BigTV English

Akhanda 2 OTT : ‘మేం చెప్పిందే వినాలి’… బాలయ్య మూవీపై పెత్తనం

Akhanda 2 OTT : ‘మేం చెప్పిందే వినాలి’… బాలయ్య మూవీపై పెత్తనం

OTT Rules Nandamuri Balakrishna Akhanda 2 Movie: లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమలో పరిస్థితులు మారాయి. డబుల్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన ఓటీటీలు ఇప్పుడు ఇండస్ట్రీనే ఏలేస్తున్నాయి. ఒకప్పుడు థియేటర్లో మాత్రమే సినిమాలు విడుదల అయ్యేవి. కానీ, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చాక ఓటీటీ క్రేజ్ బాగా పెరిగిపోయాయి. థియేటర్లలో రిలీజైన ప్రతి సినిమా ఆ తర్వాత ఓటీటీలో రావడం తప్పనిసరి అయిపోయింది. దీంతో థియేటర్ల కంటే ఓటీటీలకే ఆదరణ పెరిగింది. ప్రేక్షకులు కూడా ఓటీటీలోనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.


టాలీవుడ్ కి ఓటీటీ సెగ

ఈ క్రమంలో ఓటీటీల హవా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పెత్తనమంత ఓటీటీలదే అనేట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో ఓటీటీల హవా బాగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఓటీటీలే నిర్ణయిస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే ఇది చిన్న సినిమాలు, మిడిల్ బడ్జెట్ సినిమాల విషయంలోనే కాదు.. స్టార్ హీరో చిత్రాలపై కూడా ఓటీటీలే పెత్తనం చేస్తున్నాయట. పాన్ ఇండియా నుంచి చిన్న సినిమాల వరకు వాటి రిలీజ్ విషయంలో ఓటీటీలు కలుగజేసుకుంటున్నాయి. ఇప్పుడు ఏకంగా ఈ సెగ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాకు తగిలింది.


అఖండ 2 రిలీజ్ పై డైలామా

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కితోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2021లో విడుదలైన అఖండ మూవీకి ఇది సీక్వెల్ గా అఖండ 2 రూపొందుతోంది. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి కూడా అదే రేంజ్ పార్ట్ 2ని ప్లాన్ చేశాడు. గతేడాది సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా దాదాపు షూటింగ్ ని పూర్తి చేసుకుంది. చివరి దశకు చేరుకున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. సెప్టెంబర్ 25న అఖండ 2ని రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది.

బాలయ్య సినిమాపై ఓటీటీ ఆంక్షలు

అయితే ఈ తేదీకి సినిమా వాయిదా పడేలా కనిపిస్తోంది. అదే రోజు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కూడా రిలీజ్ అయ్యే కానుంది. దీంతో అఖండ 2 టీం ఈ సినిమా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా చిత్ర బృందం చర్చలు జరుపుతుంటే.. మరోవైపు అఖండ 2ని వాయిదా వేసేందుకు ఓటీటీ సంస్థ సముఖత చూపిస్తోందట. ఈ సినిమా వాయిదే వేసేందుకు వీలులేదంటూ నిక్కచ్చిగా చెబుతోందట. అంతేకాదు మూవీ రిలీజ్ విషయంలో సదరు ఓటీటీ సంస్థ నిబంధనలు పెడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి పరిశ్రమలో బాలయ్యకు ఎదురు ఉండదు. తన సినిమాల విషయంలో ఆయన చెప్పిందే శాసనం అన్నట్టు వ్యవహరిస్తారు.

దర్శక నిర్మాతలు సైతం బాలయ్య మాటకు ఎదురు చెప్పరు. అలాంటిది బాలయ్య సినిమాపై డిజిటల్ సంస్థ పెత్తనం చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో సదరు సంస్థ మేం చెప్పిందే వినాలంటూ నిబంధనలు పెడుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో సదరు ఓటీటీ సంస్థ తీరుపై అఖండ 2 మూవీ టీం అసహనంతో ఉందట. ప్రస్తుతం దీనిపై మూవీ టీం, ఓటీటీ సంస్థ మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మరి అఖండ 2 రిలీజ్ విషయంలో సదరు ఓటీటీ సంస్థ వెనక్కి తగ్గుతుందా? లేక మేం చెప్పిందే వినాలి అంటుందా? చూడాలి. కాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం.

Related News

OTT Movie : మగాళ్లను దారుణంగా చంపే లేడీ కిల్లర్… 20 ఏళ్ల తరువాత అచ్చం అదే రీతిలో హత్యలు… కిర్రాక్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పనమ్మాయితో యజమాని రాసలీలలు… భర్త ఉండగానే సీక్రెట్ రొమాన్స్… క్లైమాక్స్ లో బుర్రపాడు ట్విస్ట్

OTT Movie : 7 రోజులు ఏకాంతంగా… బిజినెస్ మ్యాన్ తో 20 ఏళ్ల అమ్మాయి బిగ్ డీల్… నెవర్ బిఫోర్ ఏరోటిక్ థ్రిల్లర్ మావా

OTT Movie : ట్రిప్పుకెళ్లి టీచర్ తో అర్ధరాత్రి అరాచకం… సైకో ట్రాప్ లో అడ్డంగా బుక్కయ్యే అమాయకురాలు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : విమానంలో వైరస్ లీక్… పిచ్చోడు చేసే మెంటల్ పనికి పైప్రాణాలు పైనే… సీను సీనుకో ట్విస్ట్ మావా

OTT Movie : భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

Big Stories

×