Brian Thomas: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).. తెగ పాపులర్ అయ్యాడు. మొన్నటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పేరు సంపాదించుకున్న వైభవ్.. ఇప్పుడు అగ్రెసివ్ గా మారిపోయి.. గొడవలకు దిగుతున్నాడు. అచ్చం విరాట్ కోహ్లీ లాగా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాడు వైభవ్. లేటెస్ట్ గా శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా A మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ట్రై సిరీస్ లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ గొడవ (Vaibhav Sooryavanshi Sri Lanka A Players Clash) పెట్టుకున్నాడు. ఓ శ్రీలంక ప్లేయర్ ను వెనక్కి కూడా నెట్టేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఈ సంఘటనపై వైభవ్ సూర్యవంశీదే తప్పు అన్నట్లుగా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. వెంటనే అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
శ్రీలంక ప్లేయర్లతో గొడవ పెట్టుకున్న 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశంపై శ్రీలంక క్రికెట్ బోర్డు మాజీ మీడియా మేనేజర్ బ్రియాన్ థామస్ (Brian Thomas) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వాడు 15 ఏళ్ల బుడ్డోడు కాదని… పందిలా బలిసాడంటూ కారు కూతలు పూశాడు. ఐపీఎల్ లో బాగా మేసి.. ఇప్పుడు శ్రీలంక ప్లేయర్లపై దాడికి దిగాడని మండిపడ్డారు. వెంటనే వైభవ్ సూర్య వంశీ పై బ్యాన్ విధించాలంటూ డిమాండ్ చేశారు. అప్పుడే వైభవ్ పొగరు తగ్గుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బ్రియాన్ థామస్. ఒక మ్యాచ్ ఆడకుండా బ్యాన్ విధిస్తే… తోటి క్రికెటర్లతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటాడని చురకలు అంటించారు. ఇలాంటి విలేజ్ కుర్రాలను అసలు టీమిండియా ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో? అర్థం కావడం లేదంటూ రెచ్చిపోయి మాట్లాడారు. ఈ క్రమంలో బ్రియాన్ థామస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ట్రై సిరీస్ లో భాగంగా సోమవారం శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ రెండు A జట్లు అద్భుతంగా రాణించగా మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీని శ్రీలంక ప్లేయర్లు రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. ఇదేమైనా ఐపిఎల్ అనుకున్నావా ? కాదు కాదు ఇంటర్నేషనల్ క్రికెట్ అంటూ స్లెడ్జింగ్ చేశారట. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వైభవ్.. శ్రీలంక క్రికెటర్ల పై సీరియస్ అయ్యాడు. ఓ ప్లేయర్ ను వెనక్కి కూడా నెట్టేశాడు. కాగా ప్రాథమిక సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీతోపాటు తిలక్ వర్మపై కూడా ఐసీసీ యాక్షన్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
🚨HEATED ARGUMENT BTW VAIBHAV & SRI LANKA 🚨
Sri Lankan Players🗣️:- We are talking with Umpires, Go away, you smell bad.🧐
Vaibhav S 🗣️: How can you say this, I took a bath two years ago😳 pic.twitter.com/E60tLD9GBP
— SheR•ALI (@Sher__Ali) June 15, 2026