఈ కేసు దర్యాప్తు బాధ్యత వినోద్ సొంత అన్న అయిన ప్రమోద్‌కు అప్పగిస్తారు. విచారణ సాగుతున్న కొద్దీ ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా కవలల చిన్ననాటి చేదు జ్ఞాపకాలు, వారి తండ్రి వల్ల వారి జీవితాలు ఎలా నాశనమయ్యాయి, వినోద్ ఎందుకు అంత క్రూరంగా మారాడనే విషయాలు బయటపడతాయి. ప్రమోద్ తన సోదరుడి మరణం వెనుక ఉన్న నిజాలను వెలికితీస్తూ వెళ్తాడు. ప్రతి సన్నివేశం కొత్త సస్పెన్స్‌ను యాడ్ చేస్తుంది. సినిమా ముగింపులో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను తీవ్ర షాక్‌కు గురి చేస్తుంది. వినోద్‌ను ఆ ముగ్గురు పోలీసులు చంపలేదని, అది హత్య కాదు… ఆత్మహత్య అని ప్రమోద్ కనిపెడతాడు. వినోద్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలిసి ప్రమోద్ గుండె పగిలిపోతుంది. మరి ఆ కారణం ఏంటి ? వినోద్ చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు వేధించిన అమ్మాయి ఎవరు ? వినోద్ గతం ఏంటి ? సినిమాలో వచ్చే హృదయవిదారకమైన క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలుసుకోవాలంటే మూవీపై ఒక లుక్కేయండి.

జోజు జార్జ్ వన్ మ్యాన్ షో ఈ సినిమా. డబుల్ రోల్‌తో అద్భుతమైన నటన చూపించాడు. పూర్తి భిన్నమైన రెండు పాత్రల్లోనూ జీవించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అతని హావభావాలు, కన్నీళ్లు ప్రేక్షకులను కంట తడి పెట్టిస్తాయి. ఇది అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌లలో ఒకటి. అంజలి, శ్రీంద, ఆర్యా సలీం, సబుమోన్ అబ్దుసమద్ కీలక పాత్రలు పోషించారు. ఎం.జి. కృష్ణన్ మొదటి సినిమాతోనే అద్భుత దర్శకత్వం చూపించాడు. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ మూడ్‌ను మరింత పెంచుతుంది.

Advertisement

Read Also : జైలులోనే అతి కిరాతకంగా హత్య… సైకో కిల్లర్ కు చెక్ పెట్టే లేడీ కిలాడీ

Tags

Related News

అర్జునుడిని మించిన విలుకాడు.. అయినా జీవితమంతా అవమానాలే… ఓటీటీలోకి తెలుగులోనే కర్ణుడి కథ

ఇదెక్కడి ఉన్మాదంరా అయ్యా… పెళ్ళాన్ని చంపిందని షార్క్ పై పగబట్టే సైకో

ఒక హత్య… వంద అనుమానాలు… క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గ్యారంటీ

డబ్బుల కోసమే బాయ్ ఫ్రెండ్ తో ప్రేమ డ్రామా… నాగ దుర్గ తమిళ మూవీ తెలుగు స్ట్రీమింగ్ షురూ

ఒక ప్రయాణం… రెండు ప్రేమకథలు… ప్రతి కుటుంబం చూడాల్సిన రోడ్ ట్రిప్ డ్రామా

తల్లికి పెళ్లి చేయాలనుకునే పెళ్లీడుకొచ్చిన కొడుకు… విజయ్ ఆంటోని ఫ్యామిలీ డ్రామా తెలుగులో

కుస్తీ పోటీల్లో ఇరగదీసే భార్య… ఇంట్లోనే స్ట్రగులయ్యే భర్త… తమిళ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు తెలుగులోనే

చెక్క వంతెన దాటితే చావు మూడినట్టే… క్లైమాక్స్‌తో పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ మూవీ తెలుగులో

Big Stories

Advertisement
×